12, ఏప్రిల్ 2011, మంగళవారం

రాముడి నేరాలు

రాముడ్ని దేవుడ్ని చేసి కొలిచే ముందు ఆ రాజు చేసిన నేరాల గూర్చి ఆలోచిద్దాం...

యజ్న యాగాల పేరుతో వేలాది పశు సంపదను బలిచ్చే నాటి మతాధిపతులను వ్యతిరేకించిన తాటకి, మారీచ, సుబాహులను హత్యచేయడం.. తాటకిని హత్యచేయడంతో మొదలైనది ఆ తరువాత శూర్పనఖ ను ముక్కు చెవులు కోయించి హింసించడంతో రాముడు స్త్రీ ద్వేషి అన్నది అర్థమవుతోంది...

అలాగే శూదృడైన శంభూకుడు తపస్సు చేయడాన్ని నేరంగా పరిగణించి తలతీయించడం...

కట్టుకున్న భార్య సీతను ఆమెకు తండ్రి వరసైన రావణాసురుడు వనవాసం నుండి తప్పించడానికి తీసుకుపోతే ఆమెను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించడం ఎలా సమర్థించగలం... అగ్నిలో దూకిన వాళ్ళెవరైనా తిరిగి బతుకుతారా? అంటే ఒకటో సీత హత్య కావింపబడ్డదన్నమాట...

ఇంక రెండో సీతను గర్భవతిగా వున్నప్పుడు అడవులకు పంపడం... అడవిలో వున్న పిల్లలపై తన తమ్ముళ్ళతో కలిసి యుద్ధం చేయబూనడం...

యిలా ఈ రాముడి చరిత్రంతా స్త్రీ ద్వేషిగాను, శూద్ర ద్వేషిగాను, అనుమానపు పక్షిగా పరిపాలనలో కరువు కాటకాలుతో జనం అల్లాడడం వంటివి (విశ్వామిత్రుడు కుక్కమాంసం తినడం) వున్నా వాటిని కప్పిపుచ్చుతూ రాజరికాన్ని బలోపేతం చేయడం కోసం రామున్ని దేవుణ్ణి చేసారు..


59 కామెంట్‌లు:

  1. ఐతే మొత్తానికి రాముడు ఉన్నాడు , రామాయణం జరిగింది అంటారా ? మొన్నెప్పుడో పాత పోస్టులో ఇవన్ని ఆర్యుల పుక్కిటి పురాణాలు అని మీరే చెప్పారు ?

    రిప్లయితొలగించండి
  2. ఆ పుక్కిట పురాణాలలోంచే కొన్ని ఉదాహరణల ద్వారా ఈ అభిప్రాయాన్ని వెల్లడించాను..నిజంగా ఇదంతా జరిగితే రేపు హిట్లర్ ని కూడా దేముణ్ణి చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు... వాడు ఆర్యుడినే అని ప్రకటించుకున్నాడు కదా మరి...

    రిప్లయితొలగించండి
  3. ఓహ్ ఐతే పుక్కిటి పురాణానికి ఇది మీ రివ్యూ అన్నమాట . మీరు ఇది పుక్కిటి పురాణం అని నమ్మారు కదా అందులో ఎవరు హీరో ఐతే ఏంటి ?ఎవరు విలన్ ఐతే ఏంటి ?

    btw హిట్లర్ ని కూడా దేవుడు అనుకునే వాళ్ళు ఉంటారు మీరు పైన రావణుడి గురించి చెప్పినట్లు , లేకపోతే ఇంకొక దగ్గర నరకాసురుడి గురించి చెప్పినట్లు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఏమంటారు ?

    రిప్లయితొలగించండి
  4. Edayinaa panikochche raatalu rayochchu kadaa. Nee panikimaalina raatalu chadivi innallu devudigaa kolichina vaallu maariporu . Oorike vedveshaalu rechchagottadaaniki kaakapote enduku panikostaayi. Evaru evarni populate neekenduku. Pakistan isi ki panichestunnava leka vatikan engili metukula kosamaa inta digajaarudu .

    రిప్లయితొలగించండి
  5. హిట్లర్‌ని ఆరాధించేవాళ్ళు ఉన్నారు. http://www.americannaziparty.com కాకపోతే రాముడిని ఆరాధించడం మానవాతీత శక్తులు (superhuman powers)కి సంబంధించిన విషయం. అదే ఫండమెంటల్ తేడా.

    రిప్లయితొలగించండి
  6. Maha prabho....kodi guudu meeda eekalu
    peekadam lo meeku meere saati. Andukondi naa abhinandalu.

    రిప్లయితొలగించండి
  7. శూదృడైన శంభూకుడు తపస్సు చేయడాన్ని నేరంగా పరిగణించి తలతీయించడం.
    ఇది పచ్చి అబ్బదం. మీరు వాల్మీకి రాసిన రామాయనం లో ఎక్కడ ఉందో చూపించండి?

    Srinivas

    రిప్లయితొలగించండి
  8. http://in.answers.yahoo.com/question/index?qid=20090710232307AA4J4Vv

    రిప్లయితొలగించండి
  9. వ్యవస్థీకృత నమ్మకాలని విమర్శించేవాళ్ళు నూతి కప్పలా?

    రిప్లయితొలగించండి
  10. meelaa raamayananni tiragesi chadive varu kooda untaru. cheekati lekunda velugu ledu. alage meelanti cheekati purugulu lekunda ramudane veluguki artham ledu :)

    రిప్లయితొలగించండి
  11. >>యజ్న యాగాల పేరుతో వేలాది పశు సంపదను బలిచ్చే నాటి మతాధిపతులను వ్యతిరేకించిన తాటకి
    మరే! తాటకి అప్పటికే PETA మెంబర్.. ప్రచారం కోసం న్యూడ్ షోలు గట్రా చేసేది అవి చూసే మన పిట్ట గారు ఆమెకు అభిమాని అయినట్టున్నారు..
    పిట్టగారండీ పిట్టగారండీ..
    ఫండ్ రైసింగ్ కోసం పోల్ డాన్సులు, ల్యాప్ డాన్సులు గట్రా ఏమన్నా ఉంటే సెప్పండి, మా కుర్రోళ్ళను తోలుకొచ్చేత్తాను.. ఆయ్!!

    రిప్లయితొలగించండి
  12. valmiki rayani vishayaalanni ramayanamlo chopiste avi raamuni neralayipotaaya
    dammulunte taagi tandanaaladi masa bhakshana chese yesu devudela ayyado prasninchu-kanyaki"(lam...Ki) elaa devudu puttado vichaarinchu
    chinna pillalato saha 29 mandi bharyalunna mohammadu devudela ayyado prasninchi
    leni vishayaalu kalpinchi asalaina sudrudaina(bhumivaasi) raamunni kinchaparachadam lekitaname

    రిప్లయితొలగించండి
  13. "..... లేకపోతే ఇంకొక దగ్గర నరకాసురుడి గురించి చెప్పినట్లు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఏమంటారు ? "

    హ హ హ దిమ్మదిరిగిపొయ్యే ప్రశ్నేసారుగా Sraavya, మన వడ్రంగి పిట్ట సారుకి?

