4, అక్టోబర్ 2010, సోమవారం

పుక్కిట పురాణాల నేపథ్యంలో ఓ --- తీర్పు



ఈ మధ్య వచ్చిన అయోధ్య తీర్పుపై చర్చ చేయడానికే చాలా మంది జంకుతున్నారు. ఎందుకంటే మతకల్లోలాలు వస్తాయేమో, ఈ పిచ్చి జనాలు కొట్టుకు చస్తారేమోనని. కానీ అటువంటివేవీ జరగలేదంటే దీని నేపథ్యమే ఓ అబధ్ధపు రంగుటద్దాలలో వుందన్నది స్పష్టమైంది. ఎవడికి వాడు గొప్ప లౌకికవాదిగా, మానవతావాదిగా కొత్త బురఖాలకోసం యాతనపడుతున్నారు. నిజంగా వీళ్ళదంతా నిజమైన దేశాభిమానమా? ఎవడికి వాడు రాజకీయ జిత్తులలో పై చేయి సాధించాలని చూస్తూ ఈ తీర్పుతో న్యాయదేవత కళ్ళను పూర్తిగా తొలగించారన్నది స్పష్టం. ఈ తీర్పు వెలువరించిన వాళ్ళకంటే కాస్తా కల్లు, మాంసం శిక్షగా వేసే కులపెద్దలే నయం కాదా? ఎందుచేతనంటే..

అసలు మీరన్న హిందూ ధర్మం ప్రకారమే యుగాల లెక్కల ప్రాప్తికి ఇప్పటికి రాముడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలైంది. ఒక్కో యుగం అంతమైనప్పుడు మొత్తం నాశనమైందన్నది మీ లెక్కే. అలా అయినప్పుడు అన్ని లక్షల సం.క్రితం నాశనమైన వాటి ఆనవాళ్ళు ఇంకా ఎలా లభ్యమవుతాయి. మొన్నటికి మొన్న వున్న వూళ్ళే ప్రాజెక్టుల పేరుతో నీళ్ళు నింపి నాశనమైన తరువాత వాటి ఆనవాళ్ళు మిగులుతున్నాయా? తుఫానులు, భూకంపాలతో నాశనమైన చోట ఇంకేమి మిగులుతుంది. ఇప్పుడున్న ఈ భారత దేశంలో వున్న అయోధ్య అన్ని లక్షల సం.ల క్రితం నాటి అయోధ్యగా ఎలా నిరూపించగలరు? అనవసరంగా ప్రజల బుఱ ను పాడుచేసి మతం రంగుతో మానవత్వాన్ని మంటగలిపి అసలు సమస్యలనుండి దృష్టి మళ్ళీంచే ఇలాంటి కుయుక్తులు పాలకవర్గాలు ఎన్నైనా చేస్తూనే వుంటాయి.

మరో సందేహం ఏమంటే కేసు అరవై ఏళ్ళ క్రితం నాడు మొదలైంది. మరి ఇది కొనసాగుతున్న కాలంలో అక్కడ బాబ్రీ మసీదు వున్నదే కదా? అది వాడుతున్నారా లేదా అన్నది ముఖ్యంకాదు. ఆ పేరుతో కట్టడం వుంది కదా? దానికింద పరిశోధించి ఆలయాల ఆనవాళ్ళు వున్నాయని తీర్పునిచ్చారంటున్నారు. మరి ఆ కట్టడాన్ని కూలగొట్టించడంలో న్యాయస్థానం పాత్రకూడా వున్నదని ఒప్పుకుంటున్నారా? మరి అది కూలగొట్టబడడం వల్లనే కదా మీ తీర్పునివ్వగలిగారు? అంటే బాబ్రీ మసీదు కూల్చివేత వెనక అలహాబాదు న్యాయస్థానం పాత్రకూడా వుందన్నమాట అన్నది సత్యదూరం కాదు. ఒకరేమో ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారంటారు, ఒకరేమో ఆలయ శిధిలాలు లేవంటారు. అంటే ఎవరిది నిజమైన తీర్పు. అసలు ఈ తీర్పు న్యాయస్థానం వెలువరించిందా లేక మతపెద్దల కూటమిదా? అన్న సందేహం వుంది. తీర్పు శాస్త్రీయ ప్రమాణాలకు దూరమన్నది నిజం కాదా? ఈ న్యాయమూర్తులు ఎవరి మతానికి వాళ్ళు రిప్రజెంట్ చేసినట్లుగా లేదా?

రాముడు కలలోకి వచ్చి చెప్పాడన్న సాకుతో సాధువుల ప్రేరణతో, వైకుంఠానికి చేరి స్వర్గ సుఖాలనుభవించొచ్చు అని చెప్పిన వారి ప్రాపకంతో బాబ్రీ కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాటి బ్రాహ్మణ ప్రధాని. ఇంతకంటే దారుణముంటుందా?

మూడు వాటాలేసి సమన్యాయం పాటించామంటున్నారు. ఇదెలా? హిందు, ముస్లింలకు, నిర్మోహి అఖారాకు మూడు వాటాలన్నారు. ఈ నిర్మోహి అకారా వారు హిందువులు కాదా? అంటే రెండు వాటాలు వీళ్ళకు ఒక వాటా వాళ్ళకు.

అసలు ఈ మసీదులు, మందిరాలు తప్ప జనానికి వేరే పనిలేదనుకుంటారు ఈ బుఱ తక్కువ వెధవలు. జనానికి ఇవేమీ పట్టవని, వాళ్ళ పొట్టకోసం పాడుపడుతూ వుంటారని, ఎవడో ఒకడు కోరి చిచ్చు పెడితే తప్ప వాళ్ళు ఏమీ స్వతహాగా చెడ్డ పనులు చేయరన్నది నేడు నిరూపితమైంది. కాబట్టి ఇకనైనా మందిరాలు, మసీదులు గురించి మాని జనం గోడు పట్టించుకోండి. రాసుకున్న రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నాలు మానుకోండి.

జయహో భారత్..


యుగాల గురించిఃhttp://www.indianetzone.com/40/four_yugas.htm

66 కామెంట్‌లు:

  1. ఎవడో ఒకడు కోరి చిచ్చు పెడితే తప్ప వాళ్ళు ఏమీ స్వతహాగా చెడ్డ పనులు చేయరన్నది నేడు నిరూపితమైంది.
    _________________________________________________

    LOL, మీలాంటి వాళ్ళు కులం పేరుతో, మిగతా వాళ్ళు మతం పేరుతో .. Big deal?

    రిప్లయితొలగించండి
  2. పిట్ట మనసులో ఏముందీ అని అప్పుడెప్పుడో జమున ఎంత టెంప్టింగా పాడినా జవాబివ్వని నువ్వు (లేకపొతే మీ తాత పిట్ట) ఇన్నాళ్ళకు పలికావా ?

    ఏదో పిట్ట బుర్రలే, ఏం పొడుస్తుందిలే అనుకున్న నాకు దిమ్మ తిరిగిందంటే నమ్ము!

    అసలు తలపండిన తాతయ్యలిచ్చిన తీర్పుని విశ్లేషించేంత కత్తి లాంటి బుర్రున్న నీకు జాతీయ పక్షి హోదా లేకపోవడంపై ఢిల్లీ తల్లికి విజ్ఞాపన పెట్టా ఇందాకే. కనీసం అక్కుపక్షి హోదాలు కూడా ఖాళీల్లేవని జవాబొచ్చింది. నువ్వోపని చేయ్, ఈ పోస్ట్ ని హింగ్లీష్ లోకి తర్జుమా చేసి delhi_talli@italy.com కి మెయిల్ పెట్టు. శుభం!

    ఆఁ, ఇంకో మాట. కూర్చున్న కొమ్మనే/ చెట్టునే కొట్టడం మంచిది కాదే పిట్టా. దీన్ని మీ యజమానులు చెప్పలేదా? ఇదేమంత కత్తిలాంటి విషయం కాదనుకో!

    మేమనుకుంటాం, హిందూత్వం ఓ మతం కాదూ, ఓ జీవన విధానం అని. నువ్వేమో పిట్ట కూతలు కూస్తివాయె. ఏం చేస్తాం? లక్షల ఏళ్ళ క్రిందటి వ్యక్తిని కూడా ఇంకా పూజిస్తున్నామంటే ఆయనలో ఎదో గొప్పతనం ఉండుండాలికదే పిట్టా? ఇకపోతే ఆనవాళ్ళ గూర్చి ఆర్కియాలజిస్టులు చూస్కుంటార్లేవే మనకెందుకూ? అంతగా ఐతే వారి కార్యాలయం చెట్టు పై కొన్నాళ్ళు విశ్రాంతి తీస్కొ, విశదమైపోద్ది.

    సౌలభ్యం కోసం నిన్ను పీక్యూబ్ అంటానే సరేనా? (పొడిచే పనిగల పిట్ట అని)

    ఏతావాతా తేలిందేంటంటే పిట్టలు జడ్జీలకన్నా బెటరని.

    జయహో పీక్యూబ్!

    రిప్లయితొలగించండి
  3. రామజన్మభూమి సరే గానీ ఇది చదువుతూంటే పర్ణశాల బ్లాగు చదువుతున్న అనుభూతి కలుగుతోందేంటి చెప్మా ?

