12, జులై 2012, గురువారం

దైవం-దెయ్యం రెండూ పీక్కు తినేవే..

దైవం వుందంటే దెయ్యమూ వుందనుకోవాలె.. 

హీరో వుంటే విలనున్నట్టు..

కానీ రెండూ మనుషులను పీక్కు తినేవే..

ఒకడు పాపం చేయకూడదంటూనే చేసే వార్ని క్షమించే మూర్ఖుడు.. (ఇక్కడో చిన్న ట్విస్ట్ ఈ పాపాలకు కులాలున్నాయండోయ్..మళ్ళీ వీటిని తప్పించే భూసురులు రెడీగానే వుంటారు మరి..ఎక్కడో నరకముందంట అక్కడ ఏవో శిక్షలు వేస్తారంట..అవి తప్పించే బ్రోకర్లను ఇక్కడ వుంచాడంట..చా..దీనమ్మా బతుకు)

మరొకడు చేసే వాడిని వెన్నంటి చంపే భయంకరుడు..(ఇందులోనూ దూరుతారండోయ్ మన భూకాసురులు.,,వీటిని కూడా పారద్రోలే నెపంతో సొమ్ము చేసుకునే బాబాలు, స్వాములు, మంత్రగాళ్ళ వేషాలతో..చీ సొమ్ము కోసం ఎంతకైనా తెగిస్తారు ఈ ఒల్లొంగని నాయాళ్ళు..)
కానీ ఏమీ చేయకుండా వుండలేని మనిషి ఈ భూమ్మీద వుండగలడా? అదీ ఒక జీవితమేనా??

అందుకే ఈ రెండింటినీ పక్కకు పెట్టి నిర్భయంగా బతికే మనిషి కావాలి...

1, సెప్టెంబర్ 2011, గురువారం

కులం తెలిసాక పెళ్ళి వద్దా??

ఈ రోజు పేపర్లో ఓ వార్త.. ఓ అగ్ర కులస్తుడైన ఉపాధ్యాయుడు షె.కు.నికి చెందిన ఉపాధ్యాయురాలిని ప్రేమించి పెళ్ళి వరకు వచ్చాక మా ఇంట్లో వద్దంటున్నారని తప్పించుకోజూడడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.. ఇది అందరికీ సుపరిచితమైన వార్తలానే వుండొచ్చు. కానీ ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ వాడు అమ్మాయిని ఇలా ప్రేమ పేరుతో వంచించి, మోసం చేయడం దారుణం..

కులపిశాచి లేదు అంతా బస్సులలో రైళ్ళలో కలిసే తిరుగుతున్నాం... హోటళ్ళలో కలిసే తింటున్నాం...వాళ్ళూ ఉద్యోగాలు తేరగా దొబ్బేసి చాలా అభివృద్ధి చెంది వున్నారు అని అక్కసు వెళ్ళగక్కే వాళ్ళు ఈ సమాజంలో నిజంగా కుల పిచ్చి లేదని చెప్పగలరా?? దళిత బహుజనులను చూస్తూ అసూయపడుతూ తిట్టకుండా మాటాడగలరా?? ఇంకా ఎన్ని నిండు ప్రాణాలను హరిస్తారు?? రిజర్వేషన్లలో మీరు విదిల్చిన ఆ సగం కూడా అందరికీ అందుబాటులో వున్నాయా?? ఎంతమంది ఈ కాలం పది తరువాత చదువుతున్నారు?? చదవగలుగుతున్నారు??? అవినీతిపై ఉద్యమాలు చేస్తారు కాలరెగరేస్తారు...అదే అంటరానితనంపైనంటే ఆమడ దూరం పారిపోతారు....

కులపిచ్చి ప్రేమా మాకొద్దు...

12, జూన్ 2011, ఆదివారం

బాబాల దగ్గరున్న ఆస్తులను ముందు ప్రజల పరం చేయాలి..






అవినీతి వ్యతిరేక పోరాటం జరుగుతున్న సందర్భంగా మన దేశంలోని స్వాములు, బాబాల దగ్గరున్న ఆస్తులను ముందుగా జాతీయం చేయాలి. ఎందుచేతనంటే వీళ్ళ దగ్గరకొచ్చే వాళ్ళలో తొంభై తొమ్మిది శాతం మంది అవినీతి రాజకీయ నాయాకులు, లంచగొండి అధికారులు, కాంట్రాక్టర్లే కాబట్టి ప్రజల సొమ్మును అప్పనంగా దోచి పాపభీతితో కొంత వీళ్ళకు దానం చేయడమో, లేక వీళ్ళ దగ్గర దాచుకుంటే ఏ ఆదాయపు పన్ను శాఖ వాడి కళ్ళూ పడవని, వీళ్ళ పళ్ళూడవని ధైర్యంతో దాచుకుంటున్నందున వీళ్ళ ఆస్తులను ముందుగా జప్తు చేయాలి. బాబాల దగ్గర వేలాది కోట్ల రూపాయలు పోగుపడడం చూస్తుంటే ఇదంతా లెక్కకు మించి దాగిన నల్లధనమే అనిపిస్తోంది..


