23, మే 2010, ఆదివారం

బ్లాగర్లూ రిజర్వేషన్ల వలన దళితులెవరైనా అంబానీలయ్యారా?



బ్లాగ్ మిత్రులకు నాదొక ప్రశ్న.
పూర్తిగా జస్టిఫై చెయ్యి. ఎక్కడైనా దళిత పదం కనబడినా, వారికి మద్ధతుగా రాత అగుపించినా ఒకటే దాడి చేస్తున్నారు. ఈ అరవై మూడు సంవత్సరాల స్వాతంత్ర్య పాలనలో, 60 యేళ్ళ రాజ్యాంగం అమలులోకి వచ్చిన కాలంలో ఒక్క దళితుడైనా అంబానీగానో, లక్ష్మీ మిట్టల్ గానో అవతరించాడా? ఒక్క రూపాయి పెట్టుబడితో వీళ్ళకు తెలిసినట్లుగా వేలకోట్లు ఆర్జించే ఉపాయాలు దళితులకు తెలియలేదెందుకో. రిజర్వేషన్ల వలన వారు పొందిన ఉద్యోగ శాతమెంత? మీరు యిస్తున్నది ముష్టి 7.5 శాతం. దానికే మానుండి అభ్యర్థులు లేక మరల బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి. ఏమైనా అంటే మేము మెరిట్ వీరుల మంటారు. మరి గిరిజనులు, బీసీలు తో కలుపుకొని పోనీ పోయిన ఆ 40 శాతం మినహా వాటిలో అరవై శాతం మీదే కదా? జనాభాలో మేమున్నది ఎంత? మామీద పడి ఏడ్వడం దేనికి? ఉన్నతోద్యోగాలలో వున్నదెవరు? కీలక అధికారాలన్నీ మీ చేతుల్లోనే వున్నాయి. ఎప్పుడూ రిజర్వేషన్ల వలన మీరేదో కోల్పోయినట్లు ఏడ్పు దేనికి? బీసీ కులాలలో నిజంగా వెనకబడ్డ తరగతులెన్ని? వారు పొందిన వుద్యోగాలెన్ని, పదవులెన్ని? మరల వాటిలో కూడా అగ్రవర్ణాలే ఈ మధ్యకాలంలో చేరిపోతున్నారు. అసలు ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉద్యోగాలెన్ని? అంతా ప్రైవేటు మాయజేసి అన్ని అవకాశాలు మీరు పొందడంలేదా? మరొక్క ప్రశ్న ఈ బ్లాగులు రాస్తున్న వాళ్ళలో దళితులెందరు? మీ అంత తీరుబడి వాళ్ళకు లేకే కదా? నేను కామెంట్లకు మాత్రమే పరిమితమవుదామనుకున్నా కానీ మీ గోలెక్కువై యిలా అడుగుపెట్టాను. రండి చర్చిద్దాం...

17 కామెంట్‌లు:

  1. చూడు బాస్ దళితుడైన..అగ్రవర్ణ లైన కష్టపడి పనిచేస్తే పైకి వస్తారు..అందుకు ఉదాహరణ మన అంబెద్కర్..లాంటి వారు....అంతే గాని ఇచ్చింది ఎంతా..... పోయింది అంతా..అని లేక్కలు వెసుకుంటుంటే..దళితులు ఇంకా దిగజారుతు పోతారు..ఏం ఇచ్చారు అని కాకుండా..ఏం ఇస్తున్నాం అని అలోచించు.....తిసుకోవాడానికి కాకుండా..ఇవ్వడానికి ప్రయత్నించు....దళితులే కాదు మీగిలిన వర్గాల వారు కుడా వెనకబడే ఉన్నారు...కాని వాళ్ళు మీలా..అడుకోవడం లేదు....కనిసం మీకు రిజర్వేషన్ల రాయితిలు ఉన్నాయి కాని మిగిలిన వర్గాల వారికి అవి కుడా లేవు.....సో....ప్రతీభ తో గౌరవం పోందు..దేహి అని కాదు....