    రిప్లయితొలగించండి
  4. పై అజ్ఞాతగారూ, ఏ గూటి పిట్ట (చిలక) ఆ గూటి పలుకే పలుకుతుందంట :)

    రిప్లయితొలగించండి
  5. కులం గురించి మాట్లాడితేనే కులగజ్జి అయితే, ఇప్పుడు అనవసరంగా కులాన్ని కెలికిన మలక్ పేట రౌడీది ఏంగజ్జి?

    రిప్లయితొలగించండి
  6. అబ్బా ఛా, కులం గురించి కెలికిందెవరో ఈయన ముందు పోస్టులు చూస్తేనే తెలుస్తుంది - నీకున్న గజ్జి కూడా దే కదా, షాడో - ఐడీ మార్చినా గజ్జి పోదుగా

    రిప్లయితొలగించండి
  7. కొసమెరుపులు నీడలైపోతే ఇలాగే ఉంటుంది :))

    రిప్లయితొలగించండి
  8. షాడో, నీకు బాస్ నుండి స్పెషల్ అస్సైన్‌మెంట్!

    గజ్జి లో రకాల గురించి, వాటి ట్రీట్మెంట్ల గురించిన నీ అధ్యయనం వారికి బాగా నచ్చిందంట.
    ఇక ఆయింట్‌మెంట్స్ తీసుకుని రంగంలోకి దిగమన్నారు.

    నీకోసం ఒక కత్తిలాంటి అసిస్టెంట్ని పంపుతున్నారు. తను నీకు అన్నింట్లోనూ తోడుంటుందని చెప్పమన్నారు. :)

    రిప్లయితొలగించండి
  9. *రాముడు కలలోకి వచ్చి చెప్పాడన్న సాకుతో సాధువుల ప్రేరణతో, వైకుంఠానికి చేరి స్వర్గ సుఖాలనుభవించొచ్చు అని చెప్పిన వారి ప్రాపకంతో బాబ్రీ కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాటి బ్రాహ్మణ ప్రధాని. ఇంతకంటే దారుణముంటుందా?*
    మీకు ఇదేవరు చెపారబ్బా. ఈ పైవాక్యాన్ని బట్టి చెప్పవచ్చు తమరి దగ్గర ఉన్న జ్ణానం విలువ సున్నా అని. ఇటువంటి పిచ్చి రాతలు శాస్రీయ మైనవి అని కొందరు చెప్పటం చూస్తే వారి మీద విపరీతమైన జాలి వేస్తున్నాది. కనీసం పి.వి. రాసిన డిసేంబర్ 6 పుస్తకం చదవలేదని అర్థమౌతున్నాది. అదేకాక బాబ్రి మీద వేసిన కమిటి పి.వి. ఫారికి క్లీన్ చిట్ ఇచ్చిందనె సంగతి కూడా తెలిసినట్లు లేదు. మీ కత్తి మహేష్ గారే ఈ విషయం పై ఒక సారి ఆయన బ్లాగులో పి.వి.గారిని పొగిడారు కూడాను.

    వడ్రంగి పిట్టా ఇంకా బ్రహ్మణులను ఎంత కాలం ఆడిపోసుకుంటారు గాని, వారు దేశ సేవ చేసినంతకాలం చేశారు. ఇప్పుడు మిగతా వర్గాలకు ఆ అవకాశం ఇచ్చారు కదా, మిరు పదే పదే వారి మీద పడి ఎడవడానికి అటు రాజకీయాలలోను, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలలోను మునుపటిలా వారేమి ఎక్కువ గా లేరు. రాను రాను వారిలో ప్రభుత్వ ఉద్యోగాల వైపు వచ్చే వారు తగ్గి పోయారు. ఒకసారి వారు పాలన చేసినపుడు మిగతావర్గాల ఇప్పటి పాలన బేరీజు వేసుకోండి, ఎవరు సెక్యులర్, సామాన్య మానవుడిని దృష్టిలో ఉంచుకొని పని చేశారొ అర్థమౌతుంది. మీ లాంటి వారిని నుంచి సెక్యులర్ పాటాలు వినవలసిన అవసరం మాకేమి లేదు.
    అదేకాదు బ్రహ్మణులు వదిలేసిన ప్రతి రంగం తన పూర్వ వైభవం కోల్పోయింది. ఒక్కపుడు టిచర్ వృత్తిలో ఉంట్టు రూ 4000-5000 కి ఎంతో నిబద్దతతో పని చేశారు ( 1980సం||). అదే ఇప్పటి టీచర్ల సంగతి చూడండి, విధ్యార్దినులను కడుపు చేసి పంపుతున్నారు. అదీ తేడా. ఊరకనే నోతికి వచ్చినట్టు వాగడం కాదు. ఎదైనా నీకు చేతనైతే తక్కువ మాట్లడి ఎక్కువ పని చెసేది. ఎదో ఒక ఊరిలో కనీసం నెలకోక సంఘటన ఉంట్టుంది

    రిప్లయితొలగించండి
  10. ఎమర్జెన్సీ పేరుతో కర్కశ పాలన చేసిన ఇందిరా గాంధీ బ్రాహ్మణురాలే. బోఫోర్స్ కుంభకోణం చేసిన రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడే. హవాలా, సెయింట్ కిట్స్ లాంటి కుంభకోణాలు చేసిన పివి నరసింహారావు బ్రాహ్మణుడే. కాంగ్రెస్ వాళ్లు బ్రాహ్మణులని ఇంత మేపబట్టే దేశం ఇలా ఉంది.

    రిప్లయితొలగించండి
  11. >> ఎమర్జెన్సీ పేరుతో కర్కశ పాలన చేసిన ఇందిరా గాంధీ బ్రాహ్మణురాలే. బోఫోర్స్ కుంభకోణం చేసిన రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడే.
    -----------------------------------------------

    దళితుల పక్షాన నిలబడ్ద శంకరన్ సారు బ్రాహ్మణుడే,
    బ్రాహ్మణీకాన్ని ఎండగట్టిన చలం బ్రాహ్మణుడే, శ్రి శ్రి బ్రాహ్మణుడే,
    మనకి అలోచించడం నేర్పించిన గురజాడ, చిలకమర్తి బ్రాహ్మణులే
    కులం బట్టి మంచి చెడ్డలు వస్తాయని ఎవరు చెప్పారండీ ? సంస్కారానికీ కులానికీ సంబంధం ఏమిటి ?
    దళితులండరూ మంచి వారని అధికారానికి వస్తే మడి కట్టుకుని కూర్చుంటారని మీ ఉద్దేశమా ? ఈ వాదనకి counter నేను ఇవ్వక్కరలేదనుకుంటా , మీ ఎదురుగానే అద్భుతమైన examples ఉన్నాయి కదా కూర్చుంటారని మీ ఉద్దేశమా ? ఈ వాదనకి counter నేను ఇవ్వక్కరలేదనుకుంటా , మీ ఎదురుగానే అద్భుతమైన examples ఉన్నాయి కదా

    రిప్లయితొలగించండి
  12. *హవాలా, సెయింట్ కిట్స్ లాంటి కుంభకోణాలు చేసిన పివి నరసింహారావు బ్రాహ్మణుడే.*
    కోటి రూపాయల సూట్ కేస్ ఇచ్చనన్న హర్షడ్ మెహతా గారు కోటి రూపాయలకి 100 రుపాయలు ఎన్ని ఉనంటాయి, అన్ని రూపాయలు ఎంత స్థలం ఆక్రమిస్తాయి, ఎన్ని సూట్ కేసులలో ఆ డబ్బులు పడతాయి అని లెక్క వేసి అంత డబ్బు ప్రధాన నివాసం లో తీసుకు పోయి ఇవ్వటం అసంభవమని తెలిసిపోయింది. అలా ఆరోపణలు చేసినవారికి బుర్రలు మోకాలు లో ఉండబట్టి కొన్ని రోజులు నిందలు వేయగలిగారు. తరువాత వారి వాదన నీటి మీద రాసిన రాత లా కొట్టుకు పోయింది. అయ్యా తమరికి తెలుసోలేదో పై రెండు కేసులు వీగి కోర్ట్ లో వీగి పోయాయి. తమరికి సెయింట్ కిట్స్ కేసు మీద సత్యం తెలుసు కోవాలని ఉంటె ఈ కిందిది చదువు.