    హిట్లర్ మీరు చెప్పినట్లుగా రాముడి లాగా తయారుచేయబడిన దేవుడయితే, మీరన్నట్లుగానే మహిషాసుర సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో, ఆ హిట్లర్ దేవుడికి వ్యతిరేకంగా కొంతమంది పండగ చేసుకుంటారు. ఏమంటారు వడ్రంగి పిట్ట gaaru?

    అయినా ప్రవీణ్ చెప్పాడుగా ఆల్రెడీ మీ పోస్టులో.. రాముడు పుక్కిటి పురాణమే అయ్యుండొచ్చేమో, అలాంటప్పుడు ఆ గ్రామదేవతలు పుక్కిటి పురాణాలే అయ్యి ఉండొచ్చు కదా, అని. (ప్రవీణ్, నాకిందుకే మీరు బాగా నచ్చుతారు)

    అయినా, అవతలి వాళ్ళ కంట్లో వేలు పెట్టి మరీ పొడవడం ఎందుకు సార్, వాడి కాలు అసంకల్పిత ప్రతీకార చర్యతో లేస్తుందని తెలిసి మరీ.

    ఎవరి నమ్మకాల పరిధిలో ఉండి, కలసి ఉమ్మడి మంచి కోసం పని చేయలేమా? ఎందుకీ తవ్వుడు, ఎప్పటి దాన్నో పట్టుకుని?

    రిప్లయితొలగించండి
  14. అందుకే మరి రామాయణం రంకు, భారతం బొంకు అన్నారులా వుంది.. ఎప్పటి దాన్నో పట్టుకుని ఎవరు వేలాడుతున్నారు? రాతిబొమ్మలకు పెళ్ళిళ్ళ పేరుతో ఎవరు తాళి కడుతున్నారు? నూతిలో కప్పలా ఆలోచించకుండా ఎవరో రాసిన దానిని పట్టుకొని ఇప్పటికీ పూజలు చేసే మీరా నేనా? ఎంతకోపమొచ్చింది? ఎన్ని శాపనార్థాలు? నేనేమీ ఎవరిదగ్గరా ఆశించి రాయలేదు.. నేను క్రిస్టియన్ ను కాదు, ముస్లింను కాదు.. దశరధుడుకి పుట్టాడా రాముడు? పుత్రకామేష్టి యాగం పేరుతో ముగ్గురు భార్యలు వేరు వేరు వాళ్ళకు కన్నవాళ్ళేకదా? కాస్తా ఆలోచిద్దాం...

    రిప్లయితొలగించండి
  15. /ఓహ్ ఐతే పుక్కిటి పురాణానికి ఇది మీ రివ్యూ అన్నమాట . మీరు ఇది పుక్కిటి పురాణం అని నమ్మారు కదా అందులో ఎవరు హీరో ఐతే ఏంటి ?ఎవరు విలన్ ఐతే ఏంటి ?/

    వాహ్! చావగొట్టారు. ఇలాంటి బేవార్స్ గాళ్ళ వాల్మీకి రంగనాయకమ్మే.
    ఈ ఐలయ్య ఇపుడు "నేను మనిషి నెందుకైతా? పురుగుల్తినే వడ్రంగిపిట్టనైత" అనుకుంటూ బ్రతికేస్తాడు.

    ఈళ్ళ బేవార్స్ బ్రతుకులకు ఏడ్చుకునేందుకు కూడా వేలఏళ్ళ క్రితం జరిగిందంటున్న పురాణ కథలే.

    రిప్లయితొలగించండి
  16. :)
    వల్లభ నేనూ మీతో వస్తాను, ప్లీస్

    రిప్లయితొలగించండి
  17. @SNKR బాబూ ఎవరివి బేవార్స్ బతుకులు.. చేసిన పాపాలను కడుక్కోవడానికి ఇలాంటి దేవుళ్ళను సృష్టించుకొని స్వకుచ మర్థనం చేసుకు బతికే మీవే బేవార్స్ బతుకులు.. బేవార్సుగా అందరి కష్టఫలాన్ని దొబ్బుకుతినే ఎదవ లాజిక్కులకోసం పురాండాలు సృష్టించి బ్రేవుమని నేతి తేన్పులు తేన్చే బేవార్సులు మీరే.. అందుకే ఒకడు రికార్డింగు డాన్సులు చేస్తానంటున్నాడుమరి.. కష్టాన్ని నమ్ముకు బతికే వాళ్ళం మేము.. ఎవరిపైనా ఆధారపడి బతకం...

    రిప్లయితొలగించండి
  18. ఏమిది SNKR పై ఆగ్రహమా, లేక బ్రాహ్మలపై ఆగ్రహమా.నేతి తేన్పులు అనగానేమి.

    రిప్లయితొలగించండి
  19. i think this vadrangi dont know proper history and charecter abt rama.......

    రిప్లయితొలగించండి
  20. chettu iche manchi pandlanu vadilesi chettu beradunu kotti andulo purugulu tintayi ... vadrangi pittalu ... adi vaati naijam ... marchadam kashtam ...

    - Angry Bird

    రిప్లయితొలగించండి
  21. ఉన్నపళంగా బ్లాగు జనాలకు రాముడి సుగుణాలు లోపాలు ఎందుకు గుర్తొచ్చాయి చెప్మా అని బుర్ర గోక్కున్నా, కాసేపయ్యాక ఆత్మా'రామం' సెలవిచ్చాడు, ఒరేయ్ మొన్నే కదరా శ్రీరామ నవమి జరిగింది అని. ఒహ్.., సూపర్ మూన్ ఎఫెక్టు లాగా ఇది 'రామ'న్ ఎఫెక్టు కాబోలు అని ఇప్పుడు నిర్ధారించుకున్నా..

    రిప్లయితొలగించండి
  22. పిట్టగారూ,
    మీరు ముస్లిమో, క్రిస్టియనో అయితే ఏంటి? ఎందుకలా భుజాలు తడుముకుంటారు? మీరు బ్రాహ్మిణ్ కులానికి చెందిన వ్యక్తి అయినా డా ఇలాగే రెస్పాన్స్ వస్తుంది మీకు. చెప్పే విషయం కంట్లో వేలు పెట్టినట్లుగా కాకుండా, మామూలుగా చెపితే ఎవరైనా "వినటానికి కన్సిడర్" చేస్తారు మాస్టారూ. Provoking is an art and it should only be used to bring out better angels of human nature, lest you will be swamped in the very provoked response that you intended in the first place.

    పోతే తర్కం, లాజిక్ గురించి మీరు మాట్లాడటం హాస్యాస్పదం. "రాముడు" ఎంత నమ్మకమో, "రాముడు లేడూ" అనేదీ అంతే నమ్మకం. The very basic assumption in any rational theory is 'absence of presence doesn't mean presence of absence".
    తర్కం తో ఉన్న బేసిక్ సమస్య ఏంటంటే, అది "మానవ మస్తిష్కం" గ్రహించే విషయాల పరిథి లోపలే ఉండిపోవటం దానికి inherent గా ఉన్న problem. దీని గురించి చాలా రాయొచ్చు కాని వ్యాఖ్య పెద్దదవుతుందని ఆగిపోతున్నాను.