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. ఇంకో మాట నువ్వు అంటున్న ఆ అంబానీ, లక్ష్మీ మిట్టల్ లు గోప్పవారైంది వారి ప్రతిభ ములాన? లేక కులం,రిజర్వెషన్ల మూలంగానా?..ఇక రాజకియానికి వస్తే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిని నాయకుడిగా చేయాలి కాని.....కులం పేరుతో కాదు,

    అయినా రాజకియాలలో కుడా ప్రభుత్వం కోన్ని సిట్లను దళితుల పేరు మీద రిజర్వ చెసింది....కష్టపడాలే కాని పైకి రాని జాతి లేదు అంతేకాని ఒక్కడు తోక్కితే నష్టపోరు....అలా అనుకుంటే కిందే ఉంటారు జివితాంతం..నేను తక్కువ చేయడం లేదు బాస్..కోపం వస్తే..లైట్ తిస్కో...బై

    రిప్లయితొలగించండి
  4. కతపవన్ సార్ వారి ప్రతిభ వారికెక్కడినుంచి వచ్చింది సార్. ఆ కిటుకె తెలీలేదు బాస్ ఇన్నినాళ్ళయినా. ప్రతిభ ఎవరి సొంతమూ కాదు. నేను చెప్పదలచుకున్నది అదే. పెరగడానికి మంచి వాతావరణం కావాల. ఒక మారు వాడల్లో చూడుబాసు దయనీయ స్థితి కనబడుతుంది. ఇంక మీరు కల్పించిన సంక్షేమ హాస్టళ్ళు వార్డెన్లు, అధికార్లు లక్షాధికారులు కావడానికే తప్ప మాకు పోసేది ఆ పురుగుల గంజినీళ్ళే. ఇలా పెరిగే మా బతుకుల్లో ప్రతిభ ఎక్కడో కానీ మెరవదు. రాజకీయ రిజర్వేషన్లు మరల మీ పాలేళ్ళుగా వున్న వాళ్ళకే ఇస్తారు. మీరు చెప్పినట్లు నడిచే వాళ్ళకే తప్ప ప్రశ్నించే వాడికెక్కడిది. గ్రామాలలో నేటికీ భూస్వామ్య వాతావరణమే నివురుగప్పిన నిప్పులా వుంటోంది. లేదంటే కారంచేడులో, చుండూరూలో, వేంపెంటలో మండుతాయి. మాదగ్గర ఇవ్వడానికి శ్రమ శక్తి తప్ప ఏమీ లేదు. అది ఇవ్వకపోతే మీరింత సుఖంగా వుండలేరు పవన్. మీరూ కోపం తగ్గించుకొని ఆలోచించండి బ్రదర్.

    రిప్లయితొలగించండి
  5. వడ్రింగి పిట్టగారు..! శ్యామ్‌పిట్రోడా..పేరు ఎప్పుడన్న విన్నారా..? విజ్ఞునులు మీరు.. మీకు అన్నీ తెలిసే ఉంటాయి...! ఆయన ఏ సామాజికవర్గమో తెలుసాండీ..?

    రిప్లయితొలగించండి
  6. జి వెంకటస్వామి దళితుడే కానీ అతను కోట్లు సంపాదించిన తరువాత తన కొడుకుని అగ్రకులానికి చెందిన అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేశాడు. కోట్లు సంపాదించిన తరువాత ఎవడికైనా కులం గుర్తుండదు. సమాజాన్ని అన్నిటికంటే ప్రభావితం చేసేది డబ్బు ఒక్కటే. కులం, మతం అనేవి ఊహాజనితం తప్ప అవి వాస్తవంలో ఎన్నడూ లేవు. కులం పేరుతో ఇతరుల మీద పడి ఏడ్చేవాళ్ళైనా ప్రాక్టికల్ విషయాలలో డబ్బుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇండియన్ బిలియనైర్ శివనాడార్ బిసివాడు. అతను పుట్టినప్పుడు అతని తల్లితండ్రులు పేరు చివర నాడార్ అని కులం పేరు పెట్టారు. అయినా అతను ఇప్పుడు బిలియనైర్ కనుక కులం గుర్తుంటుందని అనుకోను.

    రిప్లయితొలగించండి
  7. కొంత కాలం OC సంక్షేమ సంఘం పేరుతో మన రాష్ట్రంలో రిజర్వేషన్‌ల వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఎవరో కొద్ది మంది దళితులు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం పొంది డబ్బున్నవాళ్ళు అయినంతమాత్రాన కుల సంబంధాలు మారిపోవు అని వాళ్ళకి అర్థమైపోయి రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం నిలివివేశారు. రిజర్వేషన్ విధానమనేది దళితులకి పడేసే భిక్షమే తప్ప ఇంకొకటి కాదనేది బహిరంగ రహస్యమే కదా.

