ఈ వీడియోలో మన కులవ్యవస్థపై తమిళ దళిత కవయిత్రి మీనాకందసామి భారతదేశ వీర్యానిది ఏ కులమని ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. తమపై జరుగుతున్న దాడులను, కుట్రలను అంతర్జాతీయ వేదికపై ప్రశ్నిస్తున్నారు.వినండి..
తొలి సూర్య కిరణం మీ పీతి కంపుతో ఎక్కడ మలినమవుతుందోనని నా ఒళ్ళంతా చీపురు చేసుకొని ఆ చివరనుండి ఈ చివరి వరకు ఊడ్చి మీ మలినాలను మీరు పారబోసిన మీ కంపు మావిని మా నెత్తికెత్తుకొని మీ ఒడలంతా మీ అమ్మ తుడిచిందో లేదో కాని మేము మాత్రం తప్పక తుడిచి పారబోస్తుంటే...
రాత్రంతా మీ చీకటి కార్యాలతో పారబోసిన మీ చెత్త జూసి దాక్కోలేక సిగ్గుపడిన సందమామ మా రాకతో ఊపిరి పీల్చుకొని సూరీడు చాటుకు పోతూ మీ కంటపడకుండా మా వంక విసిరిన నవ్వు గుండెల్లో పదిలం బిడ్డా...