    Finally, కాంట్రొవర్సీ జనరేట్ చెయటమే మీ ఉద్దేశం లాగా కనపడుతోంది, మీరు వ్యాఖ్యాత ల కిచ్చిన రెస్పాన్సెస్ ద్వారా. అలా అయితే మీకు ఒకటే మందు. Starve the beast!

    మీ దగ్గరికి మంచి మాటతో వచ్చినప్పుడు కత్తులు తీయరనే ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను కూడా. అలాక్కాదూ, నాస్టీనెస్ కి తలుపులు తెరచి, జారుడు బండ మీద కాలు పెట్టటం మీ అభిమతమైతే చెప్పండి.

    రిప్లయితొలగించండి
  23. Ahhaa,

    కులగజ్జి సోకినవాళ్లకి ఇంతకన్నా సీనుండదులే కుమార్.

    వండ్రంగిపిట్టగారూ,

    I asked you long back about the your plan to help the downtrodden people and you have never responded. Thats the love you have for your own people .. and you criticize the others .. LOLZ

    రిప్లయితొలగించండి
  24. శ్రావ్యగారి కామెంట్స్ దానికి ఈ పిట్ట సమాధానం చూసాక ఇక పొస్ట్ చదవక్కర్లేదు. కామెంట్స్ చదవక్కర్లేదు. ఈ సదరు బ్లాగరు కుళ్ళు, విషం మొదటి మూడు కామెంట్స్ కే అర్ధమయిపొయింది. Thanks Sravya gaaru :-)

    BTW, Angry Bird....you are too good :-)

    రిప్లయితొలగించండి
  25. @KumarNః మీరు చెప్పిన లాజిక్కుకు దూరంగా వున్నాయా నా పోస్ట్, ఆ తరువాతి కామెంటు.. snkr రెచ్చిపోయి రాస్తే సమాధానం ఇవ్వకుండా వుంటే సాత్వికతా? కనీసపు మర్యాద పాటించని వారికి ఎలా సమాధానం రాయాలో అలాగే రాయాలి.. మీరు చెప్పిన తీరు బాగుంది.. నేనేమీ బూతులు రాయలేదు నా పోస్ట్ లో నాకున్న ఆలోచనను పంచుకున్నా. అది నచ్చకపోతే దానిని డిఫెండ్ చేసేట్లు రాయాలి గానీ బేవార్స్ అంటారా? ఇంక పిట్టలు పురుగులూ తింటాయి, పండ్లూ తింటాయి.. దానివలన వాటి స్వేచ్చను కోల్పోవు కదా? ఎవరి ఆహార రీతులు వాళ్ళవి. విమర్శించే విధానం తెలీక ఏవో కూతలు కూస్తే ఎలా సారూ. ఇదంతా మీరు రాసిని దానికి మాత్రమే సమాధానం కాదు. ఇక్కడ చాలా మందికి కలిపే రాసాను. మీకు ధన్యవాదాలు...

    రిప్లయితొలగించండి
  26. వడ్రంగి పిట్ట గారు మీ బాధ అర్ధం చేసుకోవాల్సిందే ! మిమ్మలిని అంటే అంత గా మనోభావాలు ని గాయపర్చుకుంటున్న మీరు కొన్ని కోట్ల మంది నమ్మకాలని ఎలా హేళన చేస్తున్నారు ?
    సీత హత్య కావింపబడ్డదన్నమాట...... >> అవునా ఐతే అప్పటికే ప్లాస్టిక్ సర్జరీలు వగైరాలు ఉన్నాయా ? వేరే ఆవిడని తీసుకొచ్చి ఆవిడే ఈవిడ జనాలని మోసం చేయటానికి , పైగా ఆ జనాలంతా ఏకపత్నీవ్రతుడు అని పొగడటానికి .
    ఈ రాముడి చరిత్రంతా స్త్రీ ద్వేషిగాను, శూద్ర ద్వేషిగాను, అనుమానపు పక్షిగా -- వీటిని ఏమంటారు ? మీరు ఇలా మాట్లాడొచ్చా? వీటికి ఆధారాలు ఉన్నాయా ?
    అందుకే మరి రామాయణం రంకు, భారతం బొంకు అన్నారులా వుంది.. >>> ఇక్కడ రంకు మంచా ? చెడా ? ఒకవేళ చెడు ఐతే చేసిన వారు మీకు పూజ్యనీయులు ఎలా ?

    యద్భావం తద్భవతి అన్నారు , మీకు రంకు , బొంకు కనిపించిన వాటిలో వేరే వాళ్లకి ఇంకేదో కనపడచ్చు , అలాగే మీకు మంచి కనిపించిన వాటిలో వేరే వాళ్లకు మీకు ఇక్కడ కనిపించినవి కనపడొచ్చు . గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకుంటే బావుంటుంది అని నా అనుకోలు . మీరు ఒక రాయి వేస్తె వేరే వాళ్ళు వేసే పది రాళ్ళని ఎదుర్కోవటానికి సిద్దం గా ఉండాలి .

    రిప్లయితొలగించండి
  27. ఈ SnkR గాడిదకి ఎంతమంది గడ్డిపెట్టినా బుద్దిరాదు, ఈరోజే రెండు బ్లాగుల్లో తన పైత్యాన్ని చూపించి తిట్లు తిని మరో బ్లాగులో అర్ధం లేని కామెంట్లు పెట్టి డిలీట్ చేయించుకున్నాడు. అసలీ గాడిదను బ్లాగుల్లో బ్యాన్ చెయ్యాలి.

    వండ్రంగిపిట్టగారూ, మీరు ఇలాంటి చత్తకామెంట్లు రాసే వారిని పట్టించుకోక మీకు నచ్చింది రాయండి.

    రిప్లయితొలగించండి
  28. వీళ్లని గాడిదలంటే గాడిదలు సిగ్గు పడతాయి.

    రిప్లయితొలగించండి
  29. "కష్టాన్ని నమ్ముకు బతికే వాళ్ళం మేము.. ఎవరిపైనా ఆధారపడి బతకం..."

    Can you please clarify more on how are you doing this ?

    - Angry Bird

    రిప్లయితొలగించండి
  30. వడ్రంగి పిట్ట గారూ,
    నేను చెప్పేదీ అదే. ఏదైనా చెప్పాలీ అనుకున్నప్పుడు మీరు తెలివిలేని దద్దమ్మలూ, మీరు బుర్రలని గంప కింద దాచారు, లాజిక్ కొంచెం కూడా అప్లై చేయటం రాదు అని ఎగతాళిగా, హేళనగా మాట్లాడితే రెస్పాన్సెస్ అలానే వస్తాయీ అని.