    http://www.janataparty.org/articledetail.asp?rowid=17

    V.P.Singh Part II Subramanian Swamy

    రిప్లయితొలగించండి
  13. దళితుల కేసులు వాదించే,పోరాడే స్వర్గీయ బాలగోపాల్, కన్నాభిరాన్,వరవర రావు వీరంతా బ్రహ్మణులే. అసలికి మీ పంచా అయ్యలయ్య ఒక్క కేసు ఎక్కడైనా వాదించాడా? లేక బడుగుల తరుపున పోరాడాడ? పసలేని నాలుగు పుస్తకాలు రాసి ప్రోఫెసర్ ఐనాడు. ఇది రోమీల్లా తాపర్ లాంటి ఎర్ర పార్టీ వాళ్ళు నేర్పించిన టెక్నిక్. అతను దళితుడు కూడా కాడు బి.సి. మీ దళితుల కేసులను బ్రహ్మణ/ అగ్రవర్ణాల లాయర్ల మద్దతు లేకుండా ఒక సారి కోర్ట్ గుమ్మతోకండి అప్పుడు తేలుస్తుంది. మీ కేసులను వెనుకబడిన తరగతులకు చెందిన పి. శివశంకర్ లాంటి వారు ఎన్నివాదించారు? ఎన్నికలప్పుడు మాత్రం వేనుకబడిన వారికి సి.యం. పదవికి అవకాశాలు ఇవ్వటం లేదు అని గగ్గోలు పెడతాడు. సదరు శివశంకర్ గారు డబ్బులు బాగా సంపాదించి డీల్లీ లో సౌత్ యక్స్టెన్షన్ అనే మంచి పాష్ లోకాలిటిలో సేటిల్ అయ్యారు. బీదా బిక్కి బడుగులు కేసులు వాదించి ఉంటె ఆయన ఒక చిన్న ఇల్లు కొనుకోడానికి కూడా డబ్బులు లేక అద్దె ఇంట్లొ ఉండవలసి వచ్చేది. అది మీ నాయకులు మీకు చేసిన సేవ. మీ మేధావులు రాసేవి నిజం చెప్పాలి రాసిన వారికి తప్ప ఇంకొకరికి ఉపయోగపడవు. సదరు పుస్తక రచయితకు విశ్వవిద్యాలంలో ఆచార్య పదవి ఇచ్చి ప్రభుత్వం సత్కరిస్తుంది. మరీ వీరు ఎక్కువ గలాబా చేస్తే వారికి వి.సి. పదవి ఇస్తారు. అలా మీరనుకొనే ఆ మేధావి ప్రభుత్వానికి అమ్ముడౌతాడు. మీరు ఆ పుస్తకాలు చదివి అక్కడరాసినవి నిజమనుకొని తెగె ఫీలౌతారు. ఈ విషయాలను దగ్గర గా ఉండి పరిశిలించిన కొంతమంది, లౌక్యం తెలిసిన కొన్ని కత్తులు బ్లాగులో ఆ మేధావుల తరహాలో రాసుకొంటూ, పోరాటాలు చేసుకొంట్టు పేరు ప్రఖ్యాతులు మేధావి అన్న బిరుదులను ఆవర్గ అభిమానులను పొందుతూ ఉంట్టారు.ఎవరైనా ఎమీటి మీరు అర్థం పర్థం లేకుండా రాస్తున్నారు అని ప్రశ్నిస్తే అగ్రవర్ణలా అభిజాత్యం అని గలాటా చేస్తారు. లేక పోతే రాష్ట్రపతి కావలని ఉబలాట పడిన వ్యక్తి సినీహీరొ స్థలాన్ని ఎలా ఆక్రమించ బోయాడో తెలుసు కదా. మీవర్గం వారు మీకు చేసే సేవలు చూసి వారి మీద మీకే నమ్మకం లేదు. అందువలన దళితులకు ఆ మోడల్ కావాలా ఈ మోడల్ కావాలా అని వ్యాసాలు రాసుకొంట్టుంటారు. మీ దగ్గర అంత సత్తా ఉంటే మీరే ఒక మోడల్ తయారు చేసుకొని అభివృద్ది చెందండి, ఆనందిస్తాం కాని ఎప్పుడు చూసినా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదానికి అగ్రవర్ణాల మీద బురద చల్లడం మానుకోండి. మిత్రమా మీరు, మీ మేధావులు, నాయకులు ఎంత స్వార్ధ పరులో అందరికి తెలుసు. మీరా బ్రహ్మణ నాయకులను నిజాయితిని ప్రశ్నించేది? ఐనా అలాగే నడూకుంటాము అంటె , మీదగ్గర ఆవాల గింజంత నీజాయితీ ఉంటె ముందర పైన చెప్పిన లాయర్ల మద్దతు తీసుకోవద్దు. వారు మీరు ద్వేషించే బ్రహ్మణ తల్లిదండృలకు పుట్టారు.

    రిప్లయితొలగించండి
  14. మన దేశంలో కోర్టులు ఎవరికి అనుకూలంగా తీర్పులు చెపుతాయో తెలియదా? లాలూ ప్రసాద్ యాదవ్, సంజయ్ దత్ ఇంకా చాలా మంది ఉన్నారు కోర్టులు విడుదల చేసినవాళ్ల జాబితాలో. పివి నరసింహారావు మీ కులంవాడు కదా అని అతని మీద ఆరోపణలు తప్పు అని అంటున్నావు.

    రిప్లయితొలగించండి
  15. ముందర తమరిది ఎకులమో చెప్పు. తరువాత నా సమాధానం ఇస్తాను

    రిప్లయితొలగించండి
  16. నీకు కావలసి వస్తే, తృప్తిగా కసితీరా పి.వి.ని మీ వార్డ్ కౌన్సిలర్తో పోల్చుకొని తృప్తి చెందు.లాలు ని తీసుకొని వచ్చి పి.వి.తో పోల్చి నీ అత్యంత అద్బుతమైన తెలివితేటలను మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అతను గడ్డి తిని డబ్బులు సంపాదించాడు ? మీరు రోజూ ఎమితింట్టునారు సారు ఇటువంటి తెలివితేటలు వచ్చాయి మీకు ?నువ్వు మార్తాండవని అర్థమైయింది. నేను ఆరోగ్యం సరిగా ఉన్న మనుషులతో చర్చిస్తాను, అంతే కాని ఎర్రగడ్డ ఆస్పత్రి పేషంట్లతో కాదు .ఇక సెలవ్ .

    రిప్లయితొలగించండి
  17. @పైన 'గొప్ప' అగ్నాతకి
    స్వకుచ మర్దనము బాగానే చేసుకున్నావులే.పుట్టుకతోనే గొప్పవాడు అనుకునే నీ అజ్ఞానము గురించి ఎంత మాట్లాడిన తక్కువే..
    దళిత శ్రమ గురించి తెలియక ,వారి దేశ సేవ గురించి తులనాడే అంతటి గొప్పవాడివి అయ్యావ? నీవు కోటి జన్మలెత్తి దళితుల కాళ్ళ దగ్గర పాద పూజ చేసిన దళితులు ఈ భారత దేశానికి చేసిన సేవముందు దిగదుడుపే.
    తన శ్రమ,ధన, మాన,ప్రాణాల్ని పణంగా పెట్టి తమ రక్తాన్ని ఈ పవిత్ర భారతావనికి ధార పోశారు.ఒక్కసారి చీపురు పట్టుకొని పబ్లిక్ పాయిఖాన కడుగు .నీకు ఒక్కసారి తెలుస్తుంది ఎవరు గోప్పవారో.లేదంటే ఎర్రటి ఎండలో ఒళ్ళు ముక్కలు అయ్యేలా పనిచేయి నీకు తెలుస్తుంది ఎవరు గొప్పవాల్లో.డబ్బు లేక,సదువుకొనే అవకాశాలు లేక,సాటి భారతీయుల చేత కులము చేత అవమానాల పాలు అయ్యి బిక్క చచ్చి పొయ్యిన నీ సహోదరుడ్న నువ్వు తులనాడేది.
    ఎలా వచ్చింది సారూ నీకు అంత ప్రతిభ?ఎలా వచ్చింది సారూ మీకు అంతటి ఆస్థి పాస్తులు. ఒకనాడు కరణాలు,భూస్వామ్య పద్దతిలో రాసుకున్నవేగా.శ్రమ దళితులది.అనుభవించింది మీరు.
    ఎంతటి కష్టాన్ని అయిన మోసి,కనీసము దేవాలయము మోహము చూడలేక,ఏదో కిరస్తానీ మతము తీసుకొన్న సరే మమ్ముల్ని వేదిస్తున్నారే.ఆఖరికి మాకు దైవాన్ని చూచే భాగ్యము కూడా లేకుండా చేసారే.మమ్ముల్ని కిరస్తానీ వాళ్ళు అంటూ నిరంతరమూ ఎగతాళి చేస్తున్నారే, ఏది సారూ న్యాయము?మీరేమో అదే కిరస్తానీ వాడి దేశములో ఉంటూ,వాడి కాళ్ళు నాకుతూ మమ్మల్ని తులనాడుతున్నారే? ఎక్కడిది సారూ ధర్మమూ? నీవ మా దేశ భక్తీ గురించి మాట్లాడేది.
    మాకు ఇట్చే కొంత రిజర్వేషన్ గురించే గా సారూ మీ ఏడుపు.ఏమి బావుకున్నాము అని సారూ ఆ ఏడుపు.అన్ని ఉన్నత పదవుల్లో ఉండేది మీరేగా? అప్రకిటిత రిజర్వేషన్స్ అన్ని మీకేగా?కొన్ని వేలసంవత్సరాలు గుంప గుత్తగా 100 శాతము మీదేగా.గత 60 సంవత్సరాలుగానే గా మేము కొంత జన జీవన స్రవంతిలోకి రాగలిగింది.దాన్ని కూడా ఎనాడయిన పూర్తిగా అనుభవించామ? లేదే? ఎంత మంది దొంగ కుల సర్టిఫికేట్లతో మాకు ఇచే దాంట్లో బొక్క పెట్టలేదు?అయ్యా మీరు దళితులకి ఏమి సేవ చెయ్యనక్కరలేదు.కనీసము వాళ్ళ మానాన వాళ్ళని బతకనియ్యండి.మీ నిప్పులు కడిగే వంశాలతో,అగ్ని హోత్రాలతో స్వర్గ ప్రాప్తి పొందండి.కాని బలహీన,దళిత ప్రజలని కనీసము వారి మానాన వారిని భూమి మీద బతకనియ్యండి.
    మీవి కడుపు నిండిన మాటలు.మావి కడుపు ఎండిన మాటలు.
    ఇక సెలవు.