అవినీతి వ్యతిరేక పోరాటానికి సంఘీభావంగా కూచున్న రాందేవ్ బాబా ప్రకటించిన పదకొండు వందల కోట్లు ఆసనాలు వేస్తె వచ్చాయా? అలా అయితే వీధుల్లో ఈటీ వేషాలు వేస్తున్న వాళ్ళు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? ఇది అలా వుంచితే ఇంకా ఈయన గారికి అనేక కంపెనీలలో షేర్లున్నాయి. వాటిని లెక్కపెట్టలే.. ఈ మధ్య కుళ్ళబెట్టి చంపిన సత్య సాయి బాబా దగ్గర లక్షల కోట్లు మూలుగుతున్నాయి. వీటిని ఆ ట్రస్ట్ పేరుతో దొబ్బేయక ముందే ప్రభుత్వం జప్తు చేయాలి. ఇప్పటికే టన్నులకొద్దీ బంగారం బెంగళూరు తరలిపోయిందంటున్నారు. ఇంక విదేశాలకు చేరక ముందే వీటన్నింటిని స్వాధీనం చేసుకోవాలి.. అలా అయితే ఏ ప్రపంచ బ్యాంకు దగ్గరా అప్పుకోసం మోకరిల్లనక్కర్లేదు.

గణపతిసచ్చిదానంద, కల్కి బాబా (ఈయన ఆశ్రమంలో మానభంగాలు, మర్డర్లు జరిగినాయన్నది ఎవరూ పట్టించుకోలేదు) మొ.న బాబాలు, అమ్మల దగ్గర ఎంత మూలుగుతుందో? భక్తి మాటున ఈ ఆశ్రమాలలో జరుగుతున్న వ్యాపారాలను ఇంకా ఈ శతాబ్ధంలో కూడా మూగగా చూస్తూ వూరుకోవడం చూస్తుంటే పాలక ప్రతిపక్షాల వాటా కూడా తేల్చాలి. వీటన్నింటిపై అన్నా హజారే గారు దృష్టి పెట్టాలి. ఇవన్నీ నల్లధనంలో భాగమే...

అవినీతి వ్యతిరేక పోరాటం వర్థిల్లాలి.

12, ఏప్రిల్ 2011, మంగళవారం

రాముడి నేరాలు

రాముడ్ని దేవుడ్ని చేసి కొలిచే ముందు ఆ రాజు చేసిన నేరాల గూర్చి ఆలోచిద్దాం...

యజ్న యాగాల పేరుతో వేలాది పశు సంపదను బలిచ్చే నాటి మతాధిపతులను వ్యతిరేకించిన తాటకి, మారీచ, సుబాహులను హత్యచేయడం.. తాటకిని హత్యచేయడంతో మొదలైనది ఆ తరువాత శూర్పనఖ ను ముక్కు చెవులు కోయించి హింసించడంతో రాముడు స్త్రీ ద్వేషి అన్నది అర్థమవుతోంది...

అలాగే శూదృడైన శంభూకుడు తపస్సు చేయడాన్ని నేరంగా పరిగణించి తలతీయించడం...

కట్టుకున్న భార్య సీతను ఆమెకు తండ్రి వరసైన రావణాసురుడు వనవాసం నుండి తప్పించడానికి తీసుకుపోతే ఆమెను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించడం ఎలా సమర్థించగలం... అగ్నిలో దూకిన వాళ్ళెవరైనా తిరిగి బతుకుతారా? అంటే ఒకటో సీత హత్య కావింపబడ్డదన్నమాట...

ఇంక రెండో సీతను గర్భవతిగా వున్నప్పుడు అడవులకు పంపడం... అడవిలో వున్న పిల్లలపై తన తమ్ముళ్ళతో కలిసి యుద్ధం చేయబూనడం...

యిలా ఈ రాముడి చరిత్రంతా స్త్రీ ద్వేషిగాను, శూద్ర ద్వేషిగాను, అనుమానపు పక్షిగా పరిపాలనలో కరువు కాటకాలుతో జనం అల్లాడడం వంటివి (విశ్వామిత్రుడు కుక్కమాంసం తినడం) వున్నా వాటిని కప్పిపుచ్చుతూ రాజరికాన్ని బలోపేతం చేయడం కోసం రామున్ని దేవుణ్ణి చేసారు..