    నేను మీకు ఒక చాలెంజ్ విసుర్తున్నాను. మూడేళ్ళుగా నేను బ్లాగులు చూస్తున్నాను. ఒక్కరంటే ఒక్కరైనా ఇక్కడి వాళ్ళల్లో, ఏ ముస్లిం ఖురాన్ నో, క్రిస్టియానిటీ బైబిల్ నో టార్గెట్ చేస్తూ, ఓరి వెధవల్లారా మీ మెదళ్ళు దొబ్బాయ్, ఇవి చూడండీ అని ఆ గ్రంధాల లోటుల్ని ఎత్తిచూపుతూ హేళనగా వారు ముందు రాయి విసిరారా??!!

    లేదు. చేయం సార్ మేమలాగా..మాకు అది బ్లడ్ లోనే లేదు. మీలాంటి వాళ్ళో, ఇంకేవరైనా వచ్చో, సక్రమంగా వారి వారి నమ్మకాలతో గడుపుతున్న వాళ్ళ మీద, రాళ్ళేయమన్నా వేయం. కొండొకచో ఆ రాయి తిప్పి, ఆ చెప్పిన వాళ్ళ మీదకే విసుర్తాం.

    ఏం, ఖురాన్ లో, ఓల్డ్ టెస్టమెంట్ లో లేవా, మీరు చెప్పే దుర్నీతి విషయాల్లు. అసలు టెన్ కమాండ్మెంట్స్ లో మొట్ట మొదటి నియమమే పెద్ద కాంట్రవర్షియల్. దాంతో నాకెప్పటికీ సమస్యే. ఇంకో రెండు ఏ లాజిక్ కైనా నిలబడతాయా? కాని మెమేమీ పొద్దున్న లేస్తే చూరు మీదకెక్కి అహో వీళ్ళని చూడండో, వీళ్ళకి మెదడు ప్లేస్ లో పేడ ఉందహో అని అరవట్లా. ప్రతి క్రిస్టమస్ కీ, చర్చ్ కెళ్ళటం, ఇంట్లో క్రిస్ట్మస్ చెట్టు పెట్టుకోవటం, నేను పాటిస్తున్న సాంప్రదాయం. అంటే ఆత్మనమ్ముకున్నానని కాదు, క్రిస్టియన్స్ లో కూడా సాంప్రదాయాలనీ, ఫ్యామిలీ వాల్యూస్ నీ మనకన్నా ఎక్కువగా పాటించే వాళ్ళని వేలల్లో చూసానిక్కడ. వాళ్ళెవ్వరూ ఆ టెన్ కమాంద్మెంట్స్ ని లిటరల్ గా తీసుకోరు.

    బహుశా మీరు అదృష్టవంతులయ్యి ఉంటారు, జీవితంలో. మనిషికి అన్నీ కోల్పోయిన రోజున మిగిలేది, ముందుకు నడిపించేది, రెండే..నమ్మకం, ఆశ. వాటిమీద ముందు రాయి విసరకండి అన్యాయంగా. తిరిగి ఆ రాళ్ళ వానలో మిమ్మల్ని సజీవ సమాధి చేయడానికి, ఇక్కడ చేతులెత్తి రెడీగా ఉంటాం అందరం.

    రిప్లయితొలగించండి
  31. వేల సంవత్సరాల క్రిందట జరిగిన సంగతులను ప్రస్తుత పరిస్తుతులకి అన్వయించి
    తప్పొప్పులు నిర్ణయించి వ్రాసిన పోస్ట్ కి విలువ ఏమిటో అర్ధం కావటల్లేదు.

    రెండవది ప్రస్తుతం లో "ఎవరిపైనా ఆధారపడి బతకం." అనే దాని గురించి నాకూ తెలుసుకోవాలని ఉన్నది.

    రిప్లయితొలగించండి
  32. కోటొక్క దేవుల్లున్నారు, వారందరి మంచి చెడ్డలూ ఎవ్వరూ మాట్లాడుకోరు. కాని ఒకతన్ని మనుషుల్లో మర్యాదా పురుషోత్తముడుగా కీర్తిస్తూ మిగతా జనాలకు అదర్శంగా నిలిచేవాడని చెప్పేప్పుడు అతని మంచి చెడ్డలు తప్పకుండా చర్చకు వస్తాయి. చర్చను తప్పనడం పొరపాటు. ఇదెప్పుడో జరిగిపోయిన విషయం, ఈకాలానికి సంబందించని విషయం అని చెప్పి తప్పించుకుంటే ఏం లాభం?

    రిప్లయితొలగించండి
  33. VP (Vadrangi Pitta) గారూ,

    మీరు సూపరండీ బాబూ, సూపరు
    "తాటకిని హత్యచేయడంతో మొదలైనది ఆ తరువాత శూర్పనఖ ను ముక్కు చెవులు కోయించి హింసించడంతో రాముడు స్త్రీ ద్వేషి అన్నది అర్థమవుతోంది... "

    నిజమే ఎంత వెధవ పనులు చేస్తే మాత్రం చంపెయడమే? తప్పు కాదూ. భలే చెప్పారు. మీరు సూపరు

    "అలాగే శూదృడైన శంభూకుడు తపస్సు చేయడాన్ని నేరంగా పరిగణించి తలతీయించడం..."

    ఇది మరీ సూపరు. రామాయణం రాసిన వాల్మీకికి కూడా తెలియని విషయం మీరు కనిపెట్టేశారు.

    "కట్టుకున్న భార్య సీతను ఆమెకు తండ్రి వరసైన రావణాసురుడు వనవాసం నుండి తప్పించడానికి తీసుకుపోతే ఆమెను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించడం ఎలా సమర్థించగలం..."

    అస్సలు సమర్ధించలేము. మీరన్నది కరెక్టే. అవునూ వనవాసం నుండి తప్పించేందుకు కూతుర్ని అంత ప్రేమగా తీసికెళ్ళిన వాడు అంతపురం లోని ఏ.సి రూం లో ఉంచకుండా అశోక వనం లో చెట్టుకింద ఎందుకు ఉంచాడబ్బా? ఏమో మరి. మీరు సూపరు కదా మీకే తెలియాలి.

    మొత్తం మీద రాముడిని భలే ఏకి పారేశారు గురువుగారూ. అవును మరి ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా సిగ్గు లేకుండా ప్రతి వెధవ చేతా మాటలు పడుతున్నాడు . వాడు దేవుడా?

    అవును గురువు గారూ మీరు పైన ఎవరికో సమాధానం ఇస్తూ మేము ఎవరి మీదా ఆధారపడి బ్రతకం అన్నారు? మీరు సమాజం లో ఉండటం లేదా? అహ, ఏం లేదు సమాజం లో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడాలి కదా, మీ మాటల్లో ఆ చాయలు కనిపించకపోతే ఆదిమానవుల టైపు లో అడవుల్లో బ్రతుకుతున్నారేమో అని అనుమానం వచ్చింది. అయినా నాకెందుకు లెండి మీరు సూపరు. ఏమయినా చేయగలరు .