    రిప్లయితొలగించండి
  18. నువ్వు తింగరి వ్యాఖ్యలు రాయకు. నువ్వను కోవలసిందే నీకు కిరస్తాని వారు సహాయం చేసారని. వారి ప్రాపగండాలో అదొక భాగం వారు మీకు అంత సేవ చెస్తే ప్రతి రాష్ట్రంలో పాశ్టర్ పదవులు దళితులకు ఇవ్వటం లేదు అని క్రైస్తవ దళితులు రోడ్డున ఎందుకు బడతారు?
    -----------------------------------------------
    * ఒక్కసారి చీపురు పట్టుకొని పబ్లిక్ పాయిఖాన కడుగు .నీకు ఒక్కసారి తెలుస్తుంది ఎవరు గోప్పవారో.లేదంటే ఎర్రటి ఎండలో ఒళ్ళు ముక్కలు అయ్యేలా పనిచేయి నీకు తెలుస్తుంది ఎవరు గొప్పవాల్లో*
    Lower caste workers are angry that Brahmins were stealing their jobs.
    "Brahmins get enrolled but they never do the menial jobs. They cannot do it. We are protesting against the Corporation, as it will mar our employment opportunities, which has been our job for ages. What will we do if they take away our jobs?" asked Shyam Lal Valmiki, President, Sweepers' Association.
    No other choice
    But the Brahmins who've applied say they had no other choice.
    The corporation received over 6,000 applications for sweeper posts, of which 1,607 applications were from Brahmins.
    "We need jobs. There is so much unemployment in the country that people want jobs irrespective of the fact whether they should or should not do as per the caste system," said Rajendra Shukla, an upper caste candidate.
    ----------------------------------------
    http://www.youtube.com/watch?v=P7Xgc4ljHKM
    http://www.rediff.com/news/2006/may/23franc.htm
    http://www.mail-archive.com/zestcaste@yahoogroups.com/msg03533.html

    రిప్లయితొలగించండి
  19. పైన రాసిన దానికి ఒక్క సమాధానం చెప్పలేని నువ్వు మీ నాయకుల గురించి "అయ్యా మీరు దళితులకి ఏమి సేవ చెయ్యనక్కరలేదు.కనీసము వాళ్ళ మానాన వాళ్ళని బతకనియ్యండి" అంటావా? అది నోరా లేక ఇంకేమైనా నా? నీ బోటి బాగా డబ్బులు, ఉద్యోగాలు ఉన్న వారు ఇంటర్నేట్ కనేక్షన్ పేట్టుకొని ఈ మాటలు కాక ఇంకేమి అంటారు? నువ్వు పైకి వచ్చేశావు మీ వర్గం లో మిగతా వారు ఎటు పోతే నీకేందుకు? నువ్వు అంతే, మీ మేధావూలంతే, మీ నాయకులు అందరూ అందరే. అందువలనే వారి తప్పులను నువ్వు చూసి చూడనట్లు వదిలేసి నా మీద పడి నోటికొచ్చినట్లు మాట్లాడుతావా? నీదగ్గర ఒక్క శాతం నిజాయితీ ఉంటే మీనాయకుల అవినితి మీదా రాసుకో వ్యాసాలు. కనీసం కొందరికైనా కనువిప్పు కలుగుతుంది. మానవత్వం మిగులుతుంది.

    రిప్లయితొలగించండి
  20. మాకు పాస్టరు పదవులు ఎందుకు సారూ.మాకు కావాల్సింది దైవచింతన.మీ బుద్ది ఇక్కడ కూడా పోనిచుకున్నారు కాదు.మీరు ఆలోచించేది పదవులు,మేము ఆలోచించేది బతకడము గురించి.
    హహాహాహ బాగా పెద్ద జోకారు. ఎంత మంది బాపనోళ్ళు పాయఖానాలు కడుగుతున్నారు సారూ.
    మహా సముద్రములో ఒక పరమానువుని ఉదాహరణగా చూపించి మా శ్రమ శక్తి ని తక్కువ చెయ్యడానికి చూపిస్తున్నారు.
    చెప్పండి సారూ నేను మీతో రావడానికి సిద్దము.నేను ఈ అమెరికాలోనే ఉంటాను.ఎక్కడ కలవ మంటారో చెప్పగలరు.డబ్బులు మొత్తము నేనే పెడతాను.ఎంత మంది బాపనోళ్ళు శ్రమ శక్తి చేస్తున్నారు,ఎంత మంది దళితులూ శ్రమ శక్తి తో బతుకుతున్నారో చూపించండి.నేను చెప్పిన మాటల్లో ఎమన్నా తప్పు ఉంటె మల్లి ఈ బ్లాగుల మొఖము చూడను.

    రిప్లయితొలగించండి
  21. మాకే ఆ రామ నామము ఉచ్హరించే అవకాశాన్ని కలిగించి ఉండి ,ఆ శ్రీ రామ దర్శనము కలిగించి ఉంటె ఎందుకు సారూ మేము ఈ నజరేతు పుత్రుడ్ని పట్టుకొని వేలాడేది.
    మాకు ఎమన్నా తిక్క?ఈ ప్రపంచములో దైవము లేక బతికిన జాతి ఏదన్న ఉందా?ఈ భూమండలము మీద అల్లా కాని,బుద్దుడు కాని,జీసస్ కాని,రాముడు కాని,మెస్సయ్యా కాని,కన్ఫుసిసు కాని ప్రతి ఒక్కరు అన్ని రకాల ప్రజల చేత కొలచాబడ్డారు.
    ఒక్క దళితులే దేవాలయము గడప తోక్కక ఎన్ని ఇబ్బందులకు లోను అయ్యారో తెలుసా?మాకు కూడా దేముడు కావాలా? కొన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఆ దేముడి మొఖము చూడనియ్యలేదు.ఎవడయితే నేమి కిరస్తానీ వాడు కాని,తురక కాని మా కోసము వచేవాళ్ళ దగ్గరికి వెళ్తాము.మమ్మల్ని దూరంగా పెట్టె వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాము.
    ఉందా నీకు దమ్ము దళితులకి జరిగిన ఈ అన్యాయము పై పోరడానికి? ఆ కలియుగ వైకుంటుడు మా వాడలకి వస్తే అపవిత్రుడు అయ్యాడు అని గగ్గోలు పెట్టారు.మండదా నా హృదయము.
    చల్ రే పుట్ ..మేము కన్ను ఎర్రజేస్తే సలబాల్లగా మాడి పోతారు..తస్మాత్ జాగ్రత్త.మేము ఆలోచంచ మొదలు పెట్టాము.కన్నీళ్ళు కస్టాలు మాకు కొత్తకాదు.రక్తము,చెమట,పట్టుదల మా ఊపిరి.మరో ప్రపంచాన్ని యూదులవలె నిర్మిస్తాము.

    రిప్లయితొలగించండి
  22. *మాకు పాస్టరు పదవులు ఎందుకు సారూ.మాకు కావాల్సింది దైవచింతన.*
    అబ్బీ పాస్టర్ పదవులు ఇవ్వలేదని సికింద్రాబాద్ లో చర్చి ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేసింది మీ వారే అబ్బీ. ఈ పాస్టర్ పదవిని క్రైస్తవ అగ్రవర్ణాలకే ఎప్పుడూ ఇస్తారా అని గొడవపడ్డారు కాని దైవచింతన కొరకు కాదు. మమ్మల్ని మత ప్రచారం లో భాగం గా వాడుకొని కన్వర్ట్ చేసి పదవుల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అగ్రవర్ణల వారికి ఇస్తారా అని చర్చ్ పెద్దలను నిలదీసారు.

    రిప్లయితొలగించండి
  23. పద మమ్ముల్ని కూడా దేవాలయాల్లో పూజారులుగా నియమించండి.మమ్మల్ని మనుషులుగా పరిగణించండి.ఈ సమాజ సంపదలో మాకు కూడా వాటా పంచండి.అప్పుడు ఈ కిరిస్తాని మతము మాకు శస్ప సమానము.అర నిముషములో వదిలేస్తాము.
    మొత్తము దళిత క్రైస్తవులు అందరిని హిందువులగా మారుస్తా.ఉందా నీకు ఆ దమ్ము ఇక్కడ మాట్లాడే అజ్ఞాత.

    రిప్లయితొలగించండి
  24. //నువ్వు తింగరి వ్యాఖ్యలు రాయకు
    మీ వంటికి పట్టిన మదాన్ని ఇక్కడ చూపిస్తున్నావు కదా.మమ్ములను ఏక వాఖ్యముతో సంబోదిన్చినప్పుడే తెలుస్తుంది మీకు ఎంత గర్వము ఉందొ.ఇంకొక్క సారి మమ్ములను ఏక వాఖ్యము తో సంబోదిస్తే చెప్పుకి పెంట రాసి కొడతా.

