దైవం వుందంటే దెయ్యమూ వుందనుకోవాలె..
హీరో వుంటే విలనున్నట్టు..
కానీ రెండూ మనుషులను పీక్కు తినేవే..
ఒకడు పాపం చేయకూడదంటూనే చేసే వార్ని క్షమించే మూర్ఖుడు.. (ఇక్కడో చిన్న ట్విస్ట్ ఈ పాపాలకు కులాలున్నాయండోయ్..మళ్ళీ వీటిని తప్పించే భూసురులు రెడీగానే వుంటారు మరి..ఎక్కడో నరకముందంట అక్కడ ఏవో శిక్షలు వేస్తారంట..అవి తప్పించే బ్రోకర్లను ఇక్కడ వుంచాడంట..చా..దీనమ్మా బతుకు)
మరొకడు చేసే వాడిని వెన్నంటి చంపే భయంకరుడు..(ఇందులోనూ దూరుతారండోయ్ మన భూకాసురులు.,,వీటిని కూడా పారద్రోలే నెపంతో సొమ్ము చేసుకునే బాబాలు, స్వాములు, మంత్రగాళ్ళ వేషాలతో..చీ సొమ్ము కోసం ఎంతకైనా తెగిస్తారు ఈ ఒల్లొంగని నాయాళ్ళు..)
కానీ ఏమీ చేయకుండా వుండలేని మనిషి ఈ భూమ్మీద వుండగలడా? అదీ ఒక జీవితమేనా??
అందుకే ఈ రెండింటినీ పక్కకు పెట్టి నిర్భయంగా బతికే మనిషి కావాలి...