    రిప్లయితొలగించండి
  34. మర్యాదా పురుషోత్తముడుగా కీర్తిస్తూ మిగతా జనాలకు అదర్శంగా నిలిచేవాడని చెప్పేప్పుడు అతని మంచి చెడ్డలు తప్పకుండా చర్చకు వస్తాయి.
    --------
    కీర్తించే వారు అప్పటి సమాజ పరిస్తుతులు అవగాహనలోకి తీసుకుని కీర్తించారు. ప్రజలందరికీ అంత సీను ఉండదు. కీర్తించిన వారి తెలివితేటల మీద నమ్మకము ఉన్నవారు నమ్ముతారు లేనివారు లేదు.
    ఎవ్వరూ ఎవ్వర్నీ బలవంతంగా నమ్మమని చెప్పటల్లేదు. అసలు గ్రౌండ్ రూల్స్ ఏమిటో తెలియకుండా ఎలా చర్చ చేస్తారు?

    ఉదా: అప్పటి సమాజ పరిస్తుతులు ఎలా వుండేవో నాకయితే మాత్రం తెలియదు. యజ్న యాగాల పేరుతో వేలాది పశు సంపదను బలివ్వటం అప్పుడు కరెక్టు అవ్వచ్చు. మనుషుల తిండి కోసం వేలాది పశు సంపదను బలివ్వటం ఇప్పుడు కరెక్టు.

    అందుకనివాళ్ళు చేసిన బలి తప్పు మేము చేసేది కరెక్టు అంటే ఎట్లా?

    రిప్లయితొలగించండి
  35. నాయాల్ది,

    ఏంటిరా కూస్తాండావ్.. కొడకా లాగి ఒక్కటిచాననుకో, నీ చిన్నప్పుడు తిన్న జీడి కూడా బయటికొస్తాది. ఏందిరా!! ఏదేదో కూస్తాండావ్/ ఎవ్వడు చెప్పిండుబే నీకు గీ ఇసయాలన్నీ. కూతంత తెలిసిందో లేదో యెదవ కూతలన్నీ కూసేయ్యడమే!! నీ యవ్వ, నాకు గాని ఒల్లు మండిందనుకో బుస్ గానికి ఓ పాలి సెప్పి నానుకో, నీకు జైల్లోనే తెల్లారుద్ది. ఒల్లు దెగ్గర బెట్టుకుని రాస్తాఉండు. నాకు తిక్క తెప్పిచొద్దు.

    రిప్లయితొలగించండి
  36. తిక్కలోడికి కోపం వస్తే పియ్య తినే వడ్రంగి పిట్టను నమిలేస్తాడు.

    రిప్లయితొలగించండి
  37. @KumarN: ఖురాన్ ను, క్రిస్టియన్ మతాన్ని విమర్శించకుండా విశాల హృదయంతో వదిలేయడమెందుకు సార్. విమర్శించాల్సిన దానిని విమర్శించాలి.. పెరుగును చిలకకుండా వెన్న తీయలేం కదా.. విమర్శిస్తే ఇబ్బందులుంటాయని దాటవేసి వుండొచ్చు. లేదా అభద్రతా భావమైనా కావుచ్చు. వాటి గురించి నాకంతగా తెలీదు కాబట్టి నేనింకా రాయలేదు.. తెలుసుకొని ఇక్కడే రాయడానికి ప్రయత్నిస్తా.. మూఢత్వం ఎక్కడున్నా ఖండించాల్సిందే.. ఊరికే చెప్తే ఇంతమంది ఈ పోస్ట్ చదివే వాళ్ళా. కొంతమంది ఐనా ఆలోచిస్తున్నారన్న దానికి కొన్ని కామెంట్లు నిదర్శనం.. తిట్లా నే ముందుగానే ఊహించి కామెంట్ల కాలాన్కి పెట్టుకున్న శీర్షికనదే.. రౌడీ రాజ్యాలను కుప్పకూల్చడమే నా పని.. ఈ బ్లాగును హాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి..

    రిప్లయితొలగించండి
  38. మతం అనేది ఊహాజనితమైనప్పుడు హిందూ మతమైతే ఏమిటి, క్రైస్తవ మతమైతే ఏమిటి? హిందూ పురాణాలలో పరలోకం గురించి ఎంత ఆకర్షనీయంగా వ్రాసి ఉందో, బైబిల్‌లోనూ పరలోకం గురించి అంతే ఆకర్షణీయంగా వ్రాసి ఉంది. హిందూ మతాన్ని విమర్శిస్తే క్రైస్తవ మతం గొప్పదని సర్టిఫై చేసినట్టు కాదు.

    రిప్లయితొలగించండి
  39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  40. వడ్రంగి పిట్ట గారూ,

    ---విమర్శిస్తే ఇబ్బందులుంటాయని దాటవేసి వుండొచ్చు. లేదా అభద్రతా భావమైనా కావుచ్చు.

    ఎవరికి మీకా?

    పోతే ఖురాన్, భైబిల్ లోని దుర్నీతులను, అసంబద్దమైన విషయాలనూ, డౌన్ రైట్ blasphemy chapters నీ తెలుసుకొని రాస్తాను అన్నారు కదా. ఆ విషయాల గురించి మీ పోస్టుల కోసం ఎదురు చూస్తూంటాను. నామ మాత్రమా, లేక ఇదే ఇంటెన్సిటీ ఉంటుందో లేదో అనేది మీకు మీరే పెట్టుకోవాల్సిన పరీక్ష.

    పోతే చివరగా, మెల్లిగా చెపితే ఎవరైనా చదివే వారా, వినే వారా అన్నరు కదా...నవ్వోస్తోంది. నిజంగా ఇప్పుడెవరైనా విన్నారు అని మీరనుకుంటున్నారా? This kind of talk, always hardens your opposite lines and consolidates their base. In the end you are helping them. Yes, in the process you are appealing to your galleries too with some kind of martyr talk, but you see, there are hardly any people in your galleries.

    If your objective is to gain the attention of "people in the middle" and make them see your point, APPARENTLY YOU ARE FAILING.

    --రౌడీ రాజ్యాలను కుప్పకూల్చడమే నా పని.. ఈ బ్లాగును హాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి..

    అర్ధం కాలా, ఆ రౌడీ బ్లాగుని కూల్చే ప్రయత్నాలా మీరనేది!!

    ఒక అడ్వైస్ మీరు ఓపెన్ మైండ్ తో స్వీకరిస్తానంటే...ఇది ఇంటర్నెట్ యుగం సార్. మీకింకా అర్ధం అవుతున్నట్లు లేదు. టైం వేస్ట్ చేసుకోబాకండి, అట్లాంటి వృధా ప్రయాసలతో. ఇంకో వంద పుట్టుకొస్తాయి :-)

    ఇది అర్ధం కాని పెద్ద మనుషులు ఇక్కడ పెద్దరికం చేయడానికి ప్రయత్నించి, మొహమ్మీద ఉమ్మేయించుకున్నాక అర్ధం చేసుకొని మూలన తొంగున్నారు. మిగతా వాళ్ళు వాళ్ళ పరిధిలో ఆరబోసుకుంటున్నారు.