    రిప్లయితొలగించండి
  25. నీకు తెలుసో లేదో ఇప్పుడు ఆ పని కూడా మొదలైయింది. చిన్న జీయర్ గారి వేద పాఠశాలలో అన్ని వర్గాల ప్రజలకు వేదాలు నేర్పిస్తున్నారు కదా.
    మీరేందుకు అలా మిమ్మల్ని పూజారులు గా పెట్టటం అసంభవం అనేవిధం గా భావిస్తారు. ఆ సమయం వస్తున్నాది. నేను చిన్నపుడు వేళ్ళిన గుడిలో పూజారి దళితులే, స్కులు కి పోయె టప్పుడు రోజు వేళ్ళే వాడిని. అసలికి మీరు నిసర్గ దత్త మహరాజ్ అనే అతను బాంబె లొ ఉండేవారు. ఇప్పుడు లేరు ఆయన గొప్ప యోగి, దత్తాత్రేయ స్వామి సంప్రదాయంలో వారు గురువులు. ఆయన దళితుడే అతను చెప్పిన ప్రతి మాటా నోట్ చేసుకొని అతని పైన ఎన్నో పుస్తకాలు రాసినది బ్రహ్మణులే. మీరు ఇలా మిమ్మల్ని చిన్న బుచ్చుకోవటం ఎమీ బాగ లేదు. http://en.wikipedia.org/wiki/Nisargadatta_Maharaj

    రిప్లయితొలగించండి
  26. ఎక్కడ సారూ,ఆ గుడి కొంచెము చెపితే మేము కూడా దర్శనము చేసుకొని వస్తాము.మేము కూడా ఇప్పటికి హిందువులమే.
    మా అమ్మ పెళ్ళికి పురోహితుడు కావాలని వెళితే కుంటి(క్షమించాలి.అంగ వ్యకల్యము గురించి చెప్పినందుకు),తొర్రి బామ్మడ్ని పంపిస్తాము అన్నారు అంట.
    తొర్రి తో చెప్పిన మంత్రాలకి మంత్ర సిద్ది ఉండవు అంటారు కదా సారూ.ఇక గతి లేక పోలేరమ్మ తల్లి ముందు దండలు మార్చి తాళి కట్టాడు అంట మా అయ్యా.పల్లెటూళ్ళలో క్లాసులో మమ్మల్ని చివరాకరన కూర్చోపెట్టి,మా చేత పాలు,పెరుగు మోపించి(అంటే అవి మావి కాదు.మేము రైతుల ఇళ్ళ దగ్గరికి వెళ్లి మోసుకొని రావాలి) ,వాళ్లకి గడ్డి మోపులు మోసి,కావిళ్ళతో నీళ్ళు మోసి మా భుజాలు,హృదయాలు కాయలు కాసినవి సారూ.మీదేమో మీగడ పేరు మాటలు.మావి కన్నీళ్ళ మింగిన ఆకలి కేకలు.ఎలా చదివామో ఆ శ్రీరాముడికే ఎరుక.అన్ని కస్టాలు అనుభవించి ఏదో ఒక స్తాయికి వచ్హము అనుకున్న తరువాత మీ లాంటి వాళ్ళ చేతిలో నా నా మాటలు పడుతున్నాము.మేము తిండి లేక పోయిన ఎన్ని కస్టాలు అయినా పడతాము సారూ.సాటి భారతీయుడి చేత హీనంగా చూడ పడటము అంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.ఒక్క సారి మా ప్లేసులో మీరు ఉండి ఊహించుకోండి.జై శ్రీరాం.

    రిప్లయితొలగించండి
  27. మీరు గమనించారో లేదో ఎక వచన ప్రయోగం మొదలు పెట్టింది మీరే. అసలికి మిమ్మల్ని బాధ పెట్టవలసిన అవసరం నాకు లేదు. మీకు నిజంగా దేవుని మీద అంత ప్రేమే ఉంటె, నేనే మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంతకు మించి బ్లాగులో నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. సెలవా మరి.

    రిప్లయితొలగించండి
  28. దళితులది ఆత్మ గౌరవ పోరాటము సారూ.మేము ఎవ్వరిది ఉచితముగా కావాలని అనుకోము.ఎవరో కొంత మంది చెప్పినట్లు మాది అసలు తీవ్రవాదమే కాదు. ఏనాడయిన దళిత తీవ్ర వాడ సంస్థను చూపించార?
    ఒక్క పేరు ఉదాహరంచండి సాలు.ముస్లిము,హిందూ తీవ్రవాద సంస్థలు ఎన్ని లేవు.మాకు జరిగిన అన్యాయము తో పోల్చుకుంటే మిగతా వాళ్లకి జరిగింది ఎంత?
    మమ్మల్ని చుండూరులో,కారముచేడులో,నీరుకొండలో నరికి పోగులుపెట్టారు,కాల్వల్ల్లో తొక్కి పెట్టారు.ఎంత మంది దళిత స్త్రీల మాన ప్రాణాలు లెక్క లేకుండా,పొలము గట్లపై,తెలంగాణా గడిల్లో ఎగిరిపోయినవో తెలుసా సారూ.
    మా స్త్రీల సరీరములకి,మా పురుషుల తలకి కరెన్సీ కట్టలతో విలువ కట్టారు. అంతెందుకు ఈ 'రక్త చరిత్ర' అనే బ్లాగులో మమ్మల్ని నరకడము గురించి ఆ బ్లాగు వోనరు గొప్పగా రాస్తే ఖండించిన ఒక్క హృదయము ఉన్నదా?అతను అల చెప్పడము తప్పు అనే విషయము కూడా తెలియదు.అలా పెరిగింది మన సమాజము.పూరిపాక అనే బ్లాగు పెట్టి కత్తి మహేశు కుమారు అనే వ్యక్తి ని ఎంతగా ఎగతాళి చేసిందో మీకు తెలియదా? ఆ వ్యక్తి కాలిఫోర్నియా 'సొగసరి' అనే విషయము మాకు తెలియదా?
    భారతీయులు నా సహోదరులు అని పూర్తి గా నమ్మినప్పుడు ఇలా మనకు వర్గాలు,కులాలు ఎందుకు సారూ.నేను మరంచినే లోపులో కులాలు లేని నా మాత్రు భ్హోమి భారత దేశములో కన్ను ముయ్యాలని కోరుకుంటున్నాను.జై శ్రీరాం.

    రిప్లయితొలగించండి
  29. ఇంత మంది ఇన్ని మాటలు అంటున్న దళిత జాతి మిమ్మల్ని ఒక్కమాట అయిన పల్లెత్తి అన్నదా? విదేశీ ప్రయాణాలు,కార్పోరేట్ లంచులు,అమెరికన్ అక్సెంటు లు,ప్రాశ్చాత్య సంగీతము,గ్రీను కార్డు,అమెరికను సిటిజానుషిపు అన్ని మీరే ఉంచుకోండి సారూ.
    మాకు ఇవేమీ అక్కరలేదు. మీరు మాకు ఏమి ఉచితంగా కూడా ఇవ్వనక్కరలేదు.మాకు కావాల్సింది అల్లా మేము కూడా భారతీయ 'మనుషులమే' అనబడే ఒక భావన.మేము పుట్టుకతోనే నిమ్న జాతి వాళ్ళు,దేవుడు బిడ్డలు అనే పుల్ల విరుపు మాటలు కాదు.మేము దస్యులము.నిజమయిన భారతీయులము.ఈ మాట చెప్తున్నప్పుడు నా గుండె నాలుగు అంగుళాలు పెరిగింది.మా మట్టిలోనే పుట్టాము.మా మట్టిలోనే పోతాము.గ్రామ దేవతలని అయిన పూజించుకొని బతికేస్తాము.జై శ్రీరాం.

    రిప్లయితొలగించండి
  30. మమ్మల్ని చుండూరులో,కారముచేడులో,నీరుకొండలో నరికి పోగులుపెట్టారు,కాల్వల్ల్లో తొక్కి పెట్టారు
    ____________________________________________________________

    దానికి సమాధానం ఆర్యులు దాస్యులు అంటూ అబధ్ధాలు చెప్పడమా?


    పూరిపాక అనే బ్లాగు పెట్టి కత్తి మహేశు కుమారు అనే వ్యక్తి ని ఎంతగా ఎగతాళి చేసిందో మీకు తెలియదా?
    ________________________________________________________________

    అబ్బా ఛా! ఆ వ్యక్తి వ్రాసిన విషపు వ్రాతలు మీకు కనిపించవు కదూ!



    మాకు కావాల్సింది అల్లా మేము కూడా భారతీయ 'మనుషులమే' అనబడే ఒక భావన.మేము పుట్టుకతోనే నిమ్న జాతి వాళ్ళు,దేవుడు బిడ్డలు అనే పుల్ల విరుపు మాటలు కాదు
    __________________________________________________________

    ఈ బ్లాగులో మాటిమాటికీ మేం దళితులము, నిమ్నులము అనుకోవడమెందుకు మరి? దళిఉలు దసారా పండగ అంటూ మొదలుపెట్టింది మీరే!

    ఈ బ్లాగుల్లో దళిత, బ్రాహమణుల గోల ముందుగా చేసింది మీ కత్తే.

    If you respect the others, the others will reciprocate and if you dont, the others can flip you too!


