15, డిసెంబర్ 2010, బుధవారం

అంటరానితనం బలిగొన్న ఓ నిండుప్రాణం



హైదరాబాదులోని విల్లా మేరీ కాలేజీలో బండి అనూష అనే ఈ అమ్మాయిని తోటి విద్యార్థినులు తాను దళిత కులానికి చెందినదని తెలిసిన తరువాత ఆమెపట్ల వ్యవహరించిన తీరుతో విసుగుచెంది అనూష ఆత్మహత్య చేసుకుంది. ఇది గత నవంబర్ ఐదో తారీఖున జరిగింది. తాను ఆత్మ హత్య చేసుకోబోతున్నట్లు తన తోటి విద్యార్థినులకు చెప్పినా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదంట. ఆమె తన తండ్రికి చివరి సారిగా బై డాడ్, నేను చనిపోతున్నా అని రాసిపెట్టింది. ఆమె తండ్రి తన కూతురి పట్ల జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆమె కులం తెలిసినప్పటినుంచి వాళ్ళు ఆమెను ఒంటరిగా ప్రత్యేకంగా ఓ బెంచీలో కూచోపెట్టారని చెప్పారు. ఇలా ఓ దళిత విద్యార్థిని జీవితాన్ని బలిగొన్న అంటరానితనమన్న ద్వేషాన్ని, అగ్రకుల దురహంకారాన్ని తిట్టకుండా వుండగలమా? అంతటితో ఈ సమస్య తీరుతుందా? మనిషి ఎక్కడికో ఎదిగిపోతున్నాడన్న అపోహలలో వుంచే మేధావులు మనమెక్కడుండిపోయామో గుర్తెరిగితే చాలు..

అనూషలాంటి మరో విద్యాకుసుమం రాలిపోకుండా కాపాడుకుందాం...

వివరాలకు


13 కామెంట్‌లు:

  1. దళిత నాయకులు ఇటువంటి సంఘటనలను సీరియస్ గా తీసుకొని ఆ అమ్మాయిని ఎడిపిచిన వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అనూషను అవమానించిన వారి పై అట్రాసిటి కేసు పెట్టాలి. విద్యార్థినుల పై పోలిస్ కేసు పెడితే చాలు, శిక్ష కొంచెం ఆలస్యమైనా వారి జీవితం అంతటి తో సమాప్తం. పోలిస్ కేసు ఉన్న ఇటువంటి వారికి ఎవ్వరు ఉద్యోగాలు ఇవ్వరు.

    రిప్లయితొలగించండి
  2. outrageous. shameful.

    we need to think about the following issues very seriously:

    1. How to make the kids of this generation strong enough to face issues(without committing ఆత్మహత్య)?
    2. It is perplexing to see the collage going kids still entetaining such feelings. What are the ways to address this?

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత
    >>దళిత నాయకులు ఇటువంటి సంఘటనలను సీరియస్ గా తీసుకొని ఆ అమ్మాయిని ఎడిపిచిన వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.

    బానేవుంది. కానీ ఇది కేవలం దళిత నాయకులు మాత్రమే పట్టించుకోవాల్సిన సమస్య అనుకుంటే, అది చాలా పొరపాటు. ఇది అందరూ సీరియస్గా తీసుకోవాల్సిన అంశం.

    >>అనూషను అవమానించిన వారి పై అట్రాసిటి కేసు పెట్టాలి. విద్యార్థినుల పై పోలిస్ కేసు పెడితే చాలు, శిక్ష కొంచెం ఆలస్యమైనా వారి జీవితం అంతటి తో సమాప్తం. పోలిస్ కేసు ఉన్న ఇటువంటి వారికి ఎవ్వరు ఉద్యోగాలు ఇవ్వరు.

    వాళ్ళ జీవితాలు సమప్తం అయిపోతే సమస్య తీరిపోదు. ఒక సమాజంగా మనం ఇటువంటి వాటిని అంగీకరిచము అనే సందేశం అన్ని వర్గాలనుండీ గట్టిగా బయటకి రావాలి. In my opinion, if the incident is as it is described here, we are all responsible for such a sorry state of our society.

    రిప్లయితొలగించండి
  4. Weekend Politician: You are right Sir, this is the sin of every citizen in this society. Change the mindset of the new generation from this cruel system of Casteism in India. This will begun from the door step of every one. Don't blame the Dalit leaders in this regard. How they'll defend this. This cruel thing done by the upper caste people. So, first we become humanely by all means..

    రిప్లయితొలగించండి
  5. హైద్రాబాదు నడిబొడ్డులో నాగరిక సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఆశ్చర్యమూ, బాధాకరమూ కూడా!