5, మార్చి 2011, శనివారం

శాపం...

జారిపోతున్న గుండెనిబ్బరాన్ని
తిరిగి నిలబెట్టుకోవడానికి
జీవితమే యుద్ధంగా మారుతున్న
కాలాన...

కాల యముడిలా
అడ్డు నిలుస్తున్న
ఆర్థిక అసమానతతో పాటు
ఆత్మగౌరవం కోసం
ఆరాటపడాల్సి రావడం
విషాదం...

నోటికందిన
కూడు కడుపుదాకా
చేరేలోపే డొక్కలో
తగిలిన నీ తాపు
నా వెన్నును నిటారుగా
నిలబెట్టింది...

నా చేతిలోని
పుస్తకాన్ని
చించి పారేయ జూస్తున్న
నీ ముళ్ళ చేతులు
విరిగే రోజు
దగ్గర పడింది..

నా ఫీజు డబ్బులతో
కట్టుకున్న నీ
కార్పొరేట్ శిఖరం
కూలక మానదు.....

(ఫీజు రీయింబర్స్ మెంటు వస్తుందో రాదోనన్న అనుమానంతో ఇటీవల ఆత్మత్యాగం చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిస్మృతిలో)

15, డిసెంబర్ 2010, బుధవారం

అంటరానితనం బలిగొన్న ఓ నిండుప్రాణం



హైదరాబాదులోని విల్లా మేరీ కాలేజీలో బండి అనూష అనే ఈ అమ్మాయిని తోటి విద్యార్థినులు తాను దళిత కులానికి చెందినదని తెలిసిన తరువాత ఆమెపట్ల వ్యవహరించిన తీరుతో విసుగుచెంది అనూష ఆత్మహత్య చేసుకుంది. ఇది గత నవంబర్ ఐదో తారీఖున జరిగింది. తాను ఆత్మ హత్య చేసుకోబోతున్నట్లు తన తోటి విద్యార్థినులకు చెప్పినా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదంట. ఆమె తన తండ్రికి చివరి సారిగా బై డాడ్, నేను చనిపోతున్నా అని రాసిపెట్టింది. ఆమె తండ్రి తన కూతురి పట్ల జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆమె కులం తెలిసినప్పటినుంచి వాళ్ళు ఆమెను ఒంటరిగా ప్రత్యేకంగా ఓ బెంచీలో కూచోపెట్టారని చెప్పారు. ఇలా ఓ దళిత విద్యార్థిని జీవితాన్ని బలిగొన్న అంటరానితనమన్న ద్వేషాన్ని, అగ్రకుల దురహంకారాన్ని తిట్టకుండా వుండగలమా? అంతటితో ఈ సమస్య తీరుతుందా? మనిషి ఎక్కడికో ఎదిగిపోతున్నాడన్న అపోహలలో వుంచే మేధావులు మనమెక్కడుండిపోయామో గుర్తెరిగితే చాలు..

అనూషలాంటి మరో విద్యాకుసుమం రాలిపోకుండా కాపాడుకుందాం...

వివరాలకు


6, డిసెంబర్ 2010, సోమవారం

బాబా సాహెబ్ బాటను వీడుతున్నామా?



బాబా సాహెబ్ అంబేద్కర్ వర్థంతి రోజున ఈ ప్రశ్నను మనం వేసుకోవాల్సిన అవసరముందనిపిస్తోంది. రాజ్యాధికారం కోసం అణగారిన వర్గాలు తమ ప్రయత్నంను ముమ్మరం చేయాల్సింది పోయి దళారీ వలసవాద పాలక వర్గాలకు కొమ్ము కాస్తూ, వారు విసిరేసిన ఎంగిలిమెతుకుల లాంటి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులనుభవించడానికి పాకులాడటం వలన అసలైన రాజ్యాధికారానికి ఆమడ దూరం జరిగి పోతున్నామన్న విషయాన్ని మరిచిపోతున్నాం. ఈ పార్లమెంటరీ రాజకీయ ఊబిలో కూరుకుపోతూ మన ఉనికికే ప్రమాదకరంగా మారుతున్న ప్రపంచీకరణ, సంస్కరణ రూపాల మాయలో కొట్టుకుపోతున్నాం. అధికారమిచ్చే మత్తులో పడి తమ మూలాలను విడిచిపెట్టడం వలన మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. కావున ఈ దినాన్ని మరో మారు బాబా సాహెబ్ ను అధ్యయనం చేయడానికి, తద్వారా మన అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఓ సరికొత్త వెలుగులో పయనిద్దామని ప్రతిన బూనుదాం...
జై భీం..