16, అక్టోబర్ 2010, శనివారం

ద్రావిడులుగా దసరా దీపావళిని గురించి ఆలోచించండి..





ద్రావిడులపై ఆధిపత్యం సంపాదించే క్రమంలో నాటి ఆర్యులు ద్రవిడులను, రాక్షసులుగా చిత్రీకరించి వారిపై విజయం సాధించడానికి అనేక మోసపూరిత కుట్రలు సాగించి, తమ ఆడవాళ్ళను ప్రయోగించి విజయాలు సాధించి పండుగలు చేసుకున్నారు. ఆ పండుగలను మనపై రుద్ది వాటిని మన సంస్కృతిలో భాగంగా కల్పించి బలవంతంగా మనపై ప్రయోగించారు. ఆర్యులు తమ దేశదిమ్మరితనంతో భారత ఉపఖండంలో ప్రవేశించి తమకున్న అశ్వసంపదను, విల్లంబుల బలంతో ఇక్కడి స్థానిక రాజ్యాలపై దాడులు చేస్తూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటు ఇక్కడి వారిని రాక్షసులుగా చిత్రీకరించి తమకు తాము దేవతలుగా ఊహించుకొని పురాణాలు సృష్టించుకున్నారు. వాళ్ళు ఈ భూభాగంపై ప్రవేశించే నాటికి ఇక్కడ నగరాలు నిర్మించబడి, నాగరికతతో, శతృ దుర్బేద్యంగా వున్న రాజ్యాలు విలసిల్లాయనడానికి పురాణాలలో వర్ణించబడ్డ రావణాసురిడి లంకా పట్టణం, బలిచక్రవర్తి కేరళ రాజ్యం, హిరణ్యాక్షుడి రాజ్యాల వర్ణణలు చూస్తే అర్థమవుతుంది. తమకు లేని ఈ నాగరికత, సంపదలను హరించి ఇక్కడి మట్టిమనుషులను అసురులుగాను, తమను సురులుగా మార్చుకున్నారు. మనపై విజయాలను సాధించడానికి ఎన్ని కుయుక్తులు పన్నారో, కుట్రలు చేసి గెలిచారో వారి గాధలలోనే తెలుస్తోంది. కావున ద్రావిడ చక్రవర్తులైన రావణబ్రహ్మ, మహిషులపై వారి మోసపూరిత విజయాలకు చిహ్నంగా నిలిచిన ఈ దసరాను, నరకచక్రవర్తిపై తమ భార్యను ప్రయోగించి గెలిచినందుకు చేసుకుంటున్న దీపావళిల పట్ల ద్రావిడులుగా, దళితులుగా ఈ నేల మట్టిమనుషులుగా ఆలోచించాల్సిన అవసరముంది. మనవి కాని పండగలను మనం బహిష్కరిద్దాం. బతుకమ్మలను, పైడితల్లమ్మలను కొలుద్దాం..

21 కామెంట్‌లు:

  1. బతుకమ్మ అంటే దుర్గాదేవి అని అర్థం. జీవం పోసే మాతని తెలంగాణా బాషలో బతుకమ్మ అని అంటారు.

    రిప్లయితొలగించండి
  2. Have u lost ur mind?

    There is no such thing as Aryan Invasion. It's all a British Conspiracy. If Aryans are really true, why would they say that Ravan was a brahmin in the first place?

    Stop writing these stupid posts.

    రిప్లయితొలగించండి
  3. Vadrangi is not alone. There was a celebration for Mahishasura at OU campus y'day.

    For the uninitiated:

    http://www.deccanchronicle.com/mahishasura-was-king-not-demon-dalits-304

    http://www.deccanchronicle.com/hyderabad/dasara-has-pro-aryan-bias-scholars-251

    రిప్లయితొలగించండి
  4. అజ్నాత రావణుడు బ్రాహ్మణుడైతే అసురుడెట్లాయెనయ్యా? ఆర్యులు ఇక్కడి మట్టిదేవతలను కలుపుకొనడంలో భాగంగా వారికి బ్రాహ్మణత్వాన్ని ఆపాదించారు. ఇక్కడి ప్రజలు కొలుస్తున్న పక్షులు, పాములు, జంతువుల రూపాలను తమ పాండిత్యంతో వారి దేవతలకు వాహనాలుగా, ఆయుధాలుగా మలుచుకొని వారికి పూజార్హత కల్పించడంద్వారా స్థానికుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నంగా చరిత్రకారులు అనేక ఋజువులు చూపారు. తమ రాతలను కట్టిపెట్టండిక.. నువ్వెవరివి నాకు రాయొద్దని చెప్పడానికి.

    రిప్లయితొలగించండి
  5. ప్రవీణ్ సారూ బతుకమ్మలు, మైసమ్మలు, సమ్మక్కలు, సారమ్మలు, ఎఱకంచమ్మలు, పైడితల్లులు, మారెమ్మలు వీళ్ళంతా మన కొలువులు. వీళ్ళకి వాళ్ళ దైవత్వాన్ని ఆపాదించి మరల చేస్తున్న కుట్రలే యివి. అప్పటి ఆచారాలు, పురుషాధిపత్యాన్ని ఎదిరించి నిలిచిన వాళ్ళు.