    అంతెందుకు ఈ 'రక్త చరిత్ర' అనే బ్లాగులో మమ్మల్ని నరకడము గురించి ఆ బ్లాగు వోనరు గొప్పగా రాస్తే ఖండించిన ఒక్క హృదయము ఉన్నదా
    ________________________________________________

    అయిలయ్య పుస్తకాన్ని మీరెంతమంది ఖండించారేమిటి? ఇంకా ఆ బ్లాగుని మలికతో సహా సంకలినులన్నీ తొలగించాయి. ఆ బ్లాగు యజమానికి కూడా మెయిళ్ళు పంపడం జరిగింది. అయిలయ్య విషయంలో మీరేంచేశారు మరి?


    భారతీయులు నా సహోదరులు అని పూర్తి గా నమ్మినప్పుడు ఇలా మనకు వర్గాలు,కులాలు ఎందుకు సారూ.
    ________________________________________________

    అదే నేనూ అడుగుతున్నా. కులాలను తిట్టుకోకుండా బ్లాగులు వ్రాయలేరా? ఒక చేస్తే సంసారం, మరొకరు చేస్తే వ్యభిచారం - అంతేనా?


    _________________________

    Unable to login, hence posting as anon

    Malakpet Rowdy

    రిప్లయితొలగించండి
  31. ఇంత మంది ఇన్ని మాటలు అంటున్న దళిత జాతి మిమ్మల్ని ఒక్కమాట అయిన పల్లెత్తి అన్నదా?
    _________________________________________________

    If you have had access to your Katti's old posts and coments, you will have the answers.

    రిప్లయితొలగించండి
  32. //దానికి సమాధానం ఆర్యులు దాస్యులు అంటూ అబధ్ధాలు చెప్పడమా?//

    నేను ఎక్కడ చెప్పేను పేద్ద సారూ? దస్యులము అనగా దళితులము సారూ.ఆ సందర్భము లో చెప్పను సారూ.నాకు ఈ రొమిల్ల తాపారు,ఆర్యన్ ఇన్వసిఒన్ తియరీ ల గురించి తెలవదు సారూ. మీలాంటి మేథావులు ఎప్పుడన్నా చెపితే నిజమే కాబోలు అనుకొనే వాళ్ళమే పేద్ద సారూ.

    //అబ్బా ఛా! ఆ వ్యక్తి వ్రాసిన విషపు వ్రాతలు మీకు కనిపించవు కదూ//
    అతను చెప్పిన దానికి మీకు ఎమన్నా అభ్యంతరము ఉంటె ప్రజాస్వామ్య బద్దంగా వాదించా వచ్చు కదా పేద్ద సారూ.గొడ్డు మాంసము తినే వాడు,అమ్బెడ్కరును అని ఒక వర్గాన్ని ఎగతాళి ఎందుకు?

    //ఈ బ్లాగుల్లో దళిత, బ్రాహమణుల గోల ముందుగా చేసింది మీ కత్తే.//

    అతను బ్రామ్మనిజాని వ్యతిరేకించాడు. వ్యక్తులని వ్యతిరేకించలేదు. మీరు ఎమన్నా బ్రహ్మనిజానికి టోకున రిప్రజంటువా? అసలు బ్రామ్మడు అంటే ఎవరు?పుట్టుకతోనే బ్రామ్మడు కాదు అని ధర్మ రాజు చెప్పాడు కదా?
    బ్రహ్మ ధర్మాలు పాటించే ప్రతివారు బ్రామ్మలె. మీకు ఎందుకు అంతగా పుట్టుకతోనే బ్రామ్మనున్డ్ని,మేము ఒక వర్గము అని విర్రవీగుతున్నారు? ఖాళి గిన్నెలు పేద్ద శబ్దములు చేయును.

    //అయిలయ్య పుస్తకాన్ని మీరెంతమంది ఖండించారేమిటి//

    కంచే అయిలయ్య బ్రామ్మనిజాని వ్యతిరేకించాడు.మీకు అసలు అర్ధము కాదు అనుకుంటా?

    //అదే నేనూ అడుగుతున్నా. కులాలను తిట్టుకోకుండా బ్లాగులు వ్రాయలేరా? ఒక చేస్తే సంసారం, మరొకరు చేస్తే వ్యభిచారం - అంతేనా?//

    నేను ఎక్కడ తిట్టాను పేద్ద సారూ.మమ్మల్ని తిట్టొద్దు మొర్రో అంటున్న?

    //ఇంత మంది ఇన్ని మాటలు అంటున్న దళిత జాతి మిమ్మల్ని ఒక్కమాట అయిన పల్లెత్తి అన్నదా//

    పేద్ద సారూ.మీ బుర్ర అంత కత్తి చుట్టే తిరుగుతుంది అనుకుంటా?మీ జీవితమూ అంత అతనే ఆక్రమించాడు. నేను అన్నది సాధారణ కాన్తెక్స్తూ లో.
    మీరు ఏదన్న మంచి మానసిక వైద్యుడ్ని సంప్రదించడము అవసరము.

    రిప్లయితొలగించండి
  33. last sentence in my last reply is for following pedda saaru's words.

    //If you have had access to your Katti's old posts and coments, you will have the answers//

    రిప్లయితొలగించండి
  34. ఈ రొమిల్ల తాపారు,ఆర్యన్ ఇన్వసిఒన్ తియరీ ల గురించి తెలవదు సారూ
    ______________________________________________

    ఆహా! మరి తెలియనప్పుడు తెలియనట్టుండాలిగానీ, ఆర్యులు బయట నుండొచ్చారు, దసరాని బహిష్కరించాలి అన్న పోస్టులెందుకు సారూ? తమ మేధావితనాన్ని బయటపెట్టుకోడానికి కాకపోతే?




    అతను బ్రామ్మనిజాని వ్యతిరేకించాడు. వ్యక్తులని వ్యతిరేకించలేదు. మీరు ఎమన్నా బ్రహ్మనిజానికి టోకున రిప్రజంటువా?
    ___________________________________________________

    అలగే తమరేమన్నా దళితులకి టొకు రెప్రెసెంటేటివులా సారూ?

    సమాధానం వచ్చేసరికి ఎకవచనంలోకి దిగినట్టున్నారుగా? మీరు మిగతావాళ్లకి మర్యాలు నేర్పేది :))




    అతను చెప్పిన దానికి మీకు ఎమన్నా అభ్యంతరము ఉంటె ప్రజాస్వామ్య బద్దంగా వాదించా వచ్చు
    ______________________________________________

    మీబోటి తనబోటి మేధావులు రాశెది ప్రజాస్వామ్యబధ్ధమయితే నేను రాసేది కూడ అంతేగా :))


    నేను ఎక్కడ తిట్టాను పేద్ద సారూ.మమ్మల్ని తిట్టొద్దు మొర్రో అంటున్న?
    _____________________________________________

    నాటకాలెందుకు సారూ, మీ పోస్టు చేస్తే అర్ధంకాదా


    పేద్ద సారూ.మీ బుర్ర అంత కత్తి చుట్టే తిరుగుతుంది అనుకుంటా?మీ జీవితమూ అంత అతనే ఆక్రమించాడు. నేను అన్నది సాధారణ కాన్తెక్స్తూ లో.
    మీరు ఏదన్న మంచి మానసిక వైద్యుడ్ని సంప్రదించడము అవసరము.
    ______________________________________________

    నాకెంత మోకాట్లో ఉన్నా, మీరే కాంటెక్స్టులో అన్నారో అర్ధంచేసుకోలేని వాడీని కాదు లేంది.

    మీరడిగిన ప్రశ్నకి ఈ బ్లాగులోనే సమాధానం ఇచ్చాను. దానికి తిరుగు సమాధానం లేక పాప మానసిక వద్యిడూ అంటూ టాపిక్ ని దారి మళ్ళిస్తున్నట్టున్నారే :))

    రిప్లయితొలగించండి
  35. దస్యులము అనగా దళితులము సారూ
    ________________________

    దస్యులంటే దళితులని ఎవరన్నారో కాస్త వివరిస్తారా సారూ?

    రిప్లయితొలగించండి
  36. //ఆహా! మరి తెలియనప్పుడు తెలియనట్టుండాలిగానీ, ఆర్యులు బయట నుండొచ్చారు, దసరాని బహిష్కరించాలి అన్న పోస్టులెందుకు సారూ? తమ మేధావితనాన్ని బయటపెట్టుకోడానికి కాకపోతే?//
    ఎమన్నా అంటే ఈ వడ్రంగి పిట్ట్ట గారితో వాదించుకోండి. నేను చెప్పిన వాటికి ఎవరితోనో ముడి పెట్టి మాట్లాడతారు ఏమిటి పేద్ద సారూ.

    //అలగే తమరేమన్నా దళితులకి టొకు రెప్రెసెంటేటివులా సారూ?//
    నేను కాదు.

    //మీబోటి తనబోటి మేధావులు రాశెది ప్రజాస్వామ్యబధ్ధమయితే నేను రాసేది కూడ అంతేగా :)) //
    అంటే పూరిపాక రాసేది మీరేనా? మీకు అంత సీను లేదులే.ఆ వ్యక్తికి అతి త్వరలో తెల్ల చొక్కా,సత్తు గిన్నె రుచి చూడబోతున్నాడు. తొందరపడకే సుందరవదనా.

    //నాటకాలెందుకు సారూ, మీ పోస్టు చేస్తే అర్ధంకాదా//
    నాకు ఓపిక నశిస్తుంది పేద్ద సారూ.నాకు అసలు ఈ జన్మకి బ్లాగే లేదు. మరొక్కసారి అబాండము వేస్తె పెంట రాసిన చెప్పుదెబ్బలు మొదట మీకే.