    నా ఉద్దేశం మిమ్మల్ని మాట్లాడొద్దని కాదు, ఫ్రీడం ఆఫ్ స్పీచ్ లేని సమాజం కావాలని ఇక్కడెవ్వరూ కోరుకోవటం లేదు. At least, not after what Communism has given to this world :-)

    All they are saying is 'Your freedom ends, where my nose begins' అని.

    రిప్లయితొలగించండి
  41. నాస్థికులకు పరలోక యాత్ర వుండదా? ఈడే పిశచుల్లక్క పడుంటరా?
    నీకు అంత ఆకర్సనీయంగా ఏలుంది?నీకు ఏ పరలోక యాత్ర గావాల? జిహాద్ చేశాక పరలోక యాత్ర బాగుంటుందని మా కసబ్ అంటాడు. ప్రవీన్ గారు ఇశ్దీకరించాల.

    రిప్లయితొలగించండి
  42. ఈ వడ్రంగి పిట్ట ఓ బేకార్, వీణితో చర్చలేంటండి.

    రిప్లయితొలగించండి
  43. Just a note to everyone,
    It says above that Blog Writer has deleted my comment. It's not true. I have deleted my own comment as I forgot to include some english words in between, after I wrote telugu part in the other window of Lekhini.

    రిప్లయితొలగించండి
  44. “Judge a man by his questions rather than by his answers” - Voltaire quote

    This is my favourite quote..

    స్వేచ్చ గురించి, వాక్ స్వాతంత్ర్యం గురించి మాటాడే వాళ్ళు ఎదుటి వారి ప్రశ్నను గౌరవించలేనితనాన్ని ఏమని పిలవాలి.. below the belt comments తో నోరుమూయించాలన్న ప్రయత్నం చాన్నాళ్ళుగా బ్లాగులలో జరుగుతున్న వ్యవహారం.. రౌడీ రాజ్యం అన్నది నేనొకరిని దృష్టిలో పెట్టుకొని అనలేదు. ఇక్కడి కామెంట్స్ రాసేవాళ్ళ ప్రవర్తనని సూచిస్తూ అన్నా.. నొప్పించక తానొవ్వక తప్పుకు పోవడం అవకాశవాదం.. అనుకున్నది అనుకున్నట్లు చెప్పడమే నా నైజం.. ఎవరో మారిపోతారన్న కుతి నాకు లేదు.. నేనెవర్ని మార్చి పారేయాలన్న దుగ్ధ లేదు.. నా ఆలోచనను పంచుకునే వేదికగా బ్లాగునెంచుకున్నా. ఉలికిపడిన వారు మరింత ఉలికిపడేట్టు చేయడానికి ముందుంటా, vp లెవరో తెలుస్తోంది... thanks to all to see my posts here..

    రిప్లయితొలగించండి
  45. ఇతరులని గాడిదలు అంటూ తిట్టేవాళ్ళు వాక్‌స్వాతంత్ర్యం గురించి మాట్లాడడం ఒకటి. వీళ్ళ బ్యాచ్‌కే చెందిన ఒక వ్యక్తి ఒక రచయితని గాడిదలు కాస్తున్నావా అని అడిగాడు, ఇంకొకడు మేధావుల్ని మేతావి గాడిదలు అన్నాడు. డికోరం లేనివాళ్ళు వాక్‌స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నారు.

    రిప్లయితొలగించండి
  46. *Judge a man by his questions rather than by his answers” - Voltaire quote*
    *ఎదుటి వారి ప్రశ్నను గౌరవించలేనితనాన్ని ఏమని పిలవాలి*
    @వండ్రంగి పిట్టగారు,

    మీరు పైన రాసిన ప్రశ్నలు మీవి కావండి.ఎవరో రాసిన వాటిని చదివి వాటిని మీప్రశ్నలు గా ఊహించుకొంట్టున్నారు. ఆ రోజుల్లో పైన మీ రాసిన ప్రశ్నలేసిన వారిగురించి, వాటి వెనుక ఉన్న ఉద్దేశం గురించి చాలా మందికి తెలుసు. కాని ఇప్పుడు మీరు సరిగ్గా శ్రీరామ నవమి పండుగ సమయం లో వీటీని ఇక్కడ ప్రచూరించటానికి గల వెనుక ఉద్దేశం బ్లాగర్లకు చాలా సందేహాలను రేక్కిత్తించింది అనుకొంటాను. అందులో బ్లాగర్లని తప్పు పట్టవలసిన అవసం ఎమీటో నాకు కనపడటం లేదు.
    ఈ మధ్య కాలంలో ఏవజేలిస్ట్ల ప్రచారం మాంచి ఊపు మీద ఉన్నదని తెలుసు. వారి ప్రచారం ఎలాగుంట్టుందో బ్లాగరలలో చాలా మందికి అవగాహన ఉంది కూడాను. హిందూ ప్రముఖ పండుగల ముందు రోజులలో ఊరిలో పెద్ద ఎత్తున సువార్తా కూటములు నిర్వహించటం. ఎక్కడ చూసినా ఈ వాల్ పోశ్టర్లతో ఆ వూరిలోని అన్ని ప్రముఖ ప్రదేశాలను ముంచెత్తటం.
    పండుగల నాడు టి వి చానల్స్ ల లో ఉదయం 6-7గం|| స్లాట్స్ ని బుక్ చేసి క్రైస్థవ మత ప్రచారం గురించిన ప్రోగ్రాంస్ ప్రాసారం చేయటం. పండుగ ప్రాశస్థం మీద వచ్చే కార్యక్రమాల ప్రొగ్రాంస్ సమయాన్ని సాధ్యమైన వరకు కుదించటం. ఇవన్ని ఈ మధ్య బాగా ఎక్కువైయ్యాయి. మీరు క్రైస్తవుడిని కాను అని అన్నా మీటాపాలో రాసిన విషయం, ప్రచూరించిన సమయం (శ్రీ రామనవమి పండుగ నాడు )ఎవాంజలిస్ట్ల ప్రచారాన్ని తప్పక గుర్తుకు తెస్తుంది. ఇది ఎంతో సామాజిక పరిజ్ఞానం ఉన్న మీకు తెలియదని ఎలా అనుకోగలం? మీకు తెలిసే ఉంట్టుంది

    ఈ మధ్య హిందూ మతం క్రైస్తవమతం నుంచి వచ్చిందని ఎవాంజిలిస్ట్ లు చెపుతున్నారు.హిందూ మతం మీద హిందువులకన్నా వారే ఎక్కువ చదువుతున్నారు/ రీసర్చ్ చేస్తున్నారు. కనుక ఇక నుంచి మీరు ఈ హిందూ మతం లో ఉన్న మీ ప్రశ్నలకు ఎవాంజిలిస్ట్ /వాటికన్ వారినే సమాధానలు అడిగితే బాగుంట్టుందేమొ. వారే మీలాంటివారికి నచ్చే విధంగా సమాధానాలు ఇచ్చి సంత్రుప్తి పరచగలరు అని అనిపిస్తున్నాది. ఈ క్రింది వీడీయోని చూడండి. అతను ఒక గంటసేపు పైగా ఓపికగా,ప్రశాంతంగా, సహనంతో అడిగిన వారికి సమాధానం ఇస్తున్నారు. ఇటువంటి వారిని ఆశ్రయించి మీ సంశయాలను నివృత్తి చేసుకొంటే బాగుంట్టుందేమో!