    రిప్లయితొలగించండి
  6. >> బతుకమ్మలు, మైసమ్మలు, సమ్మక్కలు, సారమ్మలు,
    >> వీళ్ళంతా మన కొలువులు.

    ఇదేదో బాగుందే.

    ఒకే దెబ్బ కి రెండు (ఆహా! చాలా) పిట్టలు. ఒకేసారి ఆర్యులని, బ్రామ్మలనీ, ఆంధ్రోల్లనీ అందరినీ కలిపి కొట్టేరు!


    ఇంతకీ మన బతుకమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ వీల్లందరూ ఎవరైనా మహిష/నరక/xyz రాచ్చచులని సంపేరా?

    సంపితే ఆ రాచ్చచులు దలితులా లేక బ్రామ్మాలా?

    కొంచెం వివరం ఇంకా తేలినట్టు లేదు.

    రిప్లయితొలగించండి
  7. వడ్రంగి పిట్ట గారు. రాముడు పుక్కిట పురాణమైతే గ్రామ దేవతల కథలు కూడా పుక్కిట పురాణాలే. దేవుడు, మతంతో సంబంధం లేకుండా సెక్యులర్ గా బతకలేమా? చదువుకున్నవాడు బాబా లేదా స్వామి కాలు మొక్కడానికి, చదువురానివాడు గ్రామ దేవతకి జంతు బలి ఇవ్వడానికి ఉన్న తేడా ఏమిటో ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  8. 2006 నుంచి నేను దీపావళి జరుపుకోవడం లేదు. ఎలాగైతేనేం, ఒక రకంగా డబ్బుల పొదుపు. వరంగల్ లో ఉన్న రోజుల్లో మూడు వందల రూపాయలకే బోలెడన్ని టపాకాయలు వస్తే పెద్దైన తరువాత ఖర్చు వెయ్యి రూపాయలకి పెరిగింది.

    రిప్లయితొలగించండి
  9. ప్రవీణ్ వెయ్యి రూపాయల టపాసులు వందకే ఇస్తున్నారిప్పుడు. డిస్కౌంటు :)
    కావాలంటే ఫ్రీ గా కూడా :)

    రిప్లయితొలగించండి
  10. చెవుల్లో పువ్వులు పెట్టుకునేది పంతుల్లే కానీ శూద్రులు కాదు కదా. మన మలకన్న అలా అంటున్నాడేమిటి?

    రిప్లయితొలగించండి
  11. well said Praveen.
    వద్రంగిపిట్ట కన్న ఫ్రవీణ్ లక్ష రెట్లు reasonable గా కనిపిస్తున్నాడు నాకు .

    రిప్లయితొలగించండి
  12. అజ్ఞాత gaaru thanks. correctgaa cheppaaru. innaallu mana chevullo puvvulu pedutunnadevaro!!!

    praveen sir pure secularist kadaa.. alane antaru. kaanee janam inka edagaledu kaabatti vaarito kalustu vaarini educate cheyalsina avasaram vundi.

    రిప్లయితొలగించండి
  13. >>kaanee janam inka edagaledu kaabatti vaarito kalustu vaarini educate cheyalsina avasaram vundi

    meeru edigaaraa? Praveen kathalu cadavanDi, complan taaginaTTu edugutaru.

    రిప్లయితొలగించండి
  14. ఆర్యులు, ద్రవిడులు అన్నది వట్టి అబద్ధం. భారతీయులంతా ఒక్కటే. హిందువుల మధ్య ద్వేషం రగల్చడానికి కల్పించిన కల్పిత సిద్ధాంతం ఆర్యులు, ద్రవిడులు అన్నది.

    సరే, మీరు అన్న ప్రకారమే చూద్దాం.

    నాకు తెలిసిన దాని ప్రకారం నరకాసురుడి తండ్రి విష్ణువు. విష్ణువు, భూదేవికి పుట్టినవాడు. పైగా నరకాసురుడిని చంపింది అతని తల్లే. మరి, ఆ లెక్క ప్రకారం అతను ఎవరు? ద్రవిడుడా, ఆర్యుడా, దళితుడా లేక రాక్షసుడా?

    ఇక హిరణ్యకశిపుడు-హిరణ్యాక్ష్యుడు మరియు రావణాసురుడు-కుంభకర్డుడు సోదరులని తెలిసిందే. పురాణాల ప్రకారం వాళ్ళు రాక్షసులు కాదు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నివసించే ధామం వద్ద కాపలాగా ఉండే ద్వార పాలకులు. వాళ్ళ పేర్లు జయుడు, విజయుడు. సనక సనందన మహర్షుల వల్ల శాపానికి గురై రాక్షసులుగా జన్మించారని ఉంది. మరి దీనికేమంటారు?

