బాబా సాహెబ్ అంబేద్కర్ వర్థంతి రోజున ఈ ప్రశ్నను మనం వేసుకోవాల్సిన అవసరముందనిపిస్తోంది. రాజ్యాధికారం కోసం అణగారిన వర్గాలు తమ ప్రయత్నంను ముమ్మరం చేయాల్సింది పోయి దళారీ వలసవాద పాలక వర్గాలకు కొమ్ము కాస్తూ, వారు విసిరేసిన ఎంగిలిమెతుకుల లాంటి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులనుభవించడానికి పాకులాడటం వలన అసలైన రాజ్యాధికారానికి ఆమడ దూరం జరిగి పోతున్నామన్న విషయాన్ని మరిచిపోతున్నాం. ఈ పార్లమెంటరీ రాజకీయ ఊబిలో కూరుకుపోతూ మన ఉనికికే ప్రమాదకరంగా మారుతున్న ప్రపంచీకరణ, సంస్కరణ రూపాల మాయలో కొట్టుకుపోతున్నాం. అధికారమిచ్చే మత్తులో పడి తమ మూలాలను విడిచిపెట్టడం వలన మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. కావున ఈ దినాన్ని మరో మారు బాబా సాహెబ్ ను అధ్యయనం చేయడానికి, తద్వారా మన అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఓ సరికొత్త వెలుగులో పయనిద్దామని ప్రతిన బూనుదాం...
జై భీం..
babasaheb aasayaalanu saadhiddaam...jai bheem
రిప్లయితొలగించండి@gajulaః జైభీం..
రిప్లయితొలగించండితెలకపల్లి రవి అనే ఒక మేతావి గాడిద ఉన్నాడు. అతను ఒక వైపు కుల వ్యవస్థని వ్యతిరేకించిన అంబేద్కర్‌ని పొగుడుతూనే అదే నోటితో కుల వ్యవస్థని నగ్నంగా సమర్థించిన గాంధీని పొగుడుతుంటాడు. అదేమని అడిగితే గాంధీకి వర్గపరమైన పరిమితులు ఉండేవి అని అంటాడు. http://hegelian.mlmedia.net.in/2012/06/cpm_25.html
రిప్లయితొలగించండి