19, నవంబర్ 2010, శుక్రవారం
చెత్తబుట్ట - సూర్య కిరణం
తొలి సూర్య కిరణం
మీ పీతి కంపుతో
ఎక్కడ మలినమవుతుందోనని
నా ఒళ్ళంతా చీపురు చేసుకొని
ఆ చివరనుండి ఈ చివరి వరకు
ఊడ్చి మీ మలినాలను
మీరు పారబోసిన మీ కంపు మావిని
మా నెత్తికెత్తుకొని
మీ ఒడలంతా మీ అమ్మ తుడిచిందో లేదో కాని
మేము మాత్రం తప్పక తుడిచి పారబోస్తుంటే...
రాత్రంతా మీ చీకటి కార్యాలతో
పారబోసిన మీ చెత్త జూసి
దాక్కోలేక సిగ్గుపడిన సందమామ
మా రాకతో ఊపిరి పీల్చుకొని
సూరీడు చాటుకు పోతూ
మీ కంటపడకుండా
మా వంక విసిరిన నవ్వు
గుండెల్లో పదిలం బిడ్డా...
ఈ పీతి బుట్ట సాచ్చిగా
మీ జన్మ రహస్యం
ఇంతే...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చాలా రోజుల తరువాత నీ బ్లాగ్ ఓపెన్ చేసి చదివాను. ఇన్ని రోజులు ఎందుకు నువ్వు గుర్తు రాలేదా అని నాకు బాధగా ఉంది. ఆ మధ్య భరద్వాజ "వండ్రంగిపిట్ట-చెవిలో పువ్వు" పేరుతో పోస్ట్ వ్రాసినప్పుడు నేను-కత్తి ఫోన్‌లో మాట్లాడుకుని నవ్వుకున్నాము. పువ్వులూ, పంగనామాలూ పెట్టుకునేది మత భక్తులే కానీ నాస్తికులు కాదు కదా అని నేను అంటే కత్తి మహేశ్ నవ్వు ఆపుకోలేక చచ్చాడు.
రిప్లయితొలగించండిAny way, నిన్ను గుర్తు చేసిన శంకర్ గాణ్ణి మెచ్చుకోవాలి.
రిప్లయితొలగించండిఏరా ప్రవీణ్గా ఇంకా నిద్రోలేదా? లేక నా కామెంట్లకి నీకు పీడకలలు వస్తున్నాయా? అయినా నీ ఎదవ అభిమానం కాపోతే నన్ను మెచ్చుకునేదేముందిరా. ఏవైనా నీకు కామెంట్ల దురద ఎక్కువరా.తెల్లారి ఐదవుతోంది. రేపు మళ్ళీ కాకిరిగుమ్మ వెళ్లి కాకులకీ,కుక్కలకీ ఫోటోలు తీయాలా? పో. పోయి నిద్రపో. రేపు చూసుకున్దార్లె . నువ్వెక్కడికి పోతావ్, నేనెక్కడికి పోతా. ఏటంటావ్?
రిప్లయితొలగించండికాకిరిగుమ్మలో ఆగే ట్రైన్ ఈ రోజు అర్థ రాత్రి (అంటే ఆదివారం ఉదయం 1:00)కి ఆముదాలవలస (శ్రీకాకుళం రోడ్) స్టేషన్‌లో ఆగుతుంది. ఈ PNR నంబర్ చూసుకో 640 5177137 http://www.indianrail.gov.in/pnr_Enq.html రైల్వే స్టేషన్‌కి వెళ్ళే బస్ రాత్రి పది గంటలకి దొరికితే ఆ టైమ్‌కి స్టేషన్‌కి వెళ్ళి ఉదయం ఒంటిగంటకి ట్రైన్ ఎక్కుతాను. ఆముదాలవలస దగ్గర ఎలాగూ డొకోమో టవర్ ఉంది. కాకిరిగుమ్మ దగ్గర డొకోమో టవర్ ఉందో, లేదో తెలియదు కాబట్టి నేను అక్కడ ఉన్నప్పుడు మీరు డిలీట్ చెయ్యమ్మన్న బూతులు నేను డిలీట్ చెయ్యగలనో, లేదో చెప్పలేను. అప్పుడు ప్రవీణ్ గాడు మమ్మల్ని ఇలా అన్నాడు అంటూ నా బూతులకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు. ఆ బూతులకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకుంటే మీకే సిగ్గు లేనట్టు అవుతుంది కానీ నాకేమిటి అభ్యంతరం?
రిప్లయితొలగించండి