1, సెప్టెంబర్ 2011, గురువారం

కులం తెలిసాక పెళ్ళి వద్దా??

ఈ రోజు పేపర్లో ఓ వార్త.. ఓ అగ్ర కులస్తుడైన ఉపాధ్యాయుడు షె.కు.నికి చెందిన ఉపాధ్యాయురాలిని ప్రేమించి పెళ్ళి వరకు వచ్చాక మా ఇంట్లో వద్దంటున్నారని తప్పించుకోజూడడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.. ఇది అందరికీ సుపరిచితమైన వార్తలానే వుండొచ్చు. కానీ ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ వాడు అమ్మాయిని ఇలా ప్రేమ పేరుతో వంచించి, మోసం చేయడం దారుణం..

కులపిశాచి లేదు అంతా బస్సులలో రైళ్ళలో కలిసే తిరుగుతున్నాం... హోటళ్ళలో కలిసే తింటున్నాం...వాళ్ళూ ఉద్యోగాలు తేరగా దొబ్బేసి చాలా అభివృద్ధి చెంది వున్నారు అని అక్కసు వెళ్ళగక్కే వాళ్ళు ఈ సమాజంలో నిజంగా కుల పిచ్చి లేదని చెప్పగలరా?? దళిత బహుజనులను చూస్తూ అసూయపడుతూ తిట్టకుండా మాటాడగలరా?? ఇంకా ఎన్ని నిండు ప్రాణాలను హరిస్తారు?? రిజర్వేషన్లలో మీరు విదిల్చిన ఆ సగం కూడా అందరికీ అందుబాటులో వున్నాయా?? ఎంతమంది ఈ కాలం పది తరువాత చదువుతున్నారు?? చదవగలుగుతున్నారు??? అవినీతిపై ఉద్యమాలు చేస్తారు కాలరెగరేస్తారు...అదే అంటరానితనంపైనంటే ఆమడ దూరం పారిపోతారు....

కులపిచ్చి ప్రేమా మాకొద్దు...