24, అక్టోబర్ 2010, ఆదివారం

నాగరికులెవరో???




ఓ నవనాగరిక మానవులారా
నాగరికతకు నడక నేర్పినవి
మా తోలు చెప్పులే..

మీ కాలిలో ముళ్ళు దిగితే
మా గుండెల్లో గునపాలు
దిగినట్లుండేది..

కానీ
మా గుండెలపై
మీ పాదాలను
తొలగించలేకపోతున్నాం...

మరి నాగరికులెవరో
చెప్పగలరా?

7 కామెంట్‌లు:

  1. మీరు ఓ మాదిరి జీవన పరమాణాలతో జీవితాన్ని గడుపుతున్నారు కదా, మీరెవరికైనా అభివృద్ధిలోకి రావడానికి సహాయ పడుతున్నారా?

    రిప్లయితొలగించండి
  2. వడ్రంగి పిట్ట,

    ఇంతకీ మీ కవిత ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కావట్లేదు. కొంచెం వివరించగలరా?

    రిప్లయితొలగించండి
  3. @Weekend Politician: ఇందులో అంత అర్థకాని మర్మమేముంది సార్.. మీ సుఖమయ, భద్రమయ జీవితానికి యుగాలుగా బలైన మా జీవితాల తాత్వికత కాస్తా సరళంగానే చెప్పాకదా సార్..మన్నించండి...

    రిప్లయితొలగించండి
  4. వడ్రంగి పిట్ట,
    >> మీ సుఖమయ, భద్రమయ జీవితానికి యుగాలుగా బలైన మా జీవితాల తాత్వికత కాస్తా సరళంగానే చెప్పాకదా సార్..మన్నించండి...

    తాత్వికత అర్థం చేసుకోవడంలో నేను కొంచెం వీకు లేండి. బలవ్వటాలూ, గుండెల్లో గునపాలు దిగటాలూ లాంటి తాత్విక కవితా ధోరణులు అర్థం చేసుకోవడంలో నేను కొంచెం బలహీనుణ్ణి సార్. మన్నించండి సార్.

    రిప్లయితొలగించండి
  5. ఆడ చేసేది చెప్పులుకుట్టి డప్పులు కొట్టే పని, ఏదో త్యాగం చేసుకున్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటారు. అందరిలో మామూలుగా వుంటే కలిసిపోవచ్చు, కాని మీరెవరో మీరే డప్పుకొట్టుకుని సానుభూతి కోసం చూడక్కరలేదు. మీకున్న ఆటిట్యూడ్ ప్రాబ్లం ఇది.

    రిప్లయితొలగించండి
  6. తెల్ల చొక్కా వేసుకున్న ఆఫీసర్‌కి ఉన్న సామాజిక ఐడెంటిటీ చెప్పులుకుట్టి డప్పుకొట్టుకునేవానికి ఉండదు. ఐడెంటిటీ అనేది తెల్ల చొక్కావాళ్ళకి మాత్రమే అవసరమా? దళితులకి అవసరం లేదా?

    రిప్లయితొలగించండి

Explore yourself..