    రిప్లయితొలగించండి
  8. రిజర్వేషన్‌ల గొడవ అంతా పాత గొడవ. తెలకపల్లి రవి అనే మేతావి గాడిద ఉన్నాడు. అతను మార్క్సిజంలో అంబేద్కరిజం, అంబేద్కరిజంలో గాంధేయవాదం కలిపి, 'ఇటు మార్క్సిజం పరువూ, అటు అంబేద్కరిజం పరువూ' తీసి, గాంధేయవాదాన్ని పైకి తీసుకెళ్తున్నాడు. వడ్రంగి పిట్టగారు, తెలకపల్లి రవి గాడిదకి మీరు కూడా గడ్డి పెట్టండి. గాంధీ కుల వ్యవస్థని సమర్థించాడని తెలిసి కూడా అతను గాంధీ చేసిన తప్పులు చిన్నవేనని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు.

    రిప్లయితొలగించండి
  9. అసలు ఈ టపా వ్యక్త పరిచిన ఆంశాల మీద నేను మౌలికంగా చాలా వరకూ విభేదిస్తాను. ఆ విషయం లోతుగా చర్చించాలా వద్దా అనేది నేను నిర్ణయించుకునేలోపు అర్జంటుగా నేను చెప్పాల్సింది ఇంకోటి ఉంది.

    ప్రవీణ్ గారూ,
    తెలకపల్లి రవి గారి భావజాలం తోనో, ఆయన పద్దతులతోనో మీకు సమస్యలుంటే ఉండొచ్చు, కానీ ఇలా ఎక్కడెక్కడికో వచ్చి అవమానకరంగా రాస్తారా ? ఏంటండీ ఇది ? ఇదేనా ఒక పబ్లిక్ ఫోరంలో చర్చించాల్సిన పద్దతి ? I appeal to whatever good sense you may have to gracefully realize the mistake and remove the comment on your own.

    రిప్లయితొలగించండి
  10. ప్రవీణ్ గారికి, నేను రాద్దామనుకున్నా కామెంట్ ఆల్రెడి వీక్ఎండ్ గారు రాసారు.
    ఇది జస్ట్ రిక్వెస్ట్. మీకు , ఇతరులకి సిద్దాంత పరంగా కొన్ని విరుద్ద అభిప్రాయాలూ ఉండవచ్చు. మీకే కాదు అది ఎవరికైనా ఉంటుంది. కాని మీరు చాలా చోట్ల రవి గారిని చాల అవమానకరంగా abuse చేయడం చూసాను. మీరు ఆల్రెడి అతని పోస్ట్ కి మీరు కౌంటర్ పోస్ట్ కూడా రాసారు. ఇంకా మీరు ఇలా తిట్టడం చదివేవాళ్ళకి బాగోడం లేదు. అయిన ఒక గౌరవనీయమైన వృత్తి లో ఉన్నారు. అలాగే మీరు కూడా. ఇలా తిట్టడం వాళ్ళ ఒరిగేదేమీ ఉండదు మీ మీద అభిప్రాయం మారడం తప్ప. ఆయనకంటూ కొన్ని సిద్దాంతాలు ఉన్నాయి, అలాగే మీకు కూడా కొన్ని సిద్దాంతాలు ఉన్నాయి వాటి మధ్య బోలెడన్ని వైరుధ్యాలు ఉన్నాయని మీరు ఇలా తిట్టడం చదివేవాళ్ళకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందో ఒకసారి ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  11. తెలకపల్లి రవి రంగనాయకమ్మ గారి మీద చేస్తున్న దుష్ప్రచారం గురించి నేను రంగనాయకమ్మ గారికి ఇప్పటి వరకు మూడు ఉత్తరాలు వ్రాసాను. చంద్రభాన్ ప్రసాద్ అనే దళిత మేతావి ఉన్నాడు. అతను మార్క్సిస్ట్‌లని తిడుతూ, అంబేద్కర్‌ని పొగుడుతూ వ్యాసాలు వ్రాస్తుంటాడు. అతను మార్క్సిస్ట్‌లని గాంధీ లాంటి బైరాగులని అంటాడు, వాళ్ళు బాగుపడరు-ఇతరులని బాగుపడనివ్వరు అని అంటాడు. ఆ సోకాల్డ్ దళిత మేతావిని ఒక్క CPM నాయకుడు కూడా విమర్శించలేదు. అంబేద్కర్ మార్క్సిజంని వ్యతిరేకించాడనే విషయం, గాంధీ కుల వ్యవస్థని సమర్థించాడనే విషయం రంగనాయకమ్మ గారు బయటపెట్టినప్పుడు మాత్రం ఈ CPM మేతావులకి ఎందుకు భయం పట్టుకుంది? CPM మేతావులు గాంధేయవాదం (చొక్కా విప్పుకుని తిరిగే సిద్ధాంతం)ని మార్క్సిజంలో కలిపి మార్క్సిజం పరువు తీస్తోంటే నాకు వాళ్ళ మీద అసహ్యం కలుగుతోంది.

