1, సెప్టెంబర్ 2011, గురువారం

కులం తెలిసాక పెళ్ళి వద్దా??

ఈ రోజు పేపర్లో ఓ వార్త.. ఓ అగ్ర కులస్తుడైన ఉపాధ్యాయుడు షె.కు.నికి చెందిన ఉపాధ్యాయురాలిని ప్రేమించి పెళ్ళి వరకు వచ్చాక మా ఇంట్లో వద్దంటున్నారని తప్పించుకోజూడడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.. ఇది అందరికీ సుపరిచితమైన వార్తలానే వుండొచ్చు. కానీ ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ వాడు అమ్మాయిని ఇలా ప్రేమ పేరుతో వంచించి, మోసం చేయడం దారుణం..

కులపిశాచి లేదు అంతా బస్సులలో రైళ్ళలో కలిసే తిరుగుతున్నాం... హోటళ్ళలో కలిసే తింటున్నాం...వాళ్ళూ ఉద్యోగాలు తేరగా దొబ్బేసి చాలా అభివృద్ధి చెంది వున్నారు అని అక్కసు వెళ్ళగక్కే వాళ్ళు ఈ సమాజంలో నిజంగా కుల పిచ్చి లేదని చెప్పగలరా?? దళిత బహుజనులను చూస్తూ అసూయపడుతూ తిట్టకుండా మాటాడగలరా?? ఇంకా ఎన్ని నిండు ప్రాణాలను హరిస్తారు?? రిజర్వేషన్లలో మీరు విదిల్చిన ఆ సగం కూడా అందరికీ అందుబాటులో వున్నాయా?? ఎంతమంది ఈ కాలం పది తరువాత చదువుతున్నారు?? చదవగలుగుతున్నారు??? అవినీతిపై ఉద్యమాలు చేస్తారు కాలరెగరేస్తారు...అదే అంటరానితనంపైనంటే ఆమడ దూరం పారిపోతారు....

కులపిచ్చి ప్రేమా మాకొద్దు...

10 కామెంట్‌లు:

  1. కులం పేరు అడగకుండా ప్రేమించినవానికి పెళ్ళి విషయంలోనే కులం పేరు ఎందుకు అడగాలనిపించింది. ప్రేమిస్తే ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాల్సి వస్తుందని తెలియదా? పోస్ట్-మోడర్న్ ప్రేమికునిలా ప్రేమ వేరు, పెళ్ళి వేరు అనుకున్నాడా?

    రిప్లయితొలగించండి
  2. ఒకవేళ పోస్ట్-మోడర్న్ ప్రేమికునిలా ప్రేమ వేరు, పెళ్ళి వేరు అనుకుని ఉంటే పెళ్ళి ప్రస్తావన తేకూడదు. మన ప్రేమ పెళ్ళి దాక వెళ్ళదు అని ముందే చెప్పాలి. పోస్ట్-మోడర్న్ ప్రేమలో అలా చెప్పకపోతే అది మోసమే.

    రిప్లయితొలగించండి
  3. ప్రవీణ్ గారూ వాడికి ఆధునికాంతర ప్రేమలాంటివి తెలీని ప్రాంతంవాడిది. ఇది విజయనగరం జిల్లా వార్తలలో వచ్చింది. తన మోజు తీరాక వాడికి వాడి కులం సంబంధం చేసుకుంటే వచ్చే కట్న కానుకలు, పరువు గుర్తుకు వచ్చి వుంటాయి. అంతకు మించి వాడేమీ పవన్ కళ్యాణో, రాం చరణో కాదనుకుంటా..ఏమైనా ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నాడు...

    రిప్లయితొలగించండి
  4. ఆధునికాంతర ప్రేమలు, వంచక మనస్తత్వానికి హైదరాబాద్, విజయనగరం అని తేడా ఉండదు. అతను కులం, కట్నం అంత ముఖ్యం అనుకుంటే ప్రేమించేటప్పుడే అవి గుర్తుండాలి.

    రిప్లయితొలగించండి
  5. కులగజ్జి ఇంత స్పష్టంగా కనిపిస్తున్న తరువాత కూడా ఈ రోజుల్లో కులవ్యవస్థ లేదు అనీ, దళితులూ, అగ్రకులాలవాళ్ళూ సమానమైపోయారనీ ఉత్తుత్తి కబుర్లు చెపుతుంటారు సిగ్గు లేకుండా.

    రిప్లయితొలగించండి
  6. నిన్న గూగుల్ ప్లస్‌లో ఒక లింక్ చూసిన తరువాత నువ్వు మళ్ళీ గుర్తొచ్చావు. ఇన్ని రోజులు నువ్వు దళితవాదం గురించి వ్రాయకుండా ఎక్కడ సంచరిస్తున్నావు?

    రిప్లయితొలగించండి
  7. నేను ఎలాగూ Eternal Wanderer (నిరంతర సంచారి) of the blogosphere. అయినా నేను అభిమానించే నీ లాంటి బ్లాగర్‌ల పోస్ట్‌లు చాలా రోజుల పాటు కనిపించకపోతే మనసు ఎటో పోయినట్టు ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  8. నీ గురించి నేను & మహేశ్ గూగుల్ చాట్‌లో చర్చించుకున్న రోజులు కూడా ఉన్నాయి. నీ పోస్ట్‌లు నాకు నచ్చాయి కానీ నువ్వు చాలా రోజులకి ఒకసారి పోస్ట్‌లు వ్రాయడమే నాకు అదోలా అనిపించే విషయం.

    రిప్లయితొలగించండి
  9. వడ్రంగి పిట్టగారు, ఇది చదవండి: http://4proletarianrevolution.mlmedia.net.in/141453482

    రిప్లయితొలగించండి

Explore yourself..