    సాక్షాత్తూ విల్లా మేరీ కాలేజీలో ఇలాంటి వివక్ష కొనసాగుతుంటే యాజమాన్యం ఏం చేస్తున్నట్లు? అనూష ప్రిన్సిపాల్ కి గానీ యాజమాన్యానికి గానీ ఫిర్యాదు చేసిందా?ఒకవేళ చేసి ఉంటే వాళ్ళు ఏ చర్యా తీసుకోలేదా?

    ఆమె ఆత్మహత్యకు వివక్ష కాకుండా ఇంకేవైనా కారణాలున్నాయేమో ఎవరైనా కనుక్కున్నారా?(అనారోగ్యం, చదువు ఒత్తిడి..)

    కూతురి పట్ల ఇంత వివక్ష పేరు పొందిన కాలేజీలో జరుగుతోందని తెలిసి ఆ తండ్రి ఎందుకు ఫిర్యాదు చేయకుండా ఊరుకున్నారు? చనిపోయాక వివక్షే కారణమని ఆరోపిస్తున్నారెందుకు?

    ఇంకా సమాచారం ఈ టపాలో ఉండి ఉంటే బాగుండేది.

    ఏమైనా, చదువుకుంటున్న అనూష ఇలా ఆత్మహత్య చేసుకోవడం సమంజసం కాదు.

    రిప్లయితొలగించండి
  6. what nonsense??
    shame is an understatement.. i'm lacking words. completely unacceptable..

    రిప్లయితొలగించండి
  7. Super Comedy

    This incident happened year back, more over, its utter nonsense to say A final year Degree Dalit Ragged in a CHRISTIAN MINORITY college.

    ROFLMAO.

    What an Idea Sirji,

    Nice way to attract mass to your pro dalit stance.

    Tomorrow write a post saying DALIT YSR KILLED BY A UPPER CASTE PILOT

    రిప్లయితొలగించండి
  8. Before writing such stories think once, dont write crap like this.

    This happened one year before and not coz of descrimination check this news item in hindu

    http://www.hindu.com/2009/11/06/stories/2009110660840100.htm

    రిప్లయితొలగించండి
  9. ituvanti sangatanalu eppudu jariginaa,evariki jariginaa andaramoo khandinchaalsindhE.ituvantivi malli repeat kaakundaa emi cheyyaalo andaramoo aalochinchaali.sorry anusha...

    రిప్లయితొలగించండి
  10. నా స్నేహితురాలు స్వప్న వైజాగ్ ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో ఆమె స్నేహితురాళ్ళందరూ కమ్మవాళ్ళే. ఆమె కూడా కమ్మ కులానికి చెందిన అమ్మాయి కావడం వల్ల కంచికచర్ల, కారంచేడు ఘటనల గురించి తన స్నేహితురాళ్ళని అడిగింది. విచిత్రమేమిటంటే అగ్రకులానికి చెందిన అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేసిన దళితులని చంపడం తప్పు కాదని ఆమె స్నేహితురాళ్ళందరూ సమాధానం చెప్పడం. తాలిబాన్ తరహా భావజాలాన్ని అమ్మాయిలలోకి కూడా ఇన్‌డాక్ట్రినేట్ చేశారు. ఇలా చేస్తే ఆడదానికి శీలమే ప్రధామనీ, శీలం పోతే ప్రాణం పోయినట్టేననీ అభిప్రాయం కలుగుతుంది. అప్పుడు రేప్ లేదా ఈవ్ టీజింగ్‌కి గురైన స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది.

    రిప్లయితొలగించండి
  11. 2005లోనే నాకు తమిళనాడుకి చెందిన ఒక క్రైస్తవుడు ఆన్‌లైన్‌లో పరిచయమయ్యాడు. పుట్టినది క్రైస్తవ కుటుంబంలోనే కానీ అతను క్రైస్తవ మతాన్ని ఎన్నడూ నమ్మలేదు. అతని అసలు పేరు నాకు తెలియదు. ట్రాట్క్సీ జూనియర్ అనే పేరుతో వ్రాస్తుండేవాడు. అతను ఓసారి ఇలా అన్నాడు "తమిళ నాడులోని క్రైస్తవులలో ఎక్కువ మంది ధనవంతులు. వేలూరు క్రైస్తవ కాలేజ్‌లో నువ్వు మార్క్సిస్ట్‌వని చెప్పుకోకు. చెప్పుకుంటే నిన్ను తన్నితగిలేస్తారు" అని. మన దేశంలోని విద్యాధికులలో ధనవంతులమనే అహంకారం, కులగజ్జి, ఈ రెండూ ఉంటాయి.

    రిప్లయితొలగించండి

Explore yourself..