    //మీరడిగిన ప్రశ్నకి ఈ బ్లాగులోనే సమాధానం ఇచ్చాను. దానికి తిరుగు సమాధానం లేక పాప మానసిక వద్యిడూ అంటూ టాపిక్ ని దారి మళ్ళిస్తున్నట్టున్నారే //
    మీరు ఒక్క సారి మీ సమాధానాలు చూసుకోండి.ఎన్ని సార్లు కత్తి పేరు రాసారో తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  37. //దస్యులంటే దళితులని ఎవరన్నారో కాస్త వివరిస్తారా సారూ//

    నేనే

    రిప్లయితొలగించండి
  38. అంటే పూరిపాక రాసేది మీరేనా?
    ___________________

    నాంత అవసరం లేదు. ఏమన్నా నా పేరుతోనే అనే ధైర్యం ఉంది.

    ఆ వ్యక్తికి అతి త్వరలో తెల్ల చొక్కా,సత్తు గిన్నె రుచి చూడబోతున్నాడు
    __________________________________________

    ఇలాంటి బెదిరింపులకేం గానీ, మీ పని మీరు చేస్కోండి

    నాకు ఓపిక నశిస్తుంది పేద్ద సారూ.నాకు అసలు ఈ జన్మకి బ్లాగే లేదు. మరొక్కసారి అబాండము వేస్తె పెంట రాసిన చెప్పుదెబ్బలు మొదట మీకే
    ____________________________________________

    అబ్బో, కానివ్వండి అదీ చూద్దాం. బుఱ్ఱలో లాజిక్ నిజాయితీ లేకపోతే ఇంకేంచేస్తారు లెండి అవతల వాళ్ళ మీద రాళ్ళు చెప్పులు విసిరి పారిపోవడం తప్పా. నేణు కూడ సిధ్ధమే దానికి.


    మీరు ఒక్క సారి మీ సమాధానాలు చూసుకోండి.ఎన్ని సార్లు కత్తి పేరు రాసారో తెలుస్తుంది.
    ______________________________________________

    పూరిపాక కత్తి పేర్లు మధ్యలోకి లాగింది తమరే :))

    రిప్లయితొలగించండి
  39. నేనే
    _____________

    అబ్బో, అంటే మీనోటికొచ్చిన డెఫినిషన్లు మీరిచ్చేసుకుని మిగతావళ్లని అనెయ్యచ్చన్నమాట. :))

    రిప్లయితొలగించండి
  40. //అబ్బో, అంటే మీనోటికొచ్చిన డెఫినిషన్లు మీరిచ్చేసుకుని మిగతావళ్లని అనెయ్యచ్చన్నమాట. :)) //

    :) :) :)

    రిప్లయితొలగించండి
  41. పాపం కత్తి పేరుని మధ్యలోకి లాగి సానుభూతి కార్డు వాడదాం అనుకున్నారు - కత్తి కక్కే విషం మీదకి టాపిక్ వేళ్ళేసరికి కాంటెక్స్టు మార్చేశారు అంతేనా?

    రిప్లయితొలగించండి
  42. //పాపం కత్తి పేరుని మధ్యలోకి లాగి సానుభూతి కార్డు వాడదాం అనుకున్నారు - కత్తి కక్కే విషం మీదకి టాపిక్ వేళ్ళేసరికి కాంటెక్స్టు మార్చేశారు అంతేనా?//


    పాపం కత్తి పేరుని మధ్యలోకి లాగి సానుభూతి కార్డు వాడదాం అనుకున్నారు -
    XOR
    కత్తి కక్కే విషం మీదకి టాపిక్ వేళ్ళేసరికి కాంటెక్స్టు మార్చేశారు అంతేనా

    పై రెండు సేన్టేన్సులు ఎక్సుక్లుసివు ఆరు అనుకుంటా .
    అవి Logical AND కి సరిపోవు సారూ.కొంచెము సేన్టేన్సును చక్కగా అన్న రాయండి.

    రిప్లయితొలగించండి
  43. లాజిక్ అంటే AND ,XOR మాత్రమే కాదు సారూ. డిజిటల్ లాజిక్ కీ మామూలు లాజిక్ కీ చాలా తేడ ఉంది.

    పైగా నేను అక్కడ పెట్టింది "-" గుర్తు. అది AND కి సంబంధించింది కాదు మీ లాజిక్ ప్రకారమయినా :))

    రిప్లయితొలగించండి
  44. mmmmmmmm... AND కి 'Logical AND' కి తేడా ఉంది సారూ. మీరు discrete mathematics మరోసారి తిరగేయ్యల్సిన అవసరము ఉంది.
    మామూలు సందర్భములోనే ఆ రెండు సేన్తెన్సులకి తేడా ఉంది సారూ. నేను డాషు పట్టించుకోలేదు.

    రిప్లయితొలగించండి
  45. లాజిక్ అనేది థియరీ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సారూ, డిస్క్రీట్ మేథ్ కాదు. నేను మాట్లాడింది మీరు రాసిన ఏండ్ గురించి. మీరు మళ్ళి నర్సరీకి వెళ్ళాలేమో చూసుకోండీ :))

    రిప్లయితొలగించండి
  46. మామూలు సందర్భములోనే ఆ రెండు సేన్తెన్సులకి తేడా ఉంది సారూ. నేను డాషు పట్టించుకోలేదు.
    _________________________________________________

    నేనంటోందీ అదే, నేనక్కడ ఏండ్ పేట్టలేదని.

    మొదటి దాని ప్రకారం పాపం కత్తినడ్డం పెట్టుకుని సింపథీ కి ట్రై చేశారు.

    రెండో దాని ప్రకారం ఆ కత్తి వల్లే మీ వాదన కి రెడ్ సిగ్నల్ కనిపించడంతో టాపిక్ మార్చారు.

    రిప్లయితొలగించండి
  47. //లాజిక్ అనేది థియరీ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సారూ//
    బహు కొత్త్తగా ఉన్నది.ఆలోచించాలి
    //డిస్క్రీట్ మేథ్ కాదు//

    మా అగ్రకుల ప్రొఫెసర్ నాకు ఇలా చెప్పాదేమిటి చెప్మా. ఇది అభిజాత్యము కావచ్చు.లేక ఈ నిమ్న జాతి వానికి సరిగ్గా చెప్పకూడదు అనుకున్నడేమో? ఏదన్న సెక్షను లో కేసు వెయ్య వచ్చా?

    //నేను మాట్లాడింది మీరు రాసిన ఏండ్ గురించి. మీరు మళ్ళి నర్సరీకి వెళ్ళాలేమో //

    ఎక్కడ సారూ అది. నాకు తెలియని నా AND

    రిప్లయితొలగించండి
  48. తెలుగు వాక్యాల్లోకి డిజిటల్ లాజిక్నీ, చుండూరు సంఘటనలోకి ఆర్య-ద్రవిడ సిధ్ధాంతాన్నీ లాగితే ఇలాగే ఉంటుంది :))

    రిప్లయితొలగించండి
  49. మా అగ్రకుల ప్రొఫెసర్ నాకు ఇలా చెప్పాదేమిటి చెప్మా. ఇది అభిజాత్యము కావచ్చు.లేక ఈ నిమ్న జాతి వానికి సరిగ్గా చెప్పకూడదు అనుకున్నడేమో? ఏదన్న సెక్షను లో కేసు వెయ్య వచ్చా?
    _______________________________________________

    :)) అసలు రంగు చూపించుకున్నారుగా :))

    రిప్లయితొలగించండి
  50. వేసెయ్యండి కేసు - నిమ్నజాతుల వారికి తప్పుడు బోధనలు చేసే ప్రొఫెసర్ అని. మీదేం పోయింది, అలవాటేగా :))

    రిప్లయితొలగించండి
  51. నిజమే సారూ పాశము అన్నములో(దేముడు బువ్వ లో) పేద్ద ముక్కలు (గొడ్డు మాంసము) నంజుకున్నట్లుంది.నాకు ఇష్టమయిన కాంబినేషను.

    రిప్లయితొలగించండి
  52. నిజమే సారూ పాశము అన్నములో(దేముడు బువ్వ లో) పేద్ద ముక్కలు (గొడ్డు మాంసము) నంజుకున్నట్లుంది.నాకు ఇష్టమయిన కాంబినేషను.
    _____________________________________________

    ????????????? మార్తాండం టైపు వాదన మొదలయ్యిందేంటి?

    రిప్లయితొలగించండి
  53. // :)) అసలు రంగు చూపించుకున్నారుగా :)) //
    నా రంగు నలుపు.I am proud of it.మీరు వేరే దాని గురించి చెపితే,మాకు అన్ని కళలు ఉంటె మా బతుకులు ఇలా ఎందుకు ఏడుస్తాయి సారూ.