    Hinduism came from the BIBLE! - 1 to 10
    http://www.youtube.com/watch?v=syBSPQvIqYs&feature=related

    రిప్లయితొలగించండి
  47. శ్రీకర్ గారు ఎవాంజలిస్ట్ ల ప్రచారార్భాటాలు, వారికొచ్చే విదేశీ నిధులు వాటి గురించి తెలుసు. కానీ నా పోస్ట్ తిధి, సమయం చూసి రాయలేదు. ఆరోజంతా నాకు వస్తున్న ఎస్.ఎం.ఎస్.లు టీవీలలో వచ్చే ప్రోగ్రాంలు చూసే ఇలా రాయాలనిపించింది. మరో విషయం క్రీస్తు కాశ్మీర్ ప్రాంతంలో పర్యటించాడని, బౌద్ధారామాలలో విద్యనభ్యసించాడని ఆ మధ్య టీవీలలో చూసా. దానికనుగుణంగానే చర్చి నియమాలు రూపొందించాడని చెప్తున్నారు. ఇది కూడా నిజం కావచ్చు. నేనేమతాన్ని సపోర్ట్ చేయడంలేదు..
    నేనిక్కడ ప్రశ్నించింది ఆరాధించే ముందు ఆలోచించమని...

    రిప్లయితొలగించండి
  48. తాటక, ఆమె కొడుకులూ రాక్షసులు, పశు మాంసం తింటారు. ఋషులను (మీ భాషలో మతాధిపతులను) వ్యతిరేకించడానికి కారణం వారిచ్చే పశు బలులు కాదు. ముని వాటికలున్న అరణ్యాలను ఆక్రమించుకోవాలన్న దుగ్ధ. తాటకతో పోరాటం అప్పుడే విశ్వామిత్రుడు సాధారణ స్త్రీకి, ఆమెకు ఉన్న తేడా చెప్పి తాటక సంహారం లోక కళ్యాణం కోసమే అని వివరించాక మాత్రమే రాముడు ఆమెను వధించాడు.

    శంబూక వధ వాల్మీకం కాదు. ప్రక్షిప్తం.

    రావణుడు సీతకు తండ్రి ... ఇది కూడా వాల్మీకం కాదు. ప్రక్షిప్తం.

    అగ్నిప్రవేశ ఘట్టంలో అగ్ని సీతను దహించ(లే)క, ముందే రాముడిని వేడుకుంటాడు... తండ్రీ నా తల్లికి ఈ శిక్షా అని. రాముడు తన రాజధర్మాన్ని నిర్వర్తించాడు. (శ్రీశ్రీ మాటలు గుర్తు రావడం లేదా : ...పబ్లిక్ లోకి వస్తే ఏం ఐనా అంటాం... )

    ఉత్తర రామాయణం వాల్మీకం కాదు. ప్రక్షిప్తం.

    ప్రపంచంలో వందల రామాయణాలున్నాయి. పాఠ భేదాలు కోకొల్లలు.. అందువల్ల... రామాయణం పైన దాడి చేయాలనుకుంటే ఒక రచయిత రచనను విమర్శించండి. అన్నిటినీ కలగాపులగం చెయ్యకండి. వాల్మీకం మీద దాడి ఉత్తమం. దానిపై దాడి చేసేటప్పుడు మిగతావాటిని కలపకండి. మీ దాడి లక్ష్యం నెరవేరవచ్చేమో కానీ అది సద్విమర్శ లక్షణం కాదు.

    ఫణీంద్ర పి
    ఈటీవీ

    రిప్లయితొలగించండి
  49. వడ్రంగి పిట్ట గారు, ఆ గజ్జి కుక్కలు ఇంతకు ముందు నాకు వ్యతిరేకంగా onlyforpraveen.wordpress.com అనే బ్లాగ్ పెట్టి నన్ను దళిత గిరీశం, వేశ్యని పెళ్ళి చేసుకునే సంఘ సంస్కర్త అంటూ బండబూతులు తిట్టారు. వాళ్ళే శ్రీరంగ నీతులు చెపుతున్నది.

    రిప్లయితొలగించండి
  50. phaneendra గారు పశుమాంసం తినే వాళ్ళంతా రాక్షసులా? మరి పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలో కూడా కొన్ని కోట్లమంది తింటున్నారే? వాళ్ళంతా రాక్షసులా?
    అరణ్యాలను ఆక్రమించుకునే క్రమంలో యజ్నా యాగాదులు చేసి వుండొచ్చు. వారి ఉనికికి ప్రమాదంగా భావించి వుండొచ్చు..
    నేను వాల్మీకినిక్కడ ప్రస్తావించలేదు..
    శంభూకుడి హత్యోదంతాన్ని ప్రశ్నించేసరికి అది ప్రక్షిప్తమైపోయిందా? మనకు నచ్చని వాటిని, మింగుడు పడని వాటిని ఇలా అనేస్తామా?

    రిప్లయితొలగించండి
  51. అసలు యజ్న యాగాదులలో పశువులను బలిచ్చి వాటి మాంసాన్ని వేద కాలం నాడు తినేవారంట.. దానికి గుర్తుగా ఇప్పటికీ యాగాలు చేసేటప్పుడు వాటి బొమ్మలను పిండితో చేసి దానిని ముక్కలుగా చేసి ప్రసాదంగా స్వీకరించడం అబద్ధమా? పశు మాంసం తిన్న రోజులలోనే వేదాలు గానం చేయగలిగారు. అది మానివేసిన కాలంనుండి బుద్ధిమాంద్యత వచ్చినట్లుంది పండితులకు.. పూజలకే పరిమితమైపోయారు....హహహ

    రిప్లయితొలగించండి
  52. వేల ఏళ్ళ నాటి సంగతులు, చరిత్రను పరిశోధించి ఆ పరిశోధన ఫలితాలను మాకందిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. వీటినన్నిటినీ ఒక కూర్పుగా, ఒక చేర్పుగా చేసి ఏ ద్రావిడ విశ్వవిద్యాలయానికో లేక ట్రైవాళ్ళీ (అమెరికా)
    విశ్వవిద్యాలయానికో PhD థీసిస్ గ పంపిస్తే, మీకు డిగ్రీ వస్తుంది గ్రంధాలయాల్లో పదిలపరుస్తారు. తరతరాలుగా మీ పరిశోధనలు చదివి వాటిమీద మరల పరిశోధనలు చెయ్యటానికి మీ లాగా ఆలోచించే వాళ్లకు వీలుగా ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి సేకరించిన పరిశోధన ఫలితాలు ఊర్కేనే పోవటం నాకు ఇష్టము లేదు.