    రిప్లయితొలగించండి
  12. ఇచ్చినది 'ముష్టి 7.5% ' అయినా ఎందుకు అభ్యర్థులు లేక పోతున్నారు? ఇక్కడ మెరిట్ వీరులు కానివాళ్ళకే కదా మీరన్న ఆ 'ముష్టి 7.5%' ఇచ్చింది?! ఇచ్చినదే సద్వినీయోగం చేసుకోక పోతే ఇంకా (ముష్టి?) ఇవ్వండి అని అడగడం ఎందుకు?! ఎక్కడుంది లోపం?

    కులాల జనాభా నిష్పత్తిల్లో వుద్యోగాలు పంచి ఇచ్చేయడమే 'న్యాయం' అయితే, ఇక చదువులెందుకు? యూనివర్సిటీలెందుకు? పోటీ పరీక్షలెందుకు? అంతర్జాతీయంగా దేశం ఏ సోమాలియా గానో అయిపోతుందేమో.

    60ఏళ్ళుగా మార్కుల్లోను, సీట్లలోను, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, ఇళ్ళు, ఋణాలు లాంటివాటిలోనూ రాయితీలు పొందుతున్నా ఎందుకు బాగుపడటం లేదు? ఎందుకు సద్వినీయోగం చేసుకోవడం లేదు? అని ఆలోచన రావడం ఆహ్వానించాల్సిన విషయం. ఈ ఆలోచనలు పాజిటివ్‌గా వుండి పరిష్కార దిశగా కొనసాగుతాయని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాయనా SNKR, బ్యాంక్‌లలాగే SC కార్పొరేషన్‌లు కూడా ఇద్దరు గ్యారంటర్‌లు ఉన్నవాళ్ళకే ఋణాలు ఇస్తాయి. SC కార్పొరేషన్‌లలో ఋణాలు పొందేది డబ్బున్న దళితులు & వాళ్ళ బంధువులే. ఎందుకంటే ఎవరైనా తమతో బంధుత్వం ఉన్నవాళ్ళకే గ్యారంటర్ సంతకం పెడతారు కానీ పెద్దగా పరిచయం లేనివాళ్ళకి గ్యారంటర్ సంతకం పెట్టరు. రిజర్వేషన్‌లు అనేది ఒక భిక్ష అమత్రమే. వ్యాపారంలో రిజర్వేషన్‌లు లేవు, వ్యవసాయంలో రిజర్వేషన్‌లు లేవు. కేవలం 1% మంది చేసే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్‌లు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత?

      తొలగించండి
    2. దళితులకి భిక్ష పడేసి, కుల సంబంధాలు మారిపోయాయనీ, మీరు కుల వ్యతిరేక పోరాటాలు చెయ్యక్కరలేదని సందేశాలు ఇవ్వడం పచ్చి మోసం కాకపోతే ఏమిటి? అందుకే రిజర్వేషన్‌లని నమ్ముకోవడమే వెనుకబాటుతనం అనేది.

      తొలగించండి
    3. నీకు జోక్‌లాగే కనిపిస్తుంది నాయనా. నువ్వు దళిత కుటుంబంలో పుట్టి ఉంటే నీకు అర్థమయ్యేది, కుల వివక్ష ఎంత oppressiveగా ఉంటుందో.

      తొలగించండి

Explore yourself..