    రిప్లయితొలగించండి
  54. Are you the same guy who has been arguing with me for the past one hour or so? Scratch .. Scratch

    రిప్లయితొలగించండి
  55. LOLZ I now realize I got pulled into an unnecessary discussion :))

    రిప్లయితొలగించండి
  56. //వేసెయ్యండి కేసు - నిమ్నజాతుల వారికి తప్పుడు బోధనలు చేసే ప్రొఫెసర్ అని. మీదేం పోయింది, అలవాటేగా :)) //

    మేము అలా కేసులు వెయ్యడము మొదలుపెడితే ఎన్ని ఉంటాయో తెలుసా?
    ఆ పర బ్రహ్మ(త్రిమూర్తులలో ప్రధముడు) గారి కాలములో ఒక యుగముకి సరి సామానమయిన మానవ కాల విఘడియల సంఖ్యలో అన్ని కేసులు వేసి ఉండవచ్చు.అన్ని సార్లు మేము అవమానాలు పడ్డాము సారూ.
    P .S మీ లాంటి బ్రహ్మ ఘ్నాలులకి బ్రహ్మకి కాలము,మానవ మాత్రుల కాలములకి అనులోమానుపాత సంభందము తెలిసే ఉండవచ్చు.

    రిప్లయితొలగించండి
  57. Newayz gotta go now .. twas a good ( now turned funny) discussion. Ciao!

    రిప్లయితొలగించండి
  58. yeah,am the same guy.
    me too.got to go now.ttu later.

    రిప్లయితొలగించండి
  59. మేము అలా కేసులు వెయ్యడము మొదలుపెడితే ఎన్ని ఉంటాయో తెలుసా?
    ________________________________________________

    ఏదీ నెగ్గలేరని తెలుసు కాబట్టీ. అన్ని కులాలవళ్ళూ కలిసున్న ఒక తరగతిలో ప్రొఫెసర్ తప్పు చెప్తే, కేవలం దళితులకి మాత్రమే తప్పు వినిపిస్తుంది అని వేసే కేసు జనాలకి నవ్వు తెప్పిస్తుంది.

    రిప్లయితొలగించండి
  60. అజ్నాత గారు మీ కామెంట్లద్వారా మీ అభిజాత్యాన్ని, అహంకారాన్ని, మీ కులపొగరుని చూపించుకుంటున్నారు.మీరిప్పుడు క్రిస్టియన్ దేశాలలొకిపోయి వాళ్ళకి ఊడిగం చేసి సంపాదించిన సొమ్ముతో ఎంజాయ్ చేయడంలేదా? మరి వాళ్ళ పంచలో బతుకుతూ, వాళ్ళ మోచేతినీళ్ళు తాకుతూ గొప్ప దేశభక్తులుగా, హిందూధర్మ ప్రచారకులుగా ఫోజులు కొట్టడమెందుకు. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టికోసం బతుకుతున్న దళిత జనంపై ఆక్రోశమెందుకు.. మీ మీ కామెంట్ల ద్వారా మీ కులాధిపత్యాన్ని చూపడంలేదా? మీకు ప్రశ్నిస్తే కోపాలా? మీరెన్నన్నా అణగిమణగి వుండాలా? మీ కాళ్ళ కింద చెప్పులా పడి వుంటే మీరు పొందే పైశాచిక ఆనందం కొన్ని యుగాలుగా చూసే ఈ చిన్న ప్రశ్న వేస్తేనే భరించలేకపోతున్నారే. ఈ బ్లాగులోకంలో ఎంతమంది దళితులు రాస్తున్నారు? ఎంతమంది వారికి మద్ధతుగా రాస్తున్నారు? ఈ మాత్రం స్పేస్ కూడా మిగలనివ్వరాదన్న మీ కుళ్ళు, మెజారిటీ పొగరును చూపెడుతున్నారు.. కానివ్వండి..

    ఏనాటికైనా ఈ దేశం మెజారిటీ ప్రజలైన దళిత, గిరిజన, అణగారిన, నిరుపేద, తాడిత పీడిత వర్గానిదే.. మీ అధికారం చాపకింద నీళ్ళువస్తున్నాయన్న భయం, ఇన్నాళ్ళు అనుభవించిన సౌఖ్యాలు పోతాయన్న ఆందోళన మీమీ వ్యాఖ్యలద్వారా బయటపడుతోంది.. మా ఆత్మగౌరవపోరాటం కొనసాగుతూనే వుంటుంది..మీమీ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి మీరు చెయ్యెత్తి విదిలించే ఎంగిలిమెతుకులకోసం ఎగబడేవాళ్ళు లేరు.

    ఎవరో కొద్దిమంది మీలో తప్పపుట్టిన మేధావులు మాపట్ల చూపిన కరుణను కూడా సొమ్ము చేసుకోవాలన్న మీ ఆతృతచూస్తుంటే నవ్వొస్తోంది. మీకున్న శక్తిమేరా ఆ విభీషణులను కాల్చుకు తింటూనే వుంటున్నారు కదా? వాళ్ళను ప్రస్తావించే అర్హత మీకెక్కడిది?

    రిప్లయితొలగించండి
  61. వడ్రంగి పిట్ట గారు,
    బాగా చెప్పారు.ఆ సహాయము చేసాము అని చెప్పుకునే వాళ్ళకి కులము అంట కడుతున్నారు ఇక్కడ ఈ కుల గజ్జి ఎదవలు.
    వరహర రావు గారో,బాల గోపాలు గారో,శ్రీ శ్రీ గారికో మీరు బామ్మలు కాబట్టి మాకు సహాయము చేస్సారానో,లేక వాళ్ళు పుట్టుకతోనే గోప్పవల్లో అని ఎవరన్న చెపితే వాళ్ళని అక్కడ కక్కడ చెప్పు తీసుకొని కొడతారు వాళ్ళు.
    వీళ్ళు గాంధి మాహత్ముడికి కూడా కులాన్ని అంట కడతారు.వాళ్ళు కనీసము (మా ఊహల్లో) కులము అనే భావనని జయించారు.వీల్లకన్నా అగ్ర కుల సూద్రులే నయమేమో. భోతికంగా ఎప్పుడన్నా దాడి చేసినా ఇలా మాటలతో హింసించరు.
    ఛీ ఛీ మాటలతో కుల్ల బోడుస్తుంది ఈ బ్రాహ్మనిజము.

    రిప్లయితొలగించండి
  62. అధికారాన్ని వదులుకోకుండా అలాగె గమ్ము వేసుకుకూచోవాలనే ఉద్దేశమే ఉంటె ఇప్పటికి రాజకీయలలో ఎంతోమంది బ్రాహ్మణ నాయకులు పాత తరం రాజకీయ నాయకుల వారసత్వం పేరు చెప్పుకొని అలాగే కొనసాగుతూ ఉండేవారు. మాలో అధికారం మీద పిచ్చి లేదు, ఏ పని చేసినా, పదవిలో ఉన్నా ఆపదవి ని ఎంత సక్రమం గా నిర్వర్తించాం అనేదాని మీదనే ఫోకస్. అంతే కాని ఇప్పటి నాయకుల లా నా ఇంట్లో వారికి ఒక పది తరాలకు తరగని సంపద రాజకియాలు అడ్డం పెట్టుకొని సంపాదించటం ధ్యేయం కాదు. దేవే గౌడా ముఖ్య మంత్రిగా, ప్రధాని గా ఉన్నది ఎంతకాలం? ఎంత వెనకేసారో ఎమో! అన్ని పదవులు చేపట్టిన అతను ఈ వయసులో కూడా వారు కొడుకును అడ్డంగా పెట్టుకొని ఎన్ని నాటకాలు ఆడుతున్నారో . అదే పి.వి.గారు ఎన్ని రోజులు అధికారం లో ఉన్నా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఎమేరకు తిన్నారో తమరు చెప్పాలి. తమరికి తెలుసోలేదో నువ్వు పైన రాసిన కేసులను వాదించటానికి లాయర్ ఫీజులకోసం డబ్బులు ఇవ్వటానికి ఆయన దగ్గర డబ్బులు లేక బంజారా హిల్స్ లోని ఇల్లు అమ్ముకున్నారు. తమరు నేను పి.వి. మీద రాసినదానికి ఒక్కముక్క బదులు రాయలేదు. దీని అర్థం ఆమాటా ఈ మాటా విని నీ మాటగా బ్లాగు పెట్టుకొని ఇతరులను తిట్టటం తప్ప మీకు గా స్వంత నాలేడ్జ్ లేదు అని తెలుస్తున్నాది.

    రిప్లయితొలగించండి
  63. *మీమీ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి మీరు చెయ్యెత్తి విదిలించే ఎంగిలిమెతుకులకోసం ఎగబడేవాళ్ళు లేరు* ఇ
    లా మీరు మిమ్మల్ని ఎలా అనుకొని తక్కువ చేసుకొంటారు. ఒక కుటుంబం లో నలుగురు అన్నదమ్ములలో ఒకరు కొంచెం తక్కువ స్థాయిలో ఉంటె వారికి మిగతావారందరు కలసి అతని స్థాయిని సహాయం చేసి పెంచాలను కొనే దృష్టితో చూడటం తప్పా! కాని తమ్ముడు అది అర్థం చేసుకోకుండా నువ్వు నా స్థాయిని తక్కువ అంటావా? నువ్వెవరు సహాయం చేయటానికి అని తిట్ల దండకం మొదలు పెడితే ఎమీ చేయగలరో మీరే చెప్పాలి. మీకు కావాలంటె అధికారాన్ని ఎంతుకొని నేత్తిన పెట్ట్టుకోండి. అంతే కాని ఆ అధికారం సంపదించటానికి చరిత్రని ఇష్టం వచ్చినట్లు వక్రీకరించకండి. నేను ఒకటి అంటే మీకు ఇంకొకటి అర్థమౌతున్నాది.

    రిప్లయితొలగించండి

Explore yourself..