5, మార్చి 2011, శనివారం

శాపం...

జారిపోతున్న గుండెనిబ్బరాన్ని
తిరిగి నిలబెట్టుకోవడానికి
జీవితమే యుద్ధంగా మారుతున్న
కాలాన...

కాల యముడిలా
అడ్డు నిలుస్తున్న
ఆర్థిక అసమానతతో పాటు
ఆత్మగౌరవం కోసం
ఆరాటపడాల్సి రావడం
విషాదం...

నోటికందిన
కూడు కడుపుదాకా
చేరేలోపే డొక్కలో
తగిలిన నీ తాపు
నా వెన్నును నిటారుగా
నిలబెట్టింది...

నా చేతిలోని
పుస్తకాన్ని
చించి పారేయ జూస్తున్న
నీ ముళ్ళ చేతులు
విరిగే రోజు
దగ్గర పడింది..

నా ఫీజు డబ్బులతో
కట్టుకున్న నీ
కార్పొరేట్ శిఖరం
కూలక మానదు.....

(ఫీజు రీయింబర్స్ మెంటు వస్తుందో రాదోనన్న అనుమానంతో ఇటీవల ఆత్మత్యాగం చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిస్మృతిలో)

2 కామెంట్‌లు:

  1. అందరికీ ఇంజినీరింగ్ కాలేజిలలో విద్య అంటే ఇంజినీరింగ్ విద్య కోసం ఫీజ్ రీఇంబర్స్మెంట్ ఎంత మందికి ఇచ్చేస్తారు? ఫీజ్ రీఇంబర్స్మెంట్ అనే కాన్సెప్టే ఒక మోసం.

    రిప్లయితొలగించండి

Explore yourself..