12, జూన్ 2011, ఆదివారం

బాబాల దగ్గరున్న ఆస్తులను ముందు ప్రజల పరం చేయాలి..






అవినీతి వ్యతిరేక పోరాటం జరుగుతున్న సందర్భంగా మన దేశంలోని స్వాములు, బాబాల దగ్గరున్న ఆస్తులను ముందుగా జాతీయం చేయాలి. ఎందుచేతనంటే వీళ్ళ దగ్గరకొచ్చే వాళ్ళలో తొంభై తొమ్మిది శాతం మంది అవినీతి రాజకీయ నాయాకులు, లంచగొండి అధికారులు, కాంట్రాక్టర్లే కాబట్టి ప్రజల సొమ్మును అప్పనంగా దోచి పాపభీతితో కొంత వీళ్ళకు దానం చేయడమో, లేక వీళ్ళ దగ్గర దాచుకుంటే ఏ ఆదాయపు పన్ను శాఖ వాడి కళ్ళూ పడవని, వీళ్ళ పళ్ళూడవని ధైర్యంతో దాచుకుంటున్నందున వీళ్ళ ఆస్తులను ముందుగా జప్తు చేయాలి. బాబాల దగ్గర వేలాది కోట్ల రూపాయలు పోగుపడడం చూస్తుంటే ఇదంతా లెక్కకు మించి దాగిన నల్లధనమే అనిపిస్తోంది..


అవినీతి వ్యతిరేక పోరాటానికి సంఘీభావంగా కూచున్న రాందేవ్ బాబా ప్రకటించిన పదకొండు వందల కోట్లు ఆసనాలు వేస్తె వచ్చాయా? అలా అయితే వీధుల్లో ఈటీ వేషాలు వేస్తున్న వాళ్ళు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? ఇది అలా వుంచితే ఇంకా ఈయన గారికి అనేక కంపెనీలలో షేర్లున్నాయి. వాటిని లెక్కపెట్టలే.. ఈ మధ్య కుళ్ళబెట్టి చంపిన సత్య సాయి బాబా దగ్గర లక్షల కోట్లు మూలుగుతున్నాయి. వీటిని ఆ ట్రస్ట్ పేరుతో దొబ్బేయక ముందే ప్రభుత్వం జప్తు చేయాలి. ఇప్పటికే టన్నులకొద్దీ బంగారం బెంగళూరు తరలిపోయిందంటున్నారు. ఇంక విదేశాలకు చేరక ముందే వీటన్నింటిని స్వాధీనం చేసుకోవాలి.. అలా అయితే ఏ ప్రపంచ బ్యాంకు దగ్గరా అప్పుకోసం మోకరిల్లనక్కర్లేదు.

గణపతిసచ్చిదానంద, కల్కి బాబా (ఈయన ఆశ్రమంలో మానభంగాలు, మర్డర్లు జరిగినాయన్నది ఎవరూ పట్టించుకోలేదు) మొ.న బాబాలు, అమ్మల దగ్గర ఎంత మూలుగుతుందో? భక్తి మాటున ఈ ఆశ్రమాలలో జరుగుతున్న వ్యాపారాలను ఇంకా ఈ శతాబ్ధంలో కూడా మూగగా చూస్తూ వూరుకోవడం చూస్తుంటే పాలక ప్రతిపక్షాల వాటా కూడా తేల్చాలి. వీటన్నింటిపై అన్నా హజారే గారు దృష్టి పెట్టాలి. ఇవన్నీ నల్లధనంలో భాగమే...

అవినీతి వ్యతిరేక పోరాటం వర్థిల్లాలి.