    రిప్లయితొలగించండి
  53. వడ్రంగి పిట్ట గారు,

    ఇంతకీ ఏమంటారు? అసలు మీటపా ఉద్దేశ్యం ఏంటో స్పష్టంగా లేదు.

    సరే.. కొద్ది సేపటికి మీరన్నదే నిజమనుకుందాం. అయితే ఏంటి?

    ఇప్పుడు రాముణ్ణి పూజించే వాళ్ళంతా వాళ్ళు చూసిన మంచి లక్షణాల వల్ల పూజిస్తున్నారా లేక మీరు పైన చెప్పిన లక్షణాల వల్ల పూజిస్తున్నారా?

    Did anyone tell that they are worshipping Rama because of his so called -ve characterstics? Is anyone preaching that whatever Rama did was correct and we need to do all those even now including his so called mistakes?

    People see some exemplary qualitites in Rama and they want to worship him for those qualities and preach those qualities.

    If you have an issue with the qualities for which Rama is worshipped, or if you think those qualities are harmful to the society then certainly write about them. But what you wrote in this post beats my logic.

    It may be hurting but the truth is...the tone and tenor of this post is in a very very poor taste.

    రిప్లయితొలగించండి
  54. చాలా రోజులుగా నెట్ చూడనందున ఆలస్యంగా స్పందిస్తున్నాను.

    రాక్షసులు పశు మాంసం తింటారు అన్నాను కానీ రాక్షసులు మాత్రమే పశు మాంసం తింటారు అనలేదు. ఆ మాటకొస్తే దాదాపు అన్ని వర్ణాల వారూ పశు మాంసం తినే వారు. బ్రాహ్మణులతో సహా. అది తప్పు అనో ఒప్పు అనో నేను అనడం లేదు. పశువులను బలివ్వడం రాక్షసులు వ్యతిరేకించే కారణం కాదూ అని మాత్రమే చెబుతున్నాను. రాక్షసులు అంటే ఎవరు? రజో గుణ స్వభావం కలిగిన వారు అని వ్యుత్పత్తి. మీకు తెలీదని కాదు, విస్మరించారేమో అని. మాంసం తినే రాక్షసులు పశువులపై జాలితో మునులను వ్యతిరేకించారనా మీ వాదన? అర్ధ రహితంగా లేదూ?

    రాజ్యాలేలే రాక్షసులకు అడవుల్లో ఉండాల్సిన అవసరం ఏంటి? వారి అడవులను మునులు ఆక్రమించడం అన్న వాదనలో అసంబద్ధత మీకు తెలీనిదా? మనుష్య రాజుల రాజ్యాల్లో కూడా మునులు అడవుల్లోనే ఉన్న సంగతి ఆ రామాయణంలోనే ఉందిగా. చూ- విశ్వామిత్ర ఉపాఖ్యానం. ఇంకా కావాలా, రాక్షస గురువు శుక్రుడు కూడా అడవుల్లోనే ఉండేవాడు, (భారతం)

    మాంసం తినడం నేరం అని ఎవరూ అనలేదు. మద్యం, మాంసం బుద్ధిని మందగింపజేస్తాయి. ఆ కారణం తోనే వాటిని కొన్ని వర్గాలు వదిలేసాయి. ఆ తర్వాతే యాగాల్లో ఆ పద్ధతులకు ప్రతీకాత్మకంగా పిండిబొమ్మల వాడకం మొదలైంది. అదీ తప్పేనా? ఇక పండితుల బుద్ధి - మాంద్యం గురించి మీ వ్యాఖ్యలు మీ సంస్కారానికి సూచికలు, దానిపై నేనేం మాట్లాడను.

    ప్రక్షిప్తాలు మనకు నచ్చడాన్ని బట్టో నచ్చకపోడాన్ని బట్టో నిర్ణయించరు. రచనలో శైలీ భేదాలూ, ఇతర స్వభావాలూ వంటి ఎన్నో విషయాల ఆధారంగా నిర్ణయిస్తారు. అయోధ్యకాండ లోనే జాబాలి ప్రస్తావించిన నాస్తికత గురించి రాసిన వాల్మీకి శంబూకుడి గురించి రాస్తే కాదు అనేదెవరు? శంబూకుడు ఒక్కడే కాదు, ఉత్తర రామాయణమే అవాల్మీకం. అంతే తప్ప నాకు నచ్చని విషయం కాబట్టి ప్రక్షిప్తం అంటున్నాననడం సరి కాదు.

    వాల్మీకి గురించి కాకపొతే మరి మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వ్యాధుడైన వాల్మీకి కులం మీకు అతన్ని విమర్శించడానికి అడ్డం వస్తోందా? వాల్మీకి రచన కాకపోతే మీ వ్యాసానికి ఆధారం ఏంటి? థాయ్, తైవానీస్ తదితర రామాయాణాలా? లేక ఎర్ర కళ్ళ వారి రచనలా? లేక మీ అవసరం కోసం నోతికి వచ్చిన మాటలన్నీ ఒకచోట పోగేసేసారా?

    వానర జాతిలోని జీవిత విధానాలను పట్టుకుని రామాయణం మొత్తం రంకు మాత్రమే అని ఎవరో ప్రబుధ్ధులు తీర్మానిస్తే అది మీకు విశ్వసనీయం ఎలా అయిపోయిందో? అందులో అన్ని పాత్రలూ అక్రమ సంబంధాలే అని మీరంటారా? వాదన కోసం ఒప్పుకుందాం... ఆధునిక ఉదారవాదులు అలాంటి స్వేచ్చనే కదా స్త్రీకి కావాలని ప్రతిపాదిస్తున్నది? ఆ మాట వాల్మీకి చెప్పి ఉంటే మాత్రం మీకు తప్పన్న మాట. ఇదా మీ వాదన తీరు?

    తమకు నచ్చని విషయాలను ఏకంగా జరగనే లేదని బుకాయించేసే, వాటి ఉనికిని తుడిచి పెట్టేసే విధానం బ్రిటిష్, తర్వాతి కమ్యూనిస్టు చరిత్రకారులు చేసిన పని. ఎవరు చూడదలచుకోక పోయినా ఆ వక్రీకరణల కథలు ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి.

    ఫణీంద్ర పి, ఈటీవీ 2

    రిప్లయితొలగించండి
  55. నాకు గుర్తు లేని ఈ టాపిక్‌ని శంకర్ అనే తెలివితక్కువ సన్నాసి గుర్తు చేశాడు. వాడు నాస్తిక బ్లాగులకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకుంటే నాస్తికులకే లాభం కదా.

    రిప్లయితొలగించండి
  56. హహ ఈ అసహనమే నీ చేతకానితనాన్ని చూపిస్తోంది. కానీ ప్రవీణ్ ఐ డోంట్ కేర్

    రిప్లయితొలగించండి

Explore yourself..