    నిన్న టీవీలో ఈ కార్యక్రమం చూశాను. ఏదో దళితులకు రాముడు అన్యాయం చేశాడు అని ఏదేదో అన్నారు. మరి, రామాయణం రాసిన వాల్మీకి దళితుడు కాదా? దళితుడు రాశాడని మేమంతా చదవడం మానేస్తున్నామా? అలాగే, రాముడు, సీతా దేవిని అడవికి పంపినపుడు, ఆమె ఆశ్రయం పొందింది వాల్మీకి మహర్షి దగ్గరే కదా. ఆమెకు పుట్టిన పిల్లలు లవుడు, కుశుడు పెరిగింది కూడా వాల్మీకి ఆశ్రమంలోనే కదా. దళితుడింట పెరిగారని ఎవరైనా అంటున్నారా? అందరినీ సమానంగానే కొలుస్తున్నారు కదా.

    ఇంకా ఇదే కాదు భాగవతం రాసిన పోతన కూడా దళితుడే. అయినప్పటికీ, చదవడం మానేస్తున్నారా?

    అసమానతలు ఉండేది మనుషుల్లోనే. దేవుడిలో కాదు. ఆ విషయం తెలుసుకోండి ముందు. నాస్తిక వాదులు అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ల ఏడుపు అంతా హిందూ మతం మీద ద్వేషం వెళ్లగక్కడమే. మన భారతీయ సంస్కృతి నాశనం అయిపోవడమే వాళ్ళకు కావాల్సింది. దాని కోసం వాళ్ళు చరిత్రను ఇష్టమొచ్చినట్టు వక్రీకరిస్తుంటారు.

    రిప్లయితొలగించండి
  15. పోతన నియోగి బ్రాహ్మణుడు కదా ! ఆయన దళితుడెప్పుడయ్యాడు ?

    అయినా ప్రతిదాన్లోను ఈ ఆర్య-ద్రావిడ-దళిత గోలేంటి ? ద్రావిడులూ, దళితులూ వేరువేరు శబ్దాలు. అన్నీ కలిపి కలగాపులగం చేస్తారేంటి ? ఆయా రాక్షసులు దళితులనీ, ద్రావిడులనీ ఏ పురాణంలోను రాసిలేదు. వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఆ పురాణాలు తప్ప వేరే ఆధారం లేదు. అటువంటప్పుడు ఏ ఆధారంతో రాక్షసులు దళితులని చెబుతున్నారు ? ఒకపక్క వాళ్ళున్నారని మీ ఉద్దేశం. ఇంకోపక్క వాళ్ళ గురించి పురాణాలిచ్చిన వివరాలు కల్పితాలని, మీ ఊహే సరైనదనీ అదే నోటితో అంటున్నారు. ముందు మీ అభిప్రాయాల గురించి మీకొక క్లారిటీ ఉంటే ఇతరులకు కూడా చెప్పవచ్చు.

    రిప్లయితొలగించండి
  16. చెవుల్లో పువ్వులు పెట్టుకునేవాళ్లు ఎవరో తెలియని రౌడీ మాటలు విని సుయ్యి అంటే నాదో అట్టు అన్నట్టు ఈ బ్లాగ్ లోకి వచ్చి కామెంటెట్టడం.

    రిప్లయితొలగించండి
  17. మొత్తానికి మీరు తెలిసివ్రాస్తున్నారో ఎవరో ఎక్కించినవి ప్రమాణమనుకుని వ్రాస్తున్నారో గాని కాస్త మీరు స్వంతగా మరలా పరిశీలిమ్చుకోండి. మీ బ్లాగు మీ ఇష్టం . కానీ మనం వేరేవాళ్లచేతిలో కీలుబొమ్మలుగా టేప్ రికార్డర్లుగా మారకూడదని నా అభిప్రాయం

    రిప్లయితొలగించండి
  18. durgeswara గారూ ఎవరో ఎక్కించిన సెలైన్ బాటిల్ ప్రస్తుతం అవసరం లేదండీ, టేప్ రికార్డర్ ను కూడా కాదులెండి. నా ఆలోచనలు పంచుకుందామనే ప్రయత్నాన్ని ఇంతమంది ఇంత బలంగా ముందుకు తీసుకు వెళ్తున్నందుకు ధన్యవాదాలు. ఒకరు ఎక్కించినవే ప్రమాణమనుకొని వాటినే వల్లిస్తున్న మిత్రులకు వర్తిస్తుంది మీ వ్యాఖ్య..

    రిప్లయితొలగించండి
  19. నిజమైన సెలైన్ బాటిల్ అంటే హిందూత్వ పేరుతో సంఘ్ పరివార్‌వాళ్ళు ఎక్కించే విద్వేషం కదా. దళితవాదులది విద్వేషం ఎలా అవుతుంది?

    రిప్లయితొలగించండి
  20. http://www.deccanchronicle.com/mahishasura-was-king-not-demon-dalits-304 please refer to decen chronicle article and i think nobody dallit get good in dussera and deepavali why reason behind it please find the reasons on it .

    రిప్లయితొలగించండి
  21. my name is amarnath http://www.deccanchronicle.com/mahishasura-was-king-not-demon-dalits-304 if there is any meterial or information on the issue please mail to me amarnath1239@yahoo.com

    రిప్లయితొలగించండి